S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

09/25/2016 - 21:17

సంసార సాగరం తరించే సాధనం కనుక ‘తీర్థం’ అయింది. ఆభ్యంతరం అయిన ఈ అవిముక్త తీర్థం- కాశీతీర్థం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఉపలబ్ధి స్థానం అయినందువల్ల ఆ త్రిమూర్తులకి సాధారణమే అయినా మహేశ్వరుడికి ప్రధాన స్థానం అయి వుంటుంది.

09/25/2016 - 00:38

ఆమాట ఇప్పుడు వాస్తవం అయింది. నేను ఈ రీతిగా అశోక మనస్థితిలో వుండగా వూహించని విధంగా ఇదె గొప్ప విఘ్నములు కలిగాయి. విశే్వశ్వర స్వామి నా యెడ విముఖుడు అయాడు సుమా! అట్లు కాని పక్షంలో సకల జీవులకి మోక్ష సంపదకి నిలయం అయిన కాశీక్షేత్ర వియోగ రూప దుఃఖార్తి ఏ విధంగా సంభవిస్తుంది?

09/24/2016 - 02:17

మరికొన్ని ఎండలతో, ఇంకా కొన్ని భరింపనలవికాని చలిగాలులతో చేతనం కోల్పోయి వున్నాయి. జగాలకి అకాండ ప్రళయం ఆవిర్భవించింది. ఈ కాశీక్షేత్రం కల్పాంతకాలంలో అయినా కసుగందక వుంటుంది కనుక ఆ ఉత్పాతం ఇక్కడ కనపడదు. మేము అందరం ఈ మహోపద్రవాన్ని ఉపశమనం కోరి అబ్రహ్మణ్యం చేస్తూ పద్మ సంభవుడిని శరణుచొచ్చాం. ఆ బ్రహ్మదేవుడు మాపై కరుణించి, ఈ ఉత్పాతాన్ని తొలగింపగల సమర్థుడు మైత్రావరుణుడు ఒక్కడే.

09/24/2016 - 02:16

ఆ సాధ్వి చితిలో ఉరికి తదగ్ని శిఖలనుంచి వెల్వడి కలుషాత్ముడైన పతి వెను వెంటనే ఏతెంచుచుండగా భీతచిత్తులై యమభటులు దవ్వుగా తొలగిపోతారు. ఈషణ్మాత్రమూ భీతిల్లిక చితాగ్ని నురికిన పతివ్రత శరీరంలో రోమకూపాలు ఎన్ని వున్నవో అన్ని దివ్య సంవత్సరాలు భర్తతో కలిసి స్వర్గలోకంలో సంతోషాన్ని అనుభవిస్తుంది.

09/22/2016 - 04:32

ఇన్ని తెగల నాతులు చివరికి నాథుని, ఉభయ కులాలవారిని నరకంలో కూలద్రోసి తామూ ఆ నరకంలోనే కూలిపోతారు.

09/20/2016 - 22:11

ఏ ప్రణవ పంచాక్షర బ్రహ్మ విద్యోపనిషత్తు నీ అరచేతి ఉసిరక. ఇంతటి ప్రశస్తికెక్కిన నిన్ను బ్రహ్మదేవుడి ఆన చేత వేడికొనడము కోసరం ఈ కాశికా నగరానికి ఇంత మందిమి కట్టకట్టుకొని వచ్చాము. భువన సంక్షోభకారి అయి ఒక మహోత్పాతం పుట్టుకువచ్చింది. ఆ ఉపద్రవం తొలగిపోయేటట్లు నువ్వు చేసి పెట్టాలి.
బృహస్పతి లోపాముద్రకి పతివ్రతా ధర్మాలు తెలుపుట

09/18/2016 - 23:41

లేళ్లు పిడికెడు చామధ్యానం అడుగుటకై మునికన్యకల రాకకై ప్రతీక్షిస్తున్నాయి. దేవతల అర్చనా సమయంలోని ధూపంతో రోమధూమం జతకట్టుతున్నది. ఉద్ది అవుతున్నది. బ్రహ్మచారుల స్వాధ్యాయ స్వరాల సంశయాన్ని శారికలు, శుకాలు విచారణ చేస్తున్నది. కాశీకపురికి కోసు దవ్వులో భాగీరథీ గంగని కలు ప్రదేశంలో సత్యలోకానికి అనుప్రాసగా ఈ ఆశ్రమం కానవస్తున్నది. అటువంటి అగస్త్య మహాముని పర్ణశాలని వారు సమీపించారు.

09/18/2016 - 23:26

మహాశ్మశాన క్షేత్రమైన కాశిలో స్థిర వాసం వున్న చిన్నారి పొన్నారి చిరుత కూకటిప్రాయపు దిస్స మొలవటువు కూడా ప్రళయ రాత్రివేళ ఆగ్రహంతో ఏతెంచే మృత్యుదేవత మునిపండ్లని పెరికివేయగలడు.
ఈ కాశీ పుణ్యక్షేత్రం కల్పంతరాలు ఎన్ని గడచిపోయినా నశింపదు. శిథిలం కాదు. ఇంద్రులు ఎందరు గతించినా వికాసం కోల్పోదు. మన్వంతరాలు ఎన్ని గతించిపోయినా ఎన్నడూ పసిమి తగ్గదు.

09/17/2016 - 01:20

మహాశ్మశానం అనీ, రుద్రావాసం అనీ, కాశీ అనీ, వారణాసి అనీ, అవిముక్తక్షేత్రం అనీ, లోలార్క కేశవులు, వింటికొనల జంటయూ, గంగానది అల్లెత్రాడున్ను, శాశ్వత ధర్మం శరమున్ను, కలి లక్ష్యమున్ను, విరూపాక్షుడు (త్రినేత్రుడు) విలుకాడుగా, మోక్షపురంధ్రీ భూలతని అనుకరించేదిన్నీ, చంద్ర రేఖాచ్ఛాయా ప్రకారం కలదిన్నీ, అయి కాశీనగరం కోదండాన్ని పోలి విశే్వశ్వర మహాదేవుడికి అఖిల దేవతా సార్వభౌముడికి త్రైలోక్యసామ్రాజ్య పట్ట్భాషేకా

09/16/2016 - 08:42

తీర్థోపవాసులకి వస్త్రాలు, కనకం, చందనం, కర్పూరం, కస్తూరి, కంకుమ, కండచక్కెర, పిండివంటలు (అపూపాలు), పప్పు, నెయ్యి, పెరుగు, పాలు, పండ్లు ఆదిగాల తర్పణ ద్రవ్యాల్ని, చర్మ నిర్మిత పాదరక్షలు, దారుకృత పాదుకలు, గొడుగులు, కమండలువులు, దండాలు, కంబళ్లు, వీవనలు, చామరాలు, కౌపీనాలు, శాటులు, బరిణలు, తైలం, లవణం, వంటకట్టెలు, ప్రముఖ పదార్థాలతో పరితుష్టి ఒదవించి, విశుద్ధ హృదయులు, ప్రసన్నాత్ములు శ్రుతి, స్మృత్మాదుల చే

Pages