S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 01:02

చిలకలూరిపేట, జనవరి 20: ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే, చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్ష వైఎస్ జగన్మోహనరెడ్డి అరాచకశక్తిగా తయారయ్యారని హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ ఎడ్ల బండలాగుడు పోటీలను తిలకించడానికి విచ్చేసిన చినరాజప్ప అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు.

01/21/2017 - 01:01

గుంటూరు, జనవరి 20: సమాచార హక్కు చట్టం అమలును హైపవర్ కమిటీ పర్యవేక్షించక పోవడంతో అధికారుల్లో చట్టంపై నిర్లక్ష్యం పెరిగి పోతుందని, ఇది సరికాదని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి విజయబాబు పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సమాచార హక్కు చట్టం కేసుల విచారణ అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

01/21/2017 - 01:00

గుంటూరు, జనవరి 20: ఆసియాలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డులో రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.

01/21/2017 - 01:00

గుంటూరు, జనవరి 20: విద్యార్థి దశ నుంచి రహదారి భద్రతా సూత్రాలను అనుసరించడంలో అవగాహన కలిగి ఉండాలని, వీటిని తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జిసి రాజారత్నం పేర్కొన్నారు. శుక్రవారం వింజనంపాడులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రవాణాశాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది.

01/21/2017 - 00:59

గుంటూరు, జనవరి 20: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై వైసిపి కార్యకర్తలు దాడికి దిగినా ఓ మహిళా ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన రోజా కానీ, పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కానీ స్పందించకపోవటంలోని ఆంతర్యమేమిటని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు.

01/21/2017 - 00:58

భద్రాచలం, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలని, దీన్‌దయాళ్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించారు. భద్రాచలంలోని కెకె ఫంక్షన్ హాలులో శుక్రవారం ఆ పార్టీ రెండు రోజుల కార్యవర్గ సమావేశాలను కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

01/21/2017 - 00:57

కొత్తగూడెం, జనవరి 20: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో పెండింగ్‌లో ఉన్న 373 జివో ప్రకారం అర్హత కల్గిన వారందరికీ స్థలాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోనేరు సత్యనారాయణ (చిన్ని) శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ప్రజా దీక్ష నిర్వహించారు.

01/21/2017 - 00:57

కొత్తగూడెం రూరల్, జనవరి 20: ఆదివాసి, గిరిజన, పేద ప్రజలను నిర్వాసితులుగా చేస్తున్న విమానాశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు.

01/21/2017 - 00:56

కొణిజర్ల, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పథకాలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియుమండల అధ్యక్ష కార్యదర్శులు అన్నారపు వెంకటేశ్వర్లు, అనుమోలు రామారావు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

01/21/2017 - 00:56

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 20: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కావల్సిన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

Pages