S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/15/2018 - 01:15

బంగాళాఖాతంలో గురువారం సరుకు రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది.
పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్‌కు 55 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ఓడ నుంచి ఎగజిమ్ముతున్న మంటలు

06/15/2018 - 01:08

న్యూఢిల్లీ, జూన్ 14: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఆరోపించారు. జయదేవ్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని 2014 డిసెంబరులోనే సెయిల్ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు.

06/15/2018 - 01:08

న్యూఢిల్లీ, జూన్ 14: తెలంగాణలోని బయ్యారం, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉక్కు కార్మాగారాలను ఏర్పాటు చేసేందుకు ఇతరులెవరైనా ముందుకు వస్తారా అనేది టాస్క్ఫోర్స్ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

06/15/2018 - 01:05

న్యూఢిల్లీ, జూన్ 14: కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో బీజేపీపై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కడపకు ఉక్కు పరిశ్రమ తెచ్చే బాధ్యత తమదేనని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/15/2018 - 01:04

బళ్లారి, జూన్ 14: తుంగభద్ర జలాశయ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి వరద కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే 3 టీఎంసీల నీరు వచ్చి చేరింది. గత మూడు రోజులుగా తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో కర్నాటక, ఆంధ్ర పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

06/15/2018 - 01:23

భిలాయ్ (ఛత్తీస్‌గఢ్), జూన్ 14: ‘హవాయి చెప్పులు వేసుకున్నవారు సైతం విమానాల్లో ప్రయాణం చేస్తే చూడాలన్నది తన కల’ అని ప్రధాని మోదీ అన్నారు. చాలాకాలంగా మావోయిస్టుల ప్రాబల్యంలో ఉన్న బస్తర్ ఏవియేషన్ మేప్‌లో చేరింది. జగదల్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే మొదటి విమానాన్ని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

06/15/2018 - 00:49

న్యూ ఢిల్లీ, జూన్ 14: ప్రవాసభారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) పెళ్లిళ్లను పెళ్లి జరిగినప్పటి నుంచి ఏడు రోజుల్లో తప్పనిసరిగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ప్రకటన చేయనుంది. ఏడు రోజుల్లోగా ప్రవాస భారతీయుల పెళ్లిళ్లను నమోదు చేయకపోతే వారికి పాస్‌పోర్టులు, వీసాలు జారీచేయరు. ప్రవాసభారతీయుల పెళ్లిళ్లు వివాదస్పదమవుతున్నాయి.

06/15/2018 - 00:41

న్యూఢిల్లీ, జూన్ 14: కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక తప్పుల తడక, సత్యదూరమైనదని, దురుద్దేశ పూర్వకంగా ఉందని భారత్ తీవ్రంగా స్పందించింది. కాశ్మీర్‌పై హ్రస్వదృష్టితో ఎంపిక చేసిన అంశాలపై అవాస్తవాలతో కూడిన అంశాలను నివేదికలో పొందుపరిచారని భారత్ ఘాటుగా విమర్శించింది.

06/14/2018 - 16:39

ఊటీ: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ సమీపంలోని కూనూర్‌ రోడ్డులో తమిళనాడు ఆర్టీసీ బస్సు లోయలోకి పడటంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఊటీ నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

06/14/2018 - 13:49

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలో ఆప్‌ మంత్రుల ధర్నా కొనసాగుతోంది. ధర్నా నాలుగో రోజుకు చేరింది. దీనిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

Pages