S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2017 - 01:30

హైదరాబాద్, జనవరి 22: కేంద్రప్రభుత్వం తాజాగా చలామణిలోకి తీసుకువచ్చిన రెండువేల రూపాయల నోట్లు కూడా ఎక్కువ కాలం చలామణిలో ఉండబోవని పుణెకు చెందిన అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

01/23/2017 - 01:24

లక్నో, జనవరి 22: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌లు సంయుక్తంగానే సమరభేరి మోగించాయి. మతతత్వ శక్తుల్ని తరిమికొట్టే లక్ష్యంతో ఉమ్మడిగానే పోటీ చేస్తున్నట్టు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించాయి. వారాల పాటు జరిగిన మంతనాలు, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడంతో ఎవరెన్ని స్థానాలకు పోటీ చేయాలన్న అంశమూ ఖరారైందని తెలిపాయి.

01/23/2017 - 04:21

సరవాక్ (మలేసియా), జనవరి 22: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరిగిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె పొర్న్‌పవీ చొచువాంగ్‌ను 22-20, 22-20 తేడాతో ఓడించింది. రెండు సెట్లలోనూ సైనా చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది.

01/23/2017 - 01:14

భారత సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి, మూడో వనే్డలో హాఫ్ సెంచరీ చేసే క్రమంలో అతను కెప్టెన్‌గా తన 17వ ఇన్నింగ్స్‌లోనే 1,000 పరుగుల మైలురాయిని దాటాడు. ఎబి డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తూ 18 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను పూర్తిచేయగా, అంతకంటే వేగంగా ఈ ఫీట్‌ను ప్రదర్శించి కోహ్లీ రికార్డు సృష్టించాడు.

01/23/2017 - 01:12

కోల్‌కతా, జనవరి 22: వనే్డ సిరీస్‌లో వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి ఇంగ్లాండ్ బయటపడింది. భారత్‌తో ఆదివారం జరిగిన చివరి, మూడో వనే్డను ఐదు పరుగుల తేడాతో గెల్చుకొని, పరువు నిలబెట్టుకుంది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి వరకూ పోరాడినప్పటికీ, ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌ని కోల్పోయినప్పటికీ, టీమిండియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

01/23/2017 - 01:10

మెల్బోర్న్: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ చేరాడు. జపాన్ స్టార్ కెయ్ నిషికోరితో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో అతను 6-7, 6-4, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.
సానియా జోడీ ఓటమి

01/23/2017 - 01:10

సిడ్నీ, జనవరి 22: ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగడంతో, పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన నాలుగో వనే్డను 86 పరుగుల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో చివరిదైన ఐదో వనే్డ ఫలితం నామమాత్రమవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 353 పరుగుల భారీ స్కోరు సాధించింది.

01/23/2017 - 01:09

మెల్బోర్న్, జనవరి 22: నిన్న ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ నిష్క్రమించగా, ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న నంబర్ ర్యాంకర్ ఆండీ ముర్రే కూడా ఓటమిపాలై వెనుదిరిగాడు. అన్‌సీడెడ్ ఆటగాడు మిచా జ్వెరెవ్ 7-5, 5-7, 6-2, 6-4 తేడాతో ముర్రేపై సంచలన విజయాన్ని నమోదు చేశాడు.

01/23/2017 - 01:07

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో ఆదివారం రెండు అసాధారణ ఫలితాలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే ఓటమితో ఆశ్చర్యానికి గురైన టెన్నిస్ అభిమానులు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ నిష్క్రమణతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.

01/23/2017 - 01:06

ముంబయి, జనవరి 22: రెస్ట్ఫా ఇండియాతో జరుగుతున్న ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు సాధించిన ఈ జట్టు, ఆతర్వాత ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 226 పరుగులకు కట్టడి చేసి, 132 పరుగుల కీలక ఆధిక్యాన్ని అందుకుంది.

Pages