S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

04/12/2016 - 07:01

విశాఖపట్నం, ఏప్రిల్ 11: జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రాయూనివర్శిటీలో సోమవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి కార్యక్రమం అనంతరం ఆయన ఎయులోనే అధికారిక చర్చలో పాల్గొన్నారు.

04/12/2016 - 07:00

విశాఖపట్నం, ఏప్రిల్ 11: అసమానతలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతిని పురస్కరించుకుని ఎయు కాన్వొకేషన్ హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు.

04/10/2016 - 08:43

ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న జగదీష్‌కి సోదరుడు నవీన్ నుండి ఫోనొచ్చింది.
‘‘ఒరేయ్! జగదీష్ మీ వదిన దేవి మనకింక లేదురా! మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకు వెళ్లిపోయి మనల్ని ఒంటరివాళ్లని చేసింది’’ గద్గదస్వరంతో చెప్పాడు నవీన్.
అది విని జగదీష్ కాళ్లు వణికాయి.
‘‘అన్నయ్యా! అసలు ఏమయిందో చెప్పు అన్నయ్యా’’ అంటూ ఆందోళనగా అడిగాడు.

04/03/2016 - 22:47

రైతన్న శ్రమకు కొత్త అర్ధం తెచ్చి
తన కడుపు నింపే ఉగాది రావాలి
పసిపిల్ల, పండు ముసలి అనే తేడా లేకుండా
మగమృగాల వేటకు మాన, ప్రాణాలు
పిడికిట్లో పెట్టుకున్న స్ర్తిలకు
ధైర్యాన్నిచ్చే ఉగాది రావాలి!
పరిసరాలను కలుషితం చేస్తున్న
మానవులకు కనువిప్పుకలిగించి
ప్రకృతిని కాపాడే ఉగాది రావాలి
జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోలేక

04/03/2016 - 22:40

‘‘ఏమిటి నాన్నా ఎప్పుడూ ఇలానే అంటావు’’ అంటూ చికాగ్గా తన గదిలోకి వెళ్లిపోయింది సృజన.
‘‘ఏమైందండీ! అదలా కోపంగా వెళ్లిపోతుంది. ఏమైనా అన్నారా?’’ అంటూ శ్రీనివాస్‌ను అడిగింది కాఫీ తీసుకు వస్తున్న లక్ష్మీకాంతం.

04/03/2016 - 22:37

నన్నయ నుండి నేటి ఆధునిక కవితా యుగం వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ శతకం. సంస్కృత, ప్రాకృత వాజ్మయం శతక ప్రక్రియకు తెలుగు శతక ప్రక్రియ ప్రతిబింబమే. అయితే తెలుగులో ఈ ప్రక్రియ ఎంతో విశిష్టతను సంతరించుకుని ముందుకు దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన నందనందనంలో రచయిత తనకు ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణ లీలలను ప్రధానాంశంగా చేసుకున్నారు. రసగుళికల వంటి 126 పద్యాలను సరళమైన శైలిలో రాసి అందించారు.

03/27/2016 - 22:14

భోజన విరామ సమయంలో కాలక్షేపం కోసం వారపత్రిక తీసి పేజీలు తిప్పుతున్న హరీష్‌రావు అందులో ఉన్న ప్రకటన చూసి డంగైపోయాడు.
‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సూరజ్ సూపర్‌ఫాస్ట్ సీరియల్ లవ్ అండ్ రివెంజ్ త్వరలో ఆరంభం’
‘అంటే జూనియర్ అసిస్టెంట్ సూరజ్ గొప్ప రచయితన్న మాట’ అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం వెంటనే అతడిని తన క్యాబిన్‌కి పిలిపించాడు.
‘‘సార్’’ అన్నాడు సూరజ్ లోపలికి వచ్చి అత్యంత వినయంగా.

03/27/2016 - 06:26

విశాఖపట్నం, మార్చి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం నక్కపల్లిలో చేపడుతున్న భూముల సేకరణకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ కోరారు. పారిశ్రామిక కారిడార్‌కు నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, వేంపాడు, డిఎల్‌పురం, కంజనాడ గ్రామాల్లో 2310 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 102 ఎకరాలకు అవార్డు పాస్ చేశారని తెలిపారు.

03/27/2016 - 06:26

విశాఖపట్నం, మార్చి 26: విశాఖ జిల్లా కశింకోట సమీపానున్న నరసింగబిల్లి సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్నందున ఏపీట్రాన్స్‌కోకు చెందిన టవర్స్ వర్క్ చేపట్టిన నేపధ్యంలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దీని పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ మేరకు శనివారం అనకాపల్లి డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ జి.రాజ్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో విడుదల చేశారు.

03/27/2016 - 06:25

విశాఖపట్నం, మార్చి 26: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిరత, శాంతి స్థాపనకు చేస్తున్న కృషిని శంకించరాదని ఐరాస మాజీ కార్యదర్శి కిషోర్ మాంథ్యన్ అన్నారు. శనివారం గీతంలో టెడెక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న భిన్న రంగాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయ వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మాంధ్యన్ మాట్లాడుతూ ఐరాసలో 194 దేశాల సభ్యత్వం ఉందన్నారు.

Pages