S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2017 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 22: అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన నల్లకుబేరులను కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. తమ కళ్లు గప్పి అక్రమ ఆస్తులను దాచిపెట్టలేరని, కనుక ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) పథకం కింద ఒకేసారి అన్ని అప్రకటిత ఆస్తులను వెల్లడించి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదాయ పన్ను విభాగం వారికి స్పష్టం చేసింది.

01/23/2017 - 01:00

కడప, జనవరి 22 : పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులను వెలికితీసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులే నడుం బిగించారు. ఫిబ్రవరి 1వ తేది నుంచి బ్యాంకులు, తపాల శాఖలపై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తామని ఐటి అధికారులు హెచ్చరిస్తున్నారు.

01/23/2017 - 00:59

న్యూఢిల్లీ, జనవరి 22: విదేశాల్లో భారత సంస్థల మొత్తం ప్రత్యక్ష పెట్టుబడులు గత నెలలో 32 శాతం పెరిగి 2.49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కంపెనీల పెట్టుబడులకు సింగపూర్ ప్రధాన గమ్యస్థానంగా ఆవిర్భవించింది. డిసెంబర్‌లో భారత సంస్థలు సింగపూర్‌లో 2.06 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ దేశంలో పెట్టుబడులు పెడతామని భారత కంపెనీలు హామీ ఇచ్చిన మొత్తం సొమ్ములో ఇది 82.5 శాతం కంటే ఎక్కువ.

01/23/2017 - 00:58

న్యూఢిల్లీ, జనవరి 22: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో పాటుగా కార్పొరేట్ ఫలితాలు, రాబోయే కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు ఈ వారం మార్కెట్ తీరుతెన్నులను నిర్ణయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

01/23/2017 - 00:55

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా ముందుకు వెళుతోందని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రావెంకటేశం పేర్కొన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో జరుగుతున్న జాతీయ టూరిజం సదస్సులో ఆదివారం ఆయన మాట్లాడుతూ, పర్యాటకాభివృద్ధికి అనేక అవకాశాలున్నప్పటికీ, ఇప్పటి వరకు పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదన్నారు.

01/23/2017 - 00:54

హైదరాబాద్, జనవరి 22: అధిక ఇంధన సామర్ధ్యం కలిగిన సరికొత్త శ్రేణికి చెందిన సిమోటిక్స్ ఒన్ ఎల్‌ఇ7 మోటార్‌ను సీమెన్స్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. అధిక ఇంధన సామర్ధ్యాన్ని మోటార్లు అందిస్తాయని సీమెన్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ భాస్కర్ మండల్ తెలిపారు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జీవితకాలపు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందన్నారు.

01/23/2017 - 00:54

న్యూఢిల్లీ, జనవరి 22: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ) పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) సోమవారం మార్కెట్లోకి రానుంది. ఒక దేశీయ స్టాక్ మార్కెట్ పబ్లిక్ ఇష్యూకు రావడం ఇదే మొదటిసారి కాగా, ఈ ఏడాది వస్తున్న తొలి ఐపిఓ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నెల 23న ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 25తో ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా బిఎస్‌ఇ రూ. 1234 కోట్లు సమీకరించాలని అనుకొంటోంది.

01/23/2017 - 00:44

ముస్లింలకు పనె్నండు శాతం ‘ఆరక్షణల’ను కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం వారు పదే పదే ప్రకటించడం విచిత్రమైన వ్యవహారం. మత ప్రాతిపదికపైన ‘రిజర్వేషన్’-ఆరక్షణ-లను కల్పించడం భారత రాజ్యాంగ విరుద్ధం. ఈ నిబంధనను, ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యా సంస్థలలోను రిజర్వేషన్‌లు కల్పించింది.

01/23/2017 - 00:42

విశ్వంలోనే అత్యుత్తమ జీవన విధానంగా భారతీయత వినుతి కె క్కింది. ‘అహింసా పరమో ధర్మః’ అన్న వేదోక్తి మానవులందరూ అహింసా ప్రవృత్తిని అలవరచుకొని, వైషమ్యాలు పక్కనపెట్టి సమైక్యంగా కలిసిమెలిసి జీవించాలని బోధిస్తోంది. ప్రార్ధించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అంటూ భారతీయత సమాజసేవ వైశిష్ట్యాన్ని చాటి చెప్పింది.

01/23/2017 - 00:40

‘సైకిల్ పోతే పోయింది.. కొడుకు దక్కాడు’ అ నుకున్నాడు చివరికి సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు, ‘నేతాజీ’ బిరుదాంకితుడు జనాబ్ ములాయం సింగ్ యాదవుడు. ‘కొడుకు సైకిల్ నీదే నాన్నా. పార్టీ ‘పిత’వు కూడా నువ్వే. కాకపోతే సైకిల్ మీద స్వారీ, పార్టీమీద పెత్తనం నాకొదిలెయ్’ అంటున్న కొడుకు అఖిలేష్ మీద కత్తులు నూరడం వల్ల లాభమేమిటి? రాజకీయాలలో గెలుపుమాట దేవుడెరుగు- కడుపు తీపి మాటేమిటి?

Pages