S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/24/2016 - 15:59

దిల్లీ: బిజెపి ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా రెండోసారి అదే పదవికి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరి పేరు మాత్రమే ప్రతిపాదనకు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.ఆయన పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించగా పలువురు కేంద్ర మంత్రులు సమర్ధించారు. ఈ ఎన్నికకు పార్టీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ దూరంగా ఉండడం గమనార్హం.

01/24/2016 - 02:30

జైపూర్, జనవరి 23: దేశంలో అసహనం పరాకాష్ఠకు చేరిందనడానికి హైదరాబాద్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనే నిదర్శనమని ప్రముఖ కవి, రచయిత అశోక్ వాజ్‌పాయి స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఘటన తరవాత తనకు వచ్చిన డి.లిట్ పురస్కారాన్ని వాజ్‌పాయి వాపసు చేశారు.

01/24/2016 - 02:30

లక్నో, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌లాగా ఏ దళిత విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడడానికే తాము ఆ పని చేశామని శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇద్దరు విద్యార్థులు చెప్పారు.

01/24/2016 - 02:28

న్యూఢిల్లీ/ హైదరబాద్, జనవరి 23: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)తో పాటు కేంద్ర భద్రతా సంస్థలు శనివారం వరుసగా రెండో రోజూ ఉక్కుపాదం మోపాయి. గణతంత్ర దినోత్సవానికి ముందు దాడులకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో వివిధ రాష్ట్రాల్లో 14మందిని అరెస్టు చేసి స్థానిక కోర్టుల్లో హాజరుపరిచాయి.

01/24/2016 - 01:17

పాట్నా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం వెనుక బిజెపికి ఒక దురుద్దేశం ఉందని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా రకరకాల సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుద్ధ్యాలను ముందుకు తీసుకురావాలన్నది దాని ఉద్దేశమని బిహార్ ముఖ్యమత్రి నితీశ్ కుమార్ శనివారం ఆరోపించారు. ‘స్వాతంత్య్ర పోరాటంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు.

01/24/2016 - 01:16

న్యూఢిల్లీ, జనవరి 23: తైవాన్ విమాన ప్రమాదంలో మృతి చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మాన్ని తీసుకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని 1995 ఫిబ్రవరిలో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేతాజీ చితాభస్మం టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉంది. ప్రధాని విడుదల చేసిన డిజిటల్ రూపంలోని వంద ఫైళ్లలో ఈ డాక్యుమెంట్ కూడా ఉంది.

01/24/2016 - 01:16

కోల్‌కతా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన ముని మేనల్లుడు చంద్రబోస్ శనివారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

01/24/2016 - 01:15

కోల్‌కతా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద రహస్య పత్రాలను బహిరంగ పర్చడం పట్ల ఆయన సన్నిహిత బంధువు కృష్ణబోస్ శనివారం హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పత్రాలను గనుక ఇంతకుముందే బహిరంగపరిచి ఉంటే నేతాజీ మృతికి సంబంధించి వివాదమే తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ‘మాకు సంతోషంగా ఉంది. ఈ పత్రాలను ఇంతకుముందే బహిరంగపరిచి ఉంటే ఎలాంటి ఊహాగానాలు ఉండేవి కావు.

01/24/2016 - 01:14

న్యూఢిల్లీ, జనవరి 23: ముంబయి వెళ్లాల్సిన గో ఎయిర్ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో నాగ్‌పూర్‌కు మళ్లించారు. 150 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌లో బయలుదేరిన గో ఎయిర్ జి8 243 విమానం 9.29కి నాగ్‌పూర్‌లో సురక్షితంగా దిగింది. విమానం భువనేశ్వర్‌లో ఉదయం 8.20కి బయలుదేరింది. విమానంలో బాంబు పెట్టినట్టు వచ్చిన ఫోన్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు.

01/24/2016 - 01:13

పనాజి, జనవరి 23: ఐఎస్‌ఐఎస్ నుంచి బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తామని, ఈ మేరకు ఆయనను కోరడం జరిగిందని గోవా ఎస్‌పి బోస్కో జార్జ్ శనివారం విలేఖరులకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని, పారికర్‌ను చంపుతామంటూ జనవరి 13న ఐఎస్‌ఐఎస్ పేరుతో ఒక లేఖ వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Pages