S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 23:08

ఆదిలాబాద్, జనవరి 22: సమైక్యపాలనలో దగాపడ్డ పంచాయతీల్లో వౌలిక వసతులతో పాటు సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమస్ఫూర్తితోనే అభివృద్ధికి బాటలు వేస్తున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మావల పరిధిలోని షాద్‌నగర్, ఖోజా కాలనీ, దుర్గానగర్ వార్డులతో పాటు మావల గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.

01/22/2017 - 23:06

పాన్‌గల్, జనవరి22: రేమద్దుల గ్రామానికి చెందిన ప్రహ్లాద(28), మల్లమ్మ(24) దంపతులు ఆదివారం గ్రా మ సమీపంలోగల గొల్లకుంట ఇసుక బావి వాగు వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

01/22/2017 - 23:06

మహబూబ్‌నగర్, జనవరి 22: ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగుబలహీన వర్గాలకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఒబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో బిసిల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు.

01/22/2017 - 23:05

మహబూబ్‌నగర్, జనవరి 22: బిసిలు చైతన్యవంతులుగా తయారు కావాలని అందుకు చదువుకున్న వ్యక్తులు, మేదావులు ఐక్యంగా ఉంటూ ప్రజలను చైతన్య పరచాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం బిసి సంక్షేమ సంఘం కార్యాయలం, ఉపాధ్యాయ సంఘం కార్యాలయాలను ఆయన వేర్వేరుగా ప్రారంభించారు.

01/22/2017 - 23:05

మహబూబ్‌నగర్, జనవరి 22: ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలతో ముస్లింలు అభివృద్ధి చెందడానికి ఎ ంతగానో తోడ్పాటు ఉంటుందని టిఆర్‌ఎస్ రా ష్ట్ర నాయకులు ఇంతియాజ్ ఇసాక్ తెలిపారు.

01/22/2017 - 23:04

మహబూబ్‌నగర్, జనవరి 22: మన్యంకొండ గుట్టలపై పోలీసులు సందడి చేశారు. పర్వతారోహణ వ్యాయామం అంటూ పోలీసులు మహబూబ్‌నగర్ మండల పరిధిలోని మన్యంకొండ గుట్టదగ్గరకు ఉదయానే్న చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన పోలీసులు రోడ్డు మార్గం కాకుండా మధ్యలోనే గుట్టలపైకి ఎక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

01/22/2017 - 23:03

సిద్దిపేట, జనవరి 22 : సిద్దిపేట నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు సహకరించటం అభినందనీయమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ఫ్యాషన్ స్డూడియోలో స్వైప్ మిషన్ ద్వారా లావాదేవీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేయటంతో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం క్యాష్‌లెస్‌ను ప్రోత్సహిస్తుందన్నారు.

01/22/2017 - 23:02

తొగుట, జనవరి 22: యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోకుండా ఉన్న ఊరిలోనే వనరులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ముత్యంరెడ్డి అన్నారు. యువత మేలుకో కార్యక్రమంను ఆదివారం తొగుటలోని కోటిలింగాల గుడి ఆవరణలో ప్రారంభించి మాట్లాడారు.

01/22/2017 - 23:02

సదాశివపేట, జనవరి 22: రెండువర్గాలుగా చీలిపోయి రాజీనామాల వరకు దారితీసిన సదాశివపేట మున్సిపల్ పాలకుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సయోధ్య కుదిర్చి తెరదించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్నం విజయలక్ష్మిఒంటెద్దు పోకడను వ్యతిరేకిస్తూ వైస్ చైర్మన్‌తోపాటు మరికొంత మంది సభ్యులు తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే.

01/22/2017 - 23:01

తూప్రాన్, జనవరి 22: మండలంలోని ఇస్లాంపూర్ శివారులో గల రామక్కగుట్ట దేవాలయంలో 277వ రామలింగేశ్వర రుద్రపరిషత్ శని, ఆది వారాలు ఘనంగా జరిగింది. రుద్రపరిషత్ అధ్యక్షులు చాడ మాణిక్యశర్మ ఆద్వర్యంలో ఏకాదశి రుద్రాభిషేకం, శివపంచాక్షరి, అష్టలక్ష్మి, లక్ష్మి గణపతి, హనుమాన్, పాశుపద హోమములు జరిగాయి. అనంతరం తీర్థ ప్రసాదం, మహా ప్రసాదం అందజేశారు.

Pages