S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 01:24

నెల్లిమర్ల, ఏప్రిల్ 28: జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు 412కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించనున్నామని డిఆర్‌డిఎ సహాయ పథక సంచాలకులు బి సుధాకరరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక వెలుగు కార్యాలయాన్ని సందర్శించారు.

04/29/2016 - 01:23

విజయనగరం, ఏప్రిల్ 28: ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని 150 చేపల చెరువులను గుర్తించి అభివృద్ధి పరుస్తామని జిల్లా కలెక్టర్ ఎం ఎం నాయక్ అన్నారు. గురువారం కలెక్టర్ చేపల పెంపకం, అభివృద్ధి అంశాలపై అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది 42 చెరువులు మంజూరు చేయగా 18 పూర్తయ్యాయని, మిగిలిన చేపల చెరువులు పూర్తి చేయాలని ఆదేశించారు.

04/29/2016 - 01:20

అరకులోయ, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావుకు గిరిజనులు తగిన బుద్ధి చె బుతారని అరకులోయ ఎం.పి.పి. కె. అరుణకుమారి, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ సమర్డి గులాబి, వైకాపా నాయకులు శెట్టి అప్పాలు, స మర్డి రఘునాధ్ పేర్కొన్నారు.

04/29/2016 - 01:19

చోడవరం, ఏప్రిల్ 28: మండలంలోని చాకిపల్లి గ్రామానికి చెందిన వృద్దుడు వడదెబ్బకు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గంటా అప్పలనాయుడు పొలంలో పనులు ముగించుకుని ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసేలోగా మృతి చెందాడు. దీంతో వేసవిలో ఇప్పటివరకు మండలంలో వడదెబ్బకు మరణించిన వారి సంఖ్య 4కు చేరుకుంది.
లక్కవరంలో మరొకరి మృతి

04/29/2016 - 01:19

మాకవరపాలెం, ఏప్రిల్ 28: తాగునీటి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వబోమని మండలంలోని లచ్చన్నపాలెం గ్రామస్థులు స్పష్టం చేశారు. మండలంలోని లచ్చన్నపాలెం సమీపం లోగల సర్పానదిలో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఎనిమిది పంచాయతీలకు చెందిన 13 గ్రామాల కు తాగునీటిని అందించేందుకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన స ంగతి తెలిసిందే.

04/29/2016 - 01:18

అచ్యుతాపురం, ఏప్రిల్ 28: బ్రాం డిక్స్ మహిళా కార్మికులు మళ్లీ ఉద్యమబాట పట్టారు. బ్రాండిక్స్-3కి చెందిన 900 మంది ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతూ మెయిన్‌గేటు ముందు గురువారం ధర్నాకు దిగారు. ఎ-షిప్ట్‌కు వచ్చిన ఉద్యోగులు ఉదయం 6గంటల నుండి గేటు వద్ద ఆందోళన చేపట్టారు. జీతాలతోపాటు పిఎఫ్‌లు చెల్లించాలని, సూపర్‌వైజర్ల వేధింపులు ఆపాలని కోరుతూ పాత పద్ధతిలో ధర్నాకు దిగారు.

04/29/2016 - 01:18

అరకులోయ, ఏప్రిల్ 28: ప్రభుత్వ అధికారుల పనితీరుపై పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి (ఐటిడిఎ పిఒ) ఎం.హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత గ్రామం పెదలబుడు లో అభివృద్ధి పనులపై గురువారం నిర్వహించిన సమీక్షా స మావేశంలో పిఓ అధికారులపై మండిపడ్డారు.

04/29/2016 - 01:17

విశాఖపట్నం, ఏప్రిల్ 28: నగరంలో గత అయిదు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఎంసెట్ అభ్యర్థులకు దేవుడే దిక్కు మాదిరిగా పరిస్థితి తయారైంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం మినహా, అంతరాయం కలిగితే ఏం చేయాలన్న దానిపై ఆదేశాలు లేకపోవడం గమనార్హం.

04/29/2016 - 01:16

జగదాంబ, ఏప్రిల్ 28: జివిఎంసి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు పట్టణ పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విధానాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతోపాటు సులభతరమైన పాలన అందించేందుకు జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

04/29/2016 - 01:16

గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 28: విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది. వేడితో అల్లాడుతున్న ప్రజలు ఎంతో ఉపశమనం చెందారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వలన ఉద్యానవన పంటలకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గురువారం కురిసిన ఈవర్షం వలన సంతకు వచ్చిన ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Pages