S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 01:59

హైదరాబాద్, జనవరి 20: ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి సినిమా థియేటర్‌లోనూ సినీమా ప్రారంభానికి ముందు న్యూస్ రీల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లఘు చిత్రాలను ప్రసారం చేయించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్లు భద్రత నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

01/21/2017 - 01:57

జీడిమెట్ల, జనవరి 20: ప్రమాదవశాత్తు ఓ పరిశ్రమలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అజిత్ సింగ్ (23), చిన్నాన్న అయిన బిజయ్ సింగ్ (32) కొంతకాలం క్రితం నగరానికి బ్రతుకుదెరువు నిమిత్తం వచ్చారు.

01/21/2017 - 01:54

పట్టణీకరణ, పారిశ్రామిక ప్రాంగణాల విస్తరణ పర్యావరణ పరిశుభ్రతను పాడుచేస్తోందన్నది సర్వోన్నత న్యాయస్థానానికి 2015 మార్చిలో కేంద్ర ప్రభుత్వం నివేదించిన వాస్తవం. ఈ మహా విషయం కొత్తది కాదు, దశాబ్దుల తరబడి మాన్యులు మొదలుకొని సామాన్యుల వరకూ దీని గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు.

01/21/2017 - 01:52

‘జాతీయ నేర గణాంకాల నివేదిక’ తాజా సమాచారం ప్రకారం గత సంవత్సరం రైతు ఆత్మహత్యలు అంతకుముందుకన్నా నలభై రెండు శాతం మేరకు పెరిగాయి. ఒక్క సంవత్సరంలోనే 12,602 మంది అన్నదాతలు, రైతుకూలీలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంటే- సగటున గంటకు ఒకటి చొప్పున రైతు ప్రాణం గాలిలో కలసిపోవడం ఆందోళనకరం. వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు అయిన మనదేశంలో రైతుల దీనస్థితికి పాలకుల విధానాలే కారణం.

01/21/2017 - 01:50

తెలుగువారైన శాతవాహన రాజుల తొలి నివాసం తెలంగాణలోని కోటిలింగాల. ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన వంశీయులు అసహాయ శూరులు, అరివీర భయంకరులు. శాతకర్ణి బ్రాహ్మణుడే, బ్రాహ్మణ చక్రవర్తి అని చెప్పడానికి ఎన్నో చారిత్రక పుస్తకాలలో సాక్ష్యాధారాలున్నాయి. అసలు సిసలు బ్రాహ్మణుడైన గౌతమీపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణేతరుడిగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే.

01/21/2017 - 01:47

విశ్వపటంపై భారత్‌కు సమున్నత స్థానం కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో మరొక భాగం ఇటీవలే ముగిసిన ‘రైజినా డైలాగ్’. వివిధ దేశాల రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు సేకరించి, వాటిని విజయవంతంగా అమలుచేసే బాధ్యతను మనదేశం తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నది. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి వేదికను వాడుకోవడం, అవసరమైతే తగిన వేదికలను రూపొందించుకుంటూ భారత దౌత్యనీతి ముందుకు సాగుతోంది.

01/21/2017 - 01:41

న్యూఢిల్లీ, జనవరి 20: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లేదా దాని అనుబంధ సంఘాలకు చెందిన పాలక వర్గంలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సభ్యుడిగా ఉండవచ్చు? గరిష్ఠ పరిమితి ఎంత? అన్న ప్రశ్నలకు సుప్రీం కోర్టు శుక్రవారం వివరణ ఇచ్చింది.

01/21/2017 - 01:39

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన వివరణతో బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ, కోశాధికారి అనిరుద్థ్ చౌదరీ ఊరట చెందారు. వీరిద్దరూ బిసిసిఐలో తొమ్మిది సంవత్సరాలు పదవిలో లేని కారణంగా మళ్లీ తమతమ హోదాలను నిలబెట్టుకోనున్నారు. కాగా, ప్రస్తుతం బోర్డులో ఉన్న ఉపాధ్యక్షుల్లో ఎక్కువ సీనియారిటీ ఉన్న సికె ఖన్నాను అధ్యక్ష పదవి వరిస్తుంది.

01/21/2017 - 01:39

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సిఫార్సులన్నీ ఉన్నవి ఉన్నట్టు అమలు చేయడం అసాధ్యమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు స్పష్టం చేశాడు. యూనివర్శిటీస్, రైల్వేస్, సర్వీసెస్ క్రికెట్ సంఘాల తరఫున అతను వాదిస్తూ, భారత క్రికెట్‌కు ఎన్నో సేవలు అందిస్తున్న వీటికి సభ్య సంఘాల గుర్తింపు ఉండకూడదనడం సరికాదని వ్యాఖ్యానించాడు.

01/21/2017 - 01:38

మెల్బోర్న్, జనవరి 20: డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించగా, ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకునే అవకాశాలను మెరుగుపరచుకున్న ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేశాడు. మూడో రౌండ్‌లో అతను ‘జెయింట్ కిల్లర్’ శామ్ క్వెర్రీని 6-4, 6-2, 6-4 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.

Pages