S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 02:26

హైదరాబాద్, డిసెంబర్ 20: దేశ విద్రోహ కార్యకలాపాలకు సంబంధించి గత కొనే్నళ్లుగా హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాద అనుమానితుడు సయ్యద్ జకీర్ ఎట్టకేలకు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అరెస్టయ్యాడు. రియాద్ పోలీసులు సయ్యద్ జకీర్‌ను ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు విమానంలో శుక్రవారం పంపించారు. బిజెపి నేతలను హత్య చేయాలనే కుట్ర కేసులో సయ్యద్ జకీర్ నిందితుడు.

01/21/2017 - 02:25

విజయవాడ, జనవరి 20: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపును అందుకుని ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో శుక్రవారం ‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’ అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న చంద్రబాబు తక్కువ వ్యయంతో ఇంటింటికీ ఇంటర్‌నెట్ ఎలా సాధ్యమో వివరించారు.

01/21/2017 - 02:22

న్యూఢిల్లీ, జనవరి 20: తమిళనాడును కుదిపేస్తున్న జల్లికట్టు సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంది. జల్లికట్టును చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆర్డినెన్స్ ముసాయిదా ప్రతిని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు.

01/21/2017 - 02:21

న్యూఢిల్లీ, జనవరి 20:అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెంపొందించుకోవడంతో పాటు పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కలిసి పనిచేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

01/21/2017 - 03:22

వాషింగ్టన్, జనవరి 20: అన్నింటా అమెరికా అగ్రదేశం కావాలన్నదే తన ఆశయం, ఆకాంక్ష అని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. కేవలం పందొమ్మిది నెలల్లోనే రాజకీయ చరిత్రను తిరిగరాసి పగ్గాలు చేపట్టిన ట్రంప్ 45వ అధ్యక్షుడిగా శుక్రవారం లక్షలాది మంది సమక్షంలో పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

01/21/2017 - 02:11

మన ఇంటి పేరు హిపోక్రసీ!
జంతు హింసలో మనకు మనమే సాటి.
అమాయక జీవాలను ఘోరంగా చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకునే క్రూరత్వంలో రాక్షసులు, కిరాతకులు మనముందు బలాదూరు.
అయినా - ఎగ్గు లేకుండా మనం ఒలికించే జీవకారుణ్యాన్ని చూస్తే బుద్ధుడు, మహావీరుడు కూడా మూర్ఛపోవలసిందే.
ప్రస్తుతం మన కారుణ్య మహా ప్రవాహం జల్లికట్టు కోడెలను కుమ్మి, తమిళ తీరాన్ని ముంచెత్తింది.

01/21/2017 - 02:06

హైదరాబాద్, జనవరి 20: రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అనేక కుటుంబాలు అవస్థల పాలవుతున్నారని, రోడ్డు ప్రమాదాలతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర ట్రాఫిక్ విభాగం డిసిపి ఎల్‌ఎస్ చౌహాన్ కోరారు.

01/21/2017 - 02:04

షాద్‌నగర్ రూరల్, జనవరి 20: ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన గంధోత్సవం ఊరేగింపులో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కిందపడిపోగా పక్కనే ఉన్న కొందరు పట్టుకున్నారు. ఈ సంఘటనలో కుడిచేయ వెనుక (వీపు) భాగం గాయాలు తగిలాయి. గంధోత్సవం ఊరేగింపులో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

01/21/2017 - 02:04

హైదరాబాద్, జనవరి 20: పాతబస్తీ అభివృద్ధిపై జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డితో ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ బృందం మరోసారి సమీక్ష నిర్వహించారు. తాజాగా శుక్రవారం కమిషనర్‌ను కలిసిన బృందం పలు అభివృద్ధి అంశాలు, పాతబస్తీలో సుదర్ఘీంగా నెలకొన్న సమస్యలపై సుదర్ఘీంగా చర్చించారు. ముఖ్యంగా ట్రాఫిక్, వౌలిక సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చర్చించారు.

01/21/2017 - 02:01

గచ్చిబౌలి, జనవరి 20:రద్దయిన పాత నోట్లను తీసుకువెళుతున్న మహిళను తనిఖీల పేరుతో బెదరించి, రూ. 8 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. వీరితోపాటు సహకరించిన మరో వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు పూర్వాపరాలు ఆసక్తిరేపుతున్నాయి.

Pages