S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2016 - 00:37

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యపై సంతాపం తెలిపేందుకు ఐదు రోజుల సమయం ఎందుకు పట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ఆనంద్ శర్మ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రోహిత్ తల్లికి కలిగిన బాధను అర్థం చేసుకునేందుకు ఇంత సమయం పట్టిందా? అని నిలదీశారు.

01/24/2016 - 00:36

న్యూఢిల్లీ, జనవరి 23: పఠాన్‌కోట్ దాడికి సంబంధించి జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఐఏ) గత కొన్ని రోజులుగా ప్రవ్నిస్తున్న పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి సల్వీందర్ సింగ్‌కు ఆ సంస్థ క్లీన్‌చిట్ ఇచ్చింది. లైడిటెక్టర్ పరీక్ష, ఇతర పరీక్షల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించక పోవడంతో ఎన్‌ఐఏ ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

01/24/2016 - 01:27

వాషింగ్టన్, జనవరి 23: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై రికార్డు స్థాయిలో 30 అంగుళాల మంచును కప్పేయవచ్చని భావిస్తున్న మంచు తుపాను శనివారం అమెరికా తూర్పు తీరాన్ని తాకింది. ఈ మంచు తుపాను కారణంగా దేశవ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోగా, కనీసం పది రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.

01/24/2016 - 00:21

హైదరాబాద్, జనవరి 23: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెరాస ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను తెలంగాణ భవన్‌లో శనివారం విడుదల చేశారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులను పేర్కొంటూ, చేయబోయే వాటిని కలిసి ఐటి మంత్రి కెటిఆర్, పార్టీ నేతలు డి శ్రీనివాస్ తదితరులు మ్యానిఫెస్టో విడుదల చేశారు.

01/24/2016 - 00:20

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్టస్థ్రాయి రిక్రూట్‌మెంట్ బోర్డు 9281 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 4 వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం పేర్కొంది. ఇప్పటి వరకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు 1,59,604 దరఖాస్తులు వచ్చాయని తెలిపింది.

01/24/2016 - 01:35

హైదరాబాద్, జనవరి 23: ప్రపంచస్థాయి నగరలతో సమానంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్ ప్రణాళిక ఖరారు చేసామని, మహాయజ్ఞంలో అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

01/24/2016 - 00:19

హైదరాబాద్, జనవరి 23: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష భగ్నమైంది. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాల జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల ఆమరణ దీక్ష శనివారంతో ఐదోరోజుకు చేరింది. విద్యార్థులకు షుగర్ లెవెల్ తగ్గిపోయిందని, ఆరోగ్యం క్షీణించిందని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు.

01/24/2016 - 00:18

విజయవాడ, జనవరి 23: ప్రస్తుత న్యాయ విచారణ పద్ధతుల్లో వేగవంతమైన మార్పు తెచ్చి, వినియోగదార్లకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కోర్టులు, పోలీసు విధానాలు, ప్రజల ఆకాంక్షలకు మధ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారధిగా పనిచెయ్యాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల తొలి సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

01/24/2016 - 00:17

హైదరాబాద్, జనవరి 23: బెంగళూరు శివార్లలో తలదాచుకుంటున్న కరడుగట్టిన గజ ఉగ్రవాది అస్ఘర్ స్థావరంపై తెలంగాణ పోలీసులు శనివారం దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించారు. 2008 అహమ్మదాబాద్ పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అస్ఘర్ ఇండియన్ ముజాహిదీన్ సంస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

01/24/2016 - 01:36

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతున్నప్పటికీ, 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు 20 ఏళ్ల క్రితమే భారత్ ఒక నిర్ధారణకు వచ్చింది. ‘తాయ్‌హోకు (తైవాన్)లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడనే దానిలో అనుమానానికి ఎలాంటి తావూ లేదు. భారత ప్రభుత్వం ఈ వాదనను ఇప్పటికే అంగీకరించింది.

Pages