S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/16/2016 - 20:55

అర్థరాత్రి ఒంటరిగా మహిళ రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీగారు చెప్పారు. కానీ పగలు కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు చాలాచోట్ల లేవు. ఈ విషయంపై సౌత్ క్రేజీ భామ శ్రుతిహాసన్‌ని అడిగితే, ఆమె స్పందించిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘ఇండియాలో మహిళలకు భద్రత లేదు. ఇక్కడున్న పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది’ అంటూ కామెంట్ చేసింది.

12/16/2016 - 20:53

విశ్వదేవ్ రాచకొండ, పునర్నివి భూపాలం జంటగా సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్స్ సినిమాస్ పతాకాలపై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో రామ్మోహన్.పి, దినేష్‌కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది.

12/16/2016 - 20:51

తెలుగులో ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అందాల భామ కీర్తి సురేష్. ఆ సినిమా తరువాత తెలుగులో పలు అవకాశాలు వచ్చినా కూడా తమిళంపైనే దృష్టిపెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న ఈమెకు, తాజాగా మరో క్రేజీ ఛాన్స్ దక్కింది. విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ‘సందకోజహి’ సినిమా అప్పట్లో వచ్చి సంచలన విజయం సాధించింది.

12/16/2016 - 20:48

అనీల్ బూరగాని, నేహా దేశ్‌పాండే, నిఖిత ప్రధాన తారాగణంగా పి.రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిషోర్‌కుమార్ కోట రూపొందించిన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

12/15/2016 - 21:12

ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి-2 (ది కంక్లూజన్) చిత్రంలో రానా నటిస్తున్న భల్లాలదేవ ఫస్ట్‌లుక్‌ను రానా జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో రానా మొదటి సినిమా కన్నా వైవిధ్యంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలి సినిమాలో భల్లాలదేవ ఉపయోగించిన గద ఈ చిత్రంలో కూడా కన్పిస్తోంది.

12/15/2016 - 21:10

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి ఎవరంటే.. అందరు చెప్పే పేరు రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సక్సెస్ జర్నీ ప్రారంభమైన రకుల్ ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ, వరుస విజయాలతో ముందుంది. మెగా హీరో రామ్‌చరణ్ సరసన రకుల్ నటించిన ‘్ధృవ’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ముఖాముఖి మాట్లాడారు.

12/15/2016 - 21:06

హరికృష్ణ, అక్షిత జంటగా జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించారు. తొలి సన్నివేశంపై హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

12/15/2016 - 21:04

పృధ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రం డిసెంబర్ 16న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సలోని బుధవారం సినిమా గురించిన సంగతులను పాత్రికేయులతో ముచ్చటించారు.

12/15/2016 - 21:02

రామ్‌కార్తిక్, భాను త్రిపాఠి జంటగా ఎస్‌ఆర్‌పి విజువల్స్ పతాకంపై సాయి తేజా పాటిల్ సమర్పణలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ రూపొందిస్తున్న చిత్రం ఇద్దరిమధ్య 18. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా పోస్టర్‌ను తెలంగాణ మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు.

12/15/2016 - 21:01

గోపీచంద్, ఐశ్వర్య అడ్డాల ప్రధాన తారాగణంగా రామ్ క్రియేషన్స్ పతాకంపై రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందించిన చిత్రం నేత్ర (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

Pages