S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/26/2018 - 02:38

రాజేంద్రనగర్, ఏప్రిల్ 25: క్యాబ్ డ్రైవర్‌ను హతమార్చిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలను ఏసీపీ అశోక్, సురేష్ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల షాపూర్ ప్రాంతానికి చెందిన షేక్ హఫీజ్(20) డ్రైవర్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ తన్వీర్(20), మహ్మద్ జహంగీర్(21) స్నేహితులు.

04/26/2018 - 02:37

గచ్చిబౌలి, ఏప్రిల్ 25: మాదాపూర్ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సైబర్ హిల్స్ కాలనీలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. రెండు దశాబ్దాల నుంచి పొజిషన్‌లో ఉన్న భూమి యజమానులను భయపెట్టి బలవంతంగా స్థలాన్ని ఖాళీ చేయించేందుకు మరణాయుధాలతో బీభత్సం సృష్టించారు. పెట్రోలింగ్ పోలీసులు సమక్షంలో మరణాయుధాలతో స్థలంలో నివాసముంటున్న కూలీలపై దాడి చేయడంతో పాటు గుడిసెలను, గదులను కూల్చివేశారు.

04/26/2018 - 02:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మియాపూర్ భూముల వివాదం కేసులో అన్ని విచారణలను నిలిపివేయాలని ట్రినిటీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ రద్దు చే యాలని, సివిల్ తగాదా కాబట్టి విచారణపై స్టే ఇ వ్వాలని సంస్థ అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం స్టేకు నిరాకరించింది.

04/26/2018 - 01:51

కడప, ఏప్రిల్ 25: కడప జిల్లా పోలీసులు ఐదుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. అంతర్జాతీయ స్మగ్లర్లుగా పేరుపొందిన షేక్ ముస్త్ఫా, వేది అలియాస్ వేది శక్తివేలు, విశ్వనాధన్, కామేష్, ఏగూరి భాస్కర్‌పై పీడీ చట్టం ప్రయోగించారు. చెన్నైకి చెందిన షేక్ ముస్త్ఫా ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేసేవాడు. దుబాయ్‌లో ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్ సాజితి ప్రధాన అనుచరుడు.

04/26/2018 - 01:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మొబైల్ నెంబర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై, బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘లోకనీతి ఫౌండేషన్’ దాఖలు చేసిన పిల్‌పై గతంలో తానిచ్చిన ఆదేశాలు, జాతి భద్రతను దృష్టిలో ఉంచుకొని చేసినవన్న కోణంలో పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఆ ఒక్క సందర్భంలో తప్ప నిజానికి అటువంటి ఆదేశాలు ఎన్నడూ ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

04/26/2018 - 00:55

జోధ్‌పూర్, ఏప్రిల్ 25: బాలికపై అత్యాచారం కేసులో బాబా ఆశారాం బాపును జోధ్‌పూర్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆశారాంకు జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పును బుధవారం ప్రకటించింది. ఆయన అనుచరులు ఇద్దరికి చెరో 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. శారద్, శిల్పి అనే అనుచరులకు ఒక్కొక్కరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష వేస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి మధుసూదన్ శర్మ తీర్పును ప్రకటించారు.

04/26/2018 - 00:05

అచ్యుతాపురం, ఏప్రిల్ 25: విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌లో హత్యకేసు నిందితుడు పారిపల్లి రామునాయుడు(60) ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ దీనబంధు బుధవారం తెలిపారు. అచ్యుతాపురం మండలంలోని చీమలాపల్లికి చెందిన రామునాయుడు స్టేషన్‌లో గల మరుగుదొడ్డిలో బుధవారం ఉరిపోసుకున్నాడు.

04/25/2018 - 23:41

కేతేపల్లి, ఏప్రిల్ 25: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నకిరేకల్ మండలం గొల్లగూడం గ్రామానికి చెందిన ముక్కమల్ల యల్లయ్య (55) అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైయ్యాయి.

04/25/2018 - 23:09

మదనపల్లె, ఏప్రిల్ 25: ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. పుంగనూరు పట్టణ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. చిత్తూరుజిల్లా పుంగనూరు పట్టణం బజారువీధికి చెందిన శివలింగయ్య కుమార్తె భవాని (20) మదనపల్లె పరిసర ప్రాంతం మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం అభ్యిసిస్తోంది.

04/25/2018 - 23:03

కడప,ఏప్రిల్ 25: జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కొరఢా ఝళిపిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేయడం, వారిపై పీడీ యాక్టును ప్రయోగించడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఎర్రచందనం చెట్లను నరికేందుకు తమిళనాడు నుండి తరలివస్తున్న కూలీల అనుమానాస్పద మరణాల వెనుక కూడా పోలీసుశాఖ ఎత్తుగడలే ఉన్నాయనే ప్రచారం ఉంది.

Pages