S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 01:18

ముంబయి, జనవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ప్రపంచంలోని కీలక మార్కెట్లు నష్టాలకు లోనవడం కూడా దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.

01/21/2017 - 01:16

న్యూఢిల్లీ, జనవరి 20: బ్యాంక్ ఉద్యోగులు వచ్చే నెల ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7న ఈ ఆందోళన చేపట్టనున్నారు. బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్లలో పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షల ఎత్తివేత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) స్వయంప్రతిపత్తికి భంగం కలిగించరాదనే డిమాండ్లు కూడా ఉన్నాయి.

01/21/2017 - 01:16

న్యూఢిల్లీ, జనవరి 20: పిఎమ్‌జికెవై క్రింద డిపాజిట్లను స్వీకరించే అవకాశాన్ని సహకార బ్యాంకులకు ఇవ్వడం లేదు కేంద్రం. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ దర్యాప్తుల్లో తేలడమే కారణం.

01/21/2017 - 01:15

న్యూఢిల్లీ, జనవరి 20: ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) సిఫార్సులు చేస్తోంది. డిజిటల్ లావాదేవీల కోసం బయోమెట్రిక్ విధానాన్ని (ఆధార్ కార్డులను) వాడేలా వ్యాపారులను ప్రోత్సహించాలని, ఇందుకు తగ్గట్లుగా ప్రోత్సాహకాలు వస్తే బాగుంటుందని యుఐడిఎఐ సిఇఒ అజయ్ భూషణ్ పాండే పిటిఐకి తెలిపారు.

01/21/2017 - 01:15

న్యూఢిల్లీ, జనవరి 20: దేశీయ అతిపెద్ద ఆటో కంపోనెంట్స్ తయారీదారైన మదర్సన్ సుమి సిస్టమ్ లిమిటెడ్.. ఫిన్లాండ్‌కు చెందిన ట్రక్ వైర్ హార్నెస్ తయారీదారైన పికెసి గ్రూప్‌ను సొంతం చేసుకోనుంది. 571 మిలియన్ యూరోల (్భరత కరెన్సీ ప్రకారం 4,146 కోట్ల రూపాయలు)తో పికెసి గ్రూప్‌ను మదర్సన్ సుమి కొనుగోలు చేయనుండగా, ఒక్కో షేర్‌కు 23.55 యూరోలను ఆఫర్ చేస్తోంది.

01/21/2017 - 01:14

హైదరాబాద్, జనవరి 20: తులిప్ లాజిస్టిక్ దేశీయ సేవలను నిజామాబాద్ ఎంపి కవిత శుక్రవారం ప్రారంభించారు. సరకు రవాణాలో సత్వర సేవలకు సాంకేతిక సాయం అందించడం మంచి పరిణామం అని అన్నారు. అసంఘటిత రంగంలోని లారీ యజమానులు, డ్రైవర్లకు ఇది ఉపయోగపడుతుందని కవిత తెలిపారు. సరకు అన్‌లోడ్ చేసిన తరువాత తిరిగి వచ్చేప్పుడు సహజంగా లారీలు ఖాళీగానే వస్తుంటాయి.

01/21/2017 - 01:12

కోల్‌కతా, జనవరి 20: తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పాత పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన ఆమె దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయిందని, రాష్ట్ర పారిశ్రామిక రంగం కుదేలైందని అన్నారు. సాధారణ ప్రజానీకంతోపాటు వ్యాపారులు, రైతులు, అసంఘటిత రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయని చెప్పారు.

01/21/2017 - 01:10

న్యూఢిల్లీ, జనవరి 20: బేసిక్ మోడళ్లతో సామాన్యుడికి మొబైల్ కలను సాకారం చేసిన నోకియా.. ఇప్పుడు సరికొత్త హంగులతో నేటి యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. నోకియా బ్రాండ్ పేరిట హెచ్‌ఎండి గ్లోబల్ తయారుచేస్తున్న ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లకు విపరీతమైన ఆదరణ కూడా కనిపిస్తోంది. చైనా మార్కెట్‌లో నోకియా 6ను శుక్రవారం విడుదల చేయగా, కేవలం నిమిషం వ్యవధిలో స్టాక్ అయిపోవడం గమనార్హం.

01/21/2017 - 01:08

బీజింగ్, జనవరి 20: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, వేగవంతమైన వృద్ధిరేటు కలిగిన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాలను నడిపించే ఆర్థిక వ్యవస్థ. ఇవీ.. చైనా ఆర్థిక వ్యవస్థ పరిచయానికి ముందు ఇప్పటిదాకా వాడుతున్న విశేషణాలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయినట్లే కనిపిస్తోంది. అవును మరి.. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకే సవాల్ విసిరిన డ్రాగన్ ఎకానమీ మందగమనంలో పడింది.

01/21/2017 - 01:07

ముంబయి, జనవరి 20: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. మరో మూడు నెలలపాటు తమ ఆఫర్లను పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి నుంచి మార్చి ఆఖరు వరకు ఆఫర్లను పొడిగించిన జియో.. జూన్ చివరిదాకా దీన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి కొంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Pages