S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

10/07/2016 - 21:33

భద్రకాళీ రూపం తాల్చి పరశుధారచేత క్రూరరాక్షసుణ్ణి సంహరించిన భీకర మూర్తియున్ను విష్ణు వక్షస్స్థలం అనే గగన తలంలో చంద్రకళ అయిన ప్రసన్నమూర్తియున్ను అయిన ఆ శ్రీమహాలక్ష్మిదేవిని అగస్త్య వౌని సద్భక్తితో సందర్శించాడు.

10/06/2016 - 20:57

క్లేశాన్ని, సౌఖ్యాన్ని, శీఘ్రంగా అగస్త్యముని కాశీ వియోగమూ దక్షిణ కాశీ సమాగమం క్రమంగా కలిగిన కారణంగా తెలుసుకొన్నాడు.
పరోపకార పరాయణుడికి సంపదలు పుంఖానుపుంఖంగా సంభవిస్తాయి. పుణ్యతీర్థ స్నానం, దానాలు, మంత్రజపాలు, హోమాలు, దేవతలని అర్చించడం మున్నయినవి పరోపకారం ఒనర్చడంతో సాటిరావు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు.

10/05/2016 - 22:42

మంచి గంధపు పూతచే తెలుపెక్కిన స్తన మండలాలు కలవి అయిన దిశావధువులందు రుచితో- కాంతితో - ఇనుడు (సూర్యుడు, భర్త) ప్రకాశించాడు.

10/05/2016 - 04:52

ఆకాశ మార్గాంచలాలలో వున్న చంద్ర బింబాన్ని కాంచి, సైంధవ లవణ శిలలని ఎంచి రథ తురంగాలు మోరలు సాచి నాకడం కోసం ఎగబడుతున్నాయి. ఇన్ని విధాల ఆటంకాల లోపిచ్చుకుంటు అనూరుడు తహతహలాడుతూ, హుంకరిస్తూ బంగారు గిలకల చెర్నాకోల విసరి, కసరుతూ ఆకాశ వీధిని స్వర్ణరథం అశ్వాలను దుర్వారలీలతో త్రోలసాగాడు.

10/02/2016 - 21:05

ఈ అగస్త్యుడు కోపనుడు. ఆ మహర్షి యిప్పుడు కోపోదగ్రుడై శాప విషం ప్రయోగించి చంపదలిస్తే నాకు ఎవరు అడ్డం వస్తారు? మేరు మహామహీధరం ప్రస్తుతానికి శంకలేక నిశ్చింతగా వుండుగాక!’’ అని అగస్త్యుడిని మరలి రాకని కోరుకుంటూ వింధ్యాచలం పెరుగుదల లేనిదై నాటినుంచి నేటివరకు ఆ విధంగానే భూమిలో అణిగి వుండిపోయింది.

10/01/2016 - 21:09

బంగారు శిఖరాగ్ర భాగాల శృంగాటకాల చేత బ్రహ్మాండ కర్పరాన్ని- లేక కటాహాన్ని (కప్పుని) చొచ్చుకొని పోతున్న తన ఔన్నత్యాన్ని నేలతో సరి సమానంగా వంచి వింధ్య పర్వతం ఆ మహానుభావుడైన అగస్త్య మహర్షికి ఎదురుగా అరిగింది. అంత సూర్యరథం చక్కగా, సరాసరిగా సాగింది. సప్త వాయుస్కంధాల నిర్బంధం తొలగిపోయింది. చంద్రుడు వెనె్నలలు చిందించసాగాడు.

09/30/2016 - 20:41

అనంతరం యక్షరాజుని తలచుకొని అర్మిలి మిక్కిలి అయి, కన్నుల అశ్రుపూరం నించుతాడు. పలుమారు కాశీలోని దండపాణి సౌహార్దాన్ని స్మరించి స్మరించి పలవరిస్తాడు. విశ్వాసపాత్రులున్ను కంచుకులున్ను అయిన సంభ్రముడు, ఉద్భముడు అనే వారిని ప్రీతితో మాటిమాటికి జ్ఞప్తికి ఎలయించుకొంటాడు. దిగ్గజ విఘ్నేశ్వరుడు, అఘోర వినాయకుడు, సిద్ధి వినాయకుడు, కపర్ది వినాయకుడు, చింతామణి గణపతి అనే పంచ వినాయకుల్ని అత్యంతమూ కొనియాడుతాడు.

09/30/2016 - 20:58

సర్వవిశ్వమూ గ్రహవశం అయి వుంటుంది అనేది గ్రహాపేక్ష. నాకు అరసి చూడగా దైవ ప్రేరణవల్ల శుభాశభకర్మలు, సుఖదుఃఖాలు ఆపాదించపబడతాయి. భగవంతుడు ఎవడిని రక్షింపదలుస్తాడో అట్టివాడి చేత పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఎవడిని చెడ్డవాడిగా చేయదలచుతాడో వాడి చేత పాపకృత్యాల్ని ఒనరింపజేస్తాడు. కర్మాశయం అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం అనే పంచక్లేశాలవల్ల కదా ఏర్పడటం. ఆ కర్మఫలాన్ని ఇహపరలోకాలలో జీవులు అనుభవిస్తారు.

09/29/2016 - 05:10

‘‘ఆ మచ్చిక, ఆ చనవు, ఆ అనురాగతిశయమున్ను వివరించి చెప్పవశము కాదు. భూవలయ తిలకుడు అయిన ఓ కాశీక్షేత్రమా! నిన్ను విడిచి పరభూమికి ఏ విధంగా పోగల్గుతాను? ఊర్థ్వ బాహుడిని అయి ముమ్మాటికీ నిక్కమే వక్కాణిస్తాను. నా సత్యవాక్కుకి వేదవాణి, జాహ్నవీనది, పరమశివుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, పరమ సాక్షులు. ఓ పరమ శివుడి కూర్మి పట్టణమూ, ఓ వారణాసీ! ఓ కల్యాణీ!

09/27/2016 - 21:17

ఆ నిటలాంతం నుంచి అది అధోముఖం అయి వ్రేలాడుతూ వుంటుందని తదెజ్ఞులు- అనగా యోగవిద్యావేత్తలైన ఆర్వులు వచిస్తూ వుంటారు.

Pages