S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 03:37

వాషింగ్టన్, జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేస్తున్నప్పటికీ ప్రతిదశలోనూ వారికి సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటానని బరాక్ ఒబామా స్పష్టం చేశారు. తనను ఉత్తమ రీతిలో విధులు నిర్వహించేలా తీర్చిదిద్దినందుకు, అన్ని విధాలుగా తోడ్పాటును అందించినందుకు దేశ ప్రజలకు భావోద్వేగ రీతిలో ఓ లేఖ రాశారు.

01/21/2017 - 03:35

న్యూఢిల్లీ, జనవరి 20: దేవతలు విహరించే దేవభూమిగా పేరు గాంచిన ఉత్తరాఖండ్‌లో అధికారం కోసం కాంగ్రెస్, బిజెపి హోరాహోరీగా పోరాడుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఎలాగైనా అధికారంలోకి వచ్చి ప్రతిష్ట నిలబెట్టుకునేందుకు బిజెపి ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. 70 సీట్లున్న ఉత్తరాఖండ్ శాసనసభకు ఫిబ్రవరి 15న ఎన్నికలు జరుగనున్నాయి.

01/21/2017 - 03:33

వాషింగ్టన్, జనవరి 20: డొనాల్డ్ ట్రంప్.. నిన్నటిదాకా ఓ రియల్ ఎస్టేట్ బిలియనీర్‌గా అందరికీ ప్రపంచానికి పరిచయం! ఇప్పుడు ప్రపంచానే్న శాసించే అమెరికా అధ్యక్షుడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం ఆ దేశ ప్రజలనే కాదు, మొత్తం ప్రపంచానే్న విస్మయానికి గురి చేసింది. దానికి కారణం లేకపోలేదు.

01/21/2017 - 03:00

శాంతినగర్, జనవరి 20: వ్యవసాయంపై ప్రేమ కురిపిస్తున్న ప్రభుత్వం నకిలీ మిరప, పత్తి తదితర విత్తనాలను అడ్డుకునేందుకు కొత్త విత్తన చట్టం తీసుకురావాలని రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు భూసేకరణ పేరుతో కొత్తకొత్త చట్టాలు తీసుకువస్తున్న ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టే విషయంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

01/21/2017 - 02:58

రాజమహేంద్రవరం, జనవరి 20: పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సి వై సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ ఒక అడుగు ముందుకేస్తే. రెండు అడుగులు వెనక్కు వేసినట్టుగా మారింది. కమిషన్‌ను నియమించి దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తోంది. ఆరు నెలల కాలంలో విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్ధేశించారు.

01/21/2017 - 02:56

సికిందరాబాద్, జనవరి 20: రైల్వే ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రయాణీకుల భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆర్‌పిఎఫ్ ఐజి, చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ సంజయ్ సంకృత్యాయన్ స్పష్టం చేశారు.

01/21/2017 - 02:52

న్యూఢిల్లీ, జనవరి 20: నేరం చేసిన వాడు కన్న కొడుకైనా సరే శిక్షనుంచి తప్పించుకోకూడదని ఢిల్లీకి చెందిన ఓ పోలీసు అధికారి నిరూపించాడు. తన కొడుకు నేరం చేశాడని తెలియడంతో తానే స్వయంగా అతడ్ని పట్టుకోవడంలో పోలీసులకు సాయపడి విధి నిర్వహణ పట్ల తన నిబద్ధతను చాటుకోవడమే కాక ఎంతో మంది పోలీసులకు ఆదర్శంగా నిలిచాడు ఏఎస్సై రాజ్ సింగ్.్ఢల్లీలో ఇటీవల 23 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు దాడి చేశారు.

01/21/2017 - 02:51

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో అన్ని పిజి పరీక్షలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఇలాంటి ప్రయత్నం చేయగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకున్న ఉన్నత విద్యామండలి వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంది.

01/21/2017 - 02:50

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం సంతకం చేశారు. ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఉన్న వేతనాలను 50 శాతం పెంచనున్నారు.

01/21/2017 - 02:50

గొల్లపల్లి, జనవరి 20:వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు సహా పలువురు నేతలపై తేనెటీగలు దాడి చేశాయి. అయితే వెంటనే పరిగెట్టి తప్పించుకోవడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఓ సీఐ, ఎస్‌ఐ మాత్రం తేనెటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు.

Pages