S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

04/20/2016 - 22:09

ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా విషయము తెలియాలంటే, అప్పటివరకు మనిషి ఆ విషయంమీద చేసిన పరిశోధనలని తెలుసుకొని దానిని ఒక క్రమబద్ధీకరణలో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషి కొత్త విషయాలను కనుగొనగలడు.

04/19/2016 - 21:19

పుట్టుకరీత్యా పెద్దగా తేడాలు కనిపించకపోయినా, స్వభావరీత్యా స్ర్తి, పురుషుల మధ్యగాని ఆ మాటకొస్తే మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. తేడాలు మనిషికీ మరో మనిషికి మధ్య అడ్డుగోడలుగా వుండిపోతుంటాయి. అందుకు ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే! తనలోని మేలైన ఆలోచనలతో, మెరుగైన సమన్వయ ధోరణితో దైవత్వాన్ని ఆవిష్కరించుకోలేకపోవడమే!

04/17/2016 - 22:34

సత్యం, ధర్మం, శాంతం, ప్రేమ అనేవి మానవ ధర్మములు. వాటిని నిరంతరం ఆచరణలో పెట్టిననాడు మానవుడు విజ్ఞాని కాగలడు. సత్యం అనేది ఎల్లప్పుడూ పలుకుతూనే వుండాలి. సత్యం వలన మనిషి జీవితం ధన్యం కాగలదు. ధర్మం కూడా దాదాపు అటువంటిదే. ధర్మం పాటించినవారికి చానవమార్గం, ధర్మమార్గం, సత్యసంధతను కలిగిస్తాయి.

04/16/2016 - 22:20

మానవునికి భగవంతుని చేరుకొనుటకు అనేక మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది సేవ. సేవ అంటే ఏలాంటి ఫలాపేక్ష లేకుండా పరులకు సహాయాన్ని అందించడం. ‘మానవ సేవయే మాధవ సేవ’ అందుకే సేవ అత్యంత విశిష్ఠస్థానం ఆక్రమించుకొన్నది. భగవత్ప్రసాదితంగా లభించిన ధనాన్ని, శక్తిని, సంపదను సాధ్యమైనంత వరకు మానవ సేవకు వినియోగించాలి.

04/15/2016 - 22:43

‘‘ఎవ్వనిచే జనించు జగమివ్వని లోపల నుండ లీనమై’’ అంటూ ఈ చరాచర ప్రపంచం ఎవరివల్ల పుడుతుందో, ఎవరిలో లయం అవుతుందో ఆత్మభవుడైన ఆ ఈశ్వరుని శరణు వేడుతున్నాను అంటూ ఆర్తుడై, ఆర్తత్రాణ పరాయణుడైన ఆ విష్ణువును ఆర్తిగా ప్రార్థించాడు గజేంద్రుడు భాగవతంలో భగవంతుని, భక్తిని కలిపే సాధనం భక్తి.

04/15/2016 - 22:03

మధురాతి మధురం రామనామం. రామకథ ఎన్నిసార్లు విన్నా, రామనామం ఎన్నిసార్లు పలికినా ‘రామ’ అనే రెండక్షరాల మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటాయ. సర్వ జగద్రక్షుడైన శ్రీరాముని నామస్మరణం ఎంతో విశిష్టమైనది అని భారతీయ పురాణాలన్నీ పల్కుతూన్నాయి. విష్ణుమూర్తి యొక్క ప్రతినామజపం మనలోని చెడును నశింపజేస్తుంది.

04/14/2016 - 03:52

దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు అయిదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము.

04/13/2016 - 05:20

ప్రపంచంలో అనేక జీవరాసులు ఉన్నాయి. ఏ జీవులకు లేని వరం మానవునికి వుంది. అదే మాట. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. మిగతా జీవుల నుండి వేరు చేసి మనిషిని ఉన్నత స్థితిలో నిలబెట్టింది మాట.
ప్రతి మనిషికి ఒక స్థాయి ఉంటుంది. ఈ స్థాయి మనిషికి మాటవలన ఏర్పడుతుంది. మనిషి మాట్లాడే మాటలవల్ల స్థాయి వ్యక్తవౌతుంది. వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుంది.

04/11/2016 - 01:07

నిగ్రహం, సదాచారం లాంటి సద్గుణాలు ఎవరికి ఉన్నాయ అని నాడు వాల్మీకి నారదుణ్ణి అడిగి తెలుసుకొన్నా, మాతృప్రేమ, పితృప్రేమ, భ్రాతృప్రేమ, ఏకపత్నీవ్రతం, ఎవరి లక్షణాలు అని పరిశోధించినా, పఠనం చేసి తెలుసుకున్నా జవాబుమాత్రం రాముడే. రామ అన్నపదం.... శబ్దం....

04/10/2016 - 06:01

శ్రీకృష్ణుని చేతిలో తన అన్న శిశుపాలుడు మరణించాడని తెలుసుకొన్న సాల్వుడు (్భష్మునితో యుద్ధం చేసిన సాళ్వుడు వేరు) ద్వారకపై దండెత్తడానికి సకల సన్నాహాలు చేయడం మొదలుపెట్టాడు. ద్వారకపై దండెత్తడమంటే చాలా కష్టం. ఎందుకంటే శత్రు దుర్బేధ్యమైన కోటలు రక్షింపబడుతూ వుంటుంది. సముద్రమే నలువైపుల రక్షణగా ఉన్న ద్వీపం ద్వారక. సాల్వుడు ద్వారకపైకి దండెత్తబోయే సమయానికి కృష్ణుడు ఇంకా అక్కడికి రాలేదు.

Pages