S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/23/2018 - 21:53

సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్. సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా పేపర్ బాయ్. సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యా హూప్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా తాజాగా సినిమా ప్రీపోన్ అయింది. ఆగస్టు 31న విడుదల కానుంది.

08/23/2018 - 21:38

రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

08/23/2018 - 21:37

స్టయలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ఎంపిక కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇదివరకు తాను చేసిన డిజే చిత్రం యావరేజ్‌గా నిలవడం, వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ఫెయిల్ కావడంతో ఆయన తన తదుపరి చిత్రంపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

08/23/2018 - 21:42

నైనేష్ ఫిలింస్ పతాకంపై ఎల్.వి.రాజశేఖర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో గుండ్రెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణ ప్రేమకథా చిత్రం ‘ఫ్రెండ్‌షిప్ వెర్సెస్ లవ్’. సూర్య, మనీష్, స్నేహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎఫ్.ఎం.బాబాయ్, జబర్దస్త్ అప్పారావు, శిరీష, శ్రీకర్ నిరోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

08/23/2018 - 21:49

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఇటీవల మొదలైన ఈ చిత్రం యొక్క బ్యాంకాక్ షెడ్యూల్ ఈ రోజుతో పూర్తయ్యింది. దాంతో సినిమా చిత్రీకరణ కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లే. ఇంకోసాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చిత్ర యూనిట్ ఇండియాకు తిరిగొచ్చాక ఈ పాట చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు.

08/23/2018 - 21:44

రాఘవ లారెన్స్ తనదైన టాలెంట్‌తో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో తెలియదు గానీ తన మంచితనంతో మాత్రం అందరికంటే బెస్ట్ సెలబ్రెటీ అని నిరూపించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం కేరళ బాధితుల కోసం చాలామంది తమిళ సినీ ప్రముఖులు సహాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే అందరికంటే ఎక్కువగా లారెన్స్ కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

08/23/2018 - 21:16

తాల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో రెండు డిఫరెంట్ లుక్స్‌తో వున్న అజిత్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్‌లో కనువిందు చేయనున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

08/22/2018 - 20:29

సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్‌తేజ్‌ల కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్‌కు వెళ్ళనుంది చిత్ర యూనిట్. 20 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

08/22/2018 - 20:28

డీడే, దొబారా చిత్రాల్లో నటించి మెప్పించింది హ్యూమా ఖురేషి. ఈ భామ నటించిన తొలి సౌత్ సినిమా కాలా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తూ ప్రముఖంగా వార్తల్లోకొచ్చింది. అయితే కాలా డిజాస్టర్ రిజల్ట్ అందుకోవడంతో హ్యూమా పేరు తర్వాత కనుమరుగైంది. లేదంటే ఈపాటికే తెలుగులోనూ ఈ భామ నటించే ఛాన్స్ ఉండేదన్న ప్రచారం సాగింది.

08/22/2018 - 20:25

రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతుండడం విశేషం. అందరికీ కనెక్ట్ అయ్యే యొనిక్ కానె్సప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. ఇందులో ఓ పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపిస్తోన్న సినిమా ఇది.

Pages