S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/02/2018 - 12:14

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గ్రేహాండ్స్ కానిస్టేబుళ్లు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

03/02/2018 - 04:36

చిత్రం.. రాష్టప్రతి భవన్ వద్ద జోర్డాన్ రాజు అబ్దుల్లాకు స్వాగతం

03/02/2018 - 04:34

చెన్నై, మార్చి 1: మద్యపాన నిషేధం వల్ల పరిస్థితి మరింత జఠిలమై కొత్త మాఫియా పుట్టుకురావడానికి ఆస్కారం ఉందని మక్కల్‌నీతి మయ్యం అధినేత కమల్‌హసన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని చెబుతున్న పార్టీలు మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అలాంటి హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు.

03/02/2018 - 04:40

న్యూఢిల్లీ, మార్చి 1: సాయుధ దళాల ఆధునీకరణతోపాటే దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. ఒక దేశం అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన సైనిక దళాలకు భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడాన్ని సమర్ధించారు.

03/02/2018 - 04:29

న్యూఢిల్లీ, మార్చి 1: ఉగ్రవాదంపై పోరాటం జరుగుతోంది తప్ప ఒక మతంపై కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నరేంద్రమోదీ గురువారం ‘ఇస్లామిక్ వారసత్వం- అవగాహన పెంపుదల, మధ్యవర్తిత్వం’ అనే అంశంపై జరిగిన సదస్సులో కీలక ప్రసంగం చేశారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా కూడా సదస్సుకు హాజరయ్యా రు.

03/02/2018 - 04:41

సూళ్లూరుపేట, మార్చి 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 24న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 8 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది.

03/02/2018 - 04:24

గురువారం జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ ఆలయంలో హోలి సంబరాలలో మునిగితేలిన ప్రజలు

03/02/2018 - 04:21

జాముగురిహత్(అస్సాం), మార్చి 1: ఒకప్పుడు హింస, విధ్వంస కాండలతో అట్టుడికిన అస్సాంలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గత కొనే్నళ్లుగా తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగైందని, ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం అయిందని తెలిపారు.

03/02/2018 - 04:13

న్యూఢిల్లీ, మార్చి 1: పాకిస్తాన్‌తో ఘర్షణ వైఖరి విడనాడి సమస్యలు పరిష్కారానికి సామరస్యపూరక చర్చలను ప్రారంభించాలని సీపీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రతినిది పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయంలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో అన్ని కోణాల్లోనూ చర్చలను మూసివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడిందని ఆయన అన్నారు.

03/02/2018 - 01:49

కాంచీపురం, మార్చి 1: మహానిర్యాణం చెందిన కంచికామకోటి పీఠం శంకరాచార్య జయేంద్ర సరస్వతి గురువారం మహాసమాధి అయ్యారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య 82 ఏళ్ల జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమాధిలో కూర్చున్న స్థితిలోనే జయేంద్ర సరస్వతి మహా సమాధి అయ్యారు. ఈ సమాధిని పూర్తిగా గంధపుచెక్కలు, మట్టి ఇతర మూలికలతో నింపారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.

Pages