S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 02:49

హైదరాబాద్, జనవరి 20: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు దసరా పండుగ సందర్భంగా అవార్డులు ఇవ్వాలని, అయితే లోగడ ఇచ్చిన అవార్డుల పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

01/21/2017 - 02:48

శ్రీనగర్, జనవరి 20: ప్రజలెవరూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది. అంతేకాదు ధైర్యం ఉంటే 15 నిమిషాల పాటు తన సొంత ఇంట్లో కానీ, సొంత ఊరులో కానీ ఎలాంటి భద్రతా లేకుండా ఉండాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నాయకులను సవాలు చేసింది.

01/21/2017 - 02:47

హైదరాబాద్, జనవరి 20: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఐఎస్‌ఐఎస్) సానుభూతిపరుల అరెస్టులో తెలంగాణ మూడో స్ధానంలో నిలిచింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గత ఏడాది దేశ వ్యాప్తంగా ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసి మొత్తం 112 మంది సానుభూతిపరులను అరెస్టు చేసి 32 కేసులను నమోదు చేసింది.

01/21/2017 - 02:46

హైదరాబాద్, జనవరి 20: నకిలీ కరెన్సీ కేసులో ముగ్గురు నిందితులకు హైదరాబాద్ ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు విధించిన శిక్షనే ధ్రువీకరిస్తూ జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఎన్‌ఐఏ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను సవాలు చేస్తూ నిందితులు మసూద్ అక్తర్, మహ్మద్ షఫీ, షేక్ ఆక్రం హైకోర్టులో అపీల్ చేశారు.

01/21/2017 - 02:45

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కేంద్రీకృత చట్టాన్ని రూపొందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సంప్రదాయ యూనివర్శిటీలు, స్పెషలైజ్డ్ వర్శిటీలు, టెక్నాలజీ వర్శిటీల్లో ఒక్కో యూనివర్శిటీకి ఒక్కో చట్టం అమలులో ఉంది. ఆయా యూనివర్శిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు సమావేశమై తమతమ చట్టాలకు స్వల్ప సవరణలను ప్రతిపాదిస్తే దానిని శాసనసభ ఆమోదించి అమలులోకి తెస్తుంది.

01/21/2017 - 02:45

హైదరాబాద్, జనవరి 20: మద్యం షాపులనుంచి సేవా పన్ను వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ షాపు యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని మద్యం షాపులు అదనంగా రూ.400 కోట్ల మేరకు సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ వైన్ డీలర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు డి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు.

01/21/2017 - 02:44

చిత్రం..ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి అశేషంగా హాజరైన అభిమానులు, ప్రజలు

01/21/2017 - 03:17

హైదరాబాద్, జనవరి 20: పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా సొసైటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ఇప్పటికే స్థలం కేటాయించడంతో భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

01/21/2017 - 02:36

హైదరాబాద్, జనవరి 20: మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఈ ఏడాదీ రికార్డు నిలపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లోని ఆర్థిక లోటుతోపాటు నోట్ల రద్దుతో తగ్గిన ఆదాయాన్ని ఏవిధంగా పూడ్చుకోవాలని యోచిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రణాళికేతర వ్యయంకంటే ప్రణాళికా వ్యయానే్న ఈసారీ ఎక్కువ చూపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

01/21/2017 - 02:29

న్యూఢిల్లీ, జనవరి 20: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ వివరాలు తెలిపారు. రాష్ట్రంలో మరో 19 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు.

Pages