S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/26/2017 - 22:49

అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం మేడమీద అబ్బా యి. జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి.ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 8న విడుదకు సిద్ధమవుతోంది.

08/24/2017 - 21:07

బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ- ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను రూపొందించామని, సినిమాకు సంబంధించిన టీజర్, స్టంపర్ విడుదలయ్యాక సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని తెలిపారు.

08/24/2017 - 21:05

రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా ప్రేమిస్తే భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్ హీరో హీరోయిన్లుగా నిర్మిస్తున్న చిత్రం 3మళ్లీ ప్రేమిస్తే2. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మా త వివరాలు తెలియజేస్తూ.. ప్రేమిస్తే చిత్రం తర్వాత భరత్ చేస్తున్న ప్రేమకథా చిత్రం ఇది.

08/24/2017 - 21:03

ప్రస్తుతం 3స్పైడర్2 సినిమాతో బిజీగా ఉన్న క్రేజీ దర్శకుడు మురుగదాస్ అంటే సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోస్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మురుగదాస్ మాత్రం ఆ హీరోతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో ఆసక్తిగా ఉం దని చెప్పాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. సూపర్‌స్టార్ రజనీకాంత్?

08/24/2017 - 21:01

శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 3మహానుభావుడు2. యు.వి క్రియేషన్స్ పతాకంపై మెహరీన్ కథానాయికగా వంశి, ప్రమోద్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయనున్నారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

08/24/2017 - 20:59

బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ భామ మరో వైపు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన ఈ భామ తాజాగా మరో సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఈ సినిమా పనుల్లో భాగంగా అమెరికాలో వున్న ప్రియాంక తాజాగా సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న గుస్టాక్2 చిత్రం కోసం ఇండియా వచ్చింది.

08/24/2017 - 20:57

కాటమరాయుడు సినిమా తరువాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్‌లో ఇది 25వ చిత్రం అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తున్నా ఇంకా ఇంతవరకు సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని తెలియజేయలేదు పవన్.

08/24/2017 - 20:55

దిలీప్, శ్రావణి, రాజ్‌బాల, అపర్ణ, బేబి అక్షర ప్రధాన తారాగణంగా హరివల్లభ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఎ.ఎం. రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 3తొంగి తొంగి చూడమాకు చందమామ. ఈ చిత్రానికి సంబంధించిన షూ టింగ్ శరవేగంగా సాగుతోంది. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

08/24/2017 - 20:54

సచిన్, ఈషాగుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రైనా జోషి నిర్మించిన చిత్రం ‘వీడెవడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 8న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య మాట్లాడుతూ- ఎస్‌ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు, శంకర సినిమా అన్నీ రీమేక్ చిత్రాల్నే తీశాను.

08/24/2017 - 20:53

చూడాలని వుంది, యువరాజు లాంటి దాదాపు 50 చిత్రాలలో బాలనటుడిగా తెరపై నటించిన మాస్టర్ తేజ ఇప్పుడు హీరో తేజగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ హరి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ- గ్రామీణ నేపథ్యంలో జరిగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథ వైవిధ్యంగా వచ్చిందని తెలిపారు.

Pages