S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 01:36

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రయికోస్‌తో కలిసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో సానియా, బార్బరా జోడీ 6-1, 6-4 ఆధిక్యంతో సమంతా స్టొసుర్, షుయ్ జాంగ్ జోడీని ఓడించింది. వీరు తర్వాతి రౌండ్‌లో జపాన్ జోడీ ఎరీ హోజుమీ, మియూ కాటోను ఢీ కొంటారు. కాగా, పురుషుల డబుల్స్‌లో రోహన్ బొపన్నకు చుక్కెదురైంది.

01/21/2017 - 01:34

న్యూఢిల్లీ, జనవరి 20: భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగే రెండు టెస్టులకు నాగపూర్ వేదిక కానుంది. వాస్తవానికి ఈ రెండు టెస్టులు చెన్నైలో జరగాలి. అయితే, లోధా కమిటీ సూచనలను అమలు చేసి తీరాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) పరోక్షంగా సహాయ నిరాకరణను ఆరంభించింది.

01/21/2017 - 01:33

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ ఆడుతున్న వీనస్ విలియమ్స్‌ను ఉద్దేశించి ‘గొరిల్లా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కామెంటేటర్ డౌగ్ ఆల్డర్‌పై వేటు పడింది. జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన అతనిని వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఇఎస్‌పిఎన్ ప్రకటించింది.

01/21/2017 - 01:31

కటక్, జనవరి 20: భారత్ చేతిలో వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 0-2 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టుకు చివరిదైన మూడో వనే్డకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెక్స్ హాలెస్ చేతి వేలి గాయం కారణంగా స్వదేశానికి వెళ్లడం ఆ జట్టును సమస్యల్లోకి నెట్టింది. రెండో వనే్డ జరుగుతున్నప్పుడు హాలెస్ చేతి వేలికి గాయమైంది.

01/21/2017 - 01:30

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసిన న్యూజిలాండ్ బౌలర్లు టిమ్ సౌథీ (5 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (4 వికెట్లు). క్రైస్ట్‌చర్చిలో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్లకు 289 పరుగులు చేసింది

01/21/2017 - 01:28

సరవాక్ (మలేసియా), జనవరి 19: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె ఫినేత్రిని 21-15, 21-14 తేడాతో ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో అజ య్ జయరామ్ 13-21, 8-21 తేడా తో ఆంథోనీ జింటింగ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

01/21/2017 - 01:27

ముంబయి, జనవరి 20: చిరాగ్ గాంధీ అజేయ శతకంతో రాణించడంతో, రెస్ట్ఫా ఇండియాతో శుక్రవారం మొదలైన ఐదు రోజుల ఇరాన్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ ఎనిమిది వికెట్లకు 300 పరుగులు చేసింది. ప్రియాంక్ పాంచాల్ (30), ధ్రువ్ రావల్ (39), మన్‌ప్రీత్ జునేజా (47) కూడా గుజరాత్‌కు తమ వంతు స్కోర్లు అందించారు. రెస్ట్ఫా ఇండియా బౌలర్ సిద్ధార్థ్ కౌల్ 73 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

01/21/2017 - 01:26

విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 20: రాష్ట్రంలో ప్రపంచ అంధుల క్రికెట్ టి20 మ్యాచ్‌ల నిర్వహణ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు తెలిపారు.

01/21/2017 - 01:26

కటక్, జనవరి 20: ఈసారి ఐపిఎల్ వేలానికి భారీ సంఖ్యలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని ఇయాన్ మోర్గాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న తాను కూడా ఈసారి వేలానికి సిద్ధంగా ఉన్నానని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ముందుగా ఖరారైన వివిధ టోర్నీలు, సిరీస్‌ల కారణంగా నిరుడు ఐపిఎల్‌కు ఎక్కువ మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు రాలేకపోయారని తెలిపాడు.

01/21/2017 - 01:23

కటక్: భారత్‌తో జరిగిన రెండో వనే్డలో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఇంగ్లాండ్‌పై ఐసిసి అధికారులు జరిమానా విధించారు. నిర్ణీత ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లను బౌల్ చేసినందుకు జట్టులోని ఆటగాళ్లకు వారివారి మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన మ్యాచ్ ఫీజులో 20 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Pages