S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/02/2017 - 02:26

శ్రీనగర్, మే 1: కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుల్గామ్‌లో సోమవారం ఒక బ్యాంకు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఉగ్రవాదులు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు బ్యాంకు అధికారులతో పాటు మరో ఐదుగురు పోలీసులను హత్య చేశారు.

05/02/2017 - 00:32

చెన్నై, మే 1: డిఎంకె అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె.స్టాలిన్ సోమవారం వెల్లడించారు. వచ్చేనెలలో 94వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్న కరుణానిధి అనారోగ్య సమస్యల కారణంగా గత ఏడాది అక్టోబర్ నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

05/01/2017 - 03:21

కోచి, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రి మండలిలోని ఎవరినయినా విచారణకు పిలిచే అధికారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)కి ఉందని ఆ కమిటీ చైర్మన్ కెవి థామస్ ఆదివారం పునరుద్ఘాటించారు.

05/01/2017 - 03:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆదివారం రాత్రి ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సోమవారం భేటీ అవుతారు. అణు ఇంధన సరఫరా దేశాల బృందంలో భారత సభ్యత్వం, కౌంటర్ టెర్రరిజం, వ్యాపార వాణిజ్య సహకారంపై ఇద్దరు నేతలు చర్చిస్తారు.

05/01/2017 - 03:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ముంబయి-గోవా మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులు త్వరలో సకల సదుపాయాలు అనుభవించనున్నారు. సాధారణంగా విమానాల్లో లభించే సెలబ్రిటీ చెఫ్‌లు వండిన ఆహారం, టీ, కాఫీ వెండింగ్ మిషన్లు, వ్యక్తిగత ఎల్‌సిడి టీవీలు లాంటివి ఇకపై ఈ మార్గంలోని రైల్లో ప్రయాణికులకు లభించనున్నాయి.

05/01/2017 - 02:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: గడ్చిరోలి కోర్టు తీర్పుతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ ప్రజాసంఘాలు సాయిబాబా ఆరోగ్య కారణాల దృష్ట్యా మెరుగైన వైద్యసేవల కోసం వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాయి.

05/01/2017 - 03:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మాంసం వాసన.. ఏ మేకదో, గొర్రెదో కాదు.. మనుబోతు(నీల్‌గాయ్) మాంసం.. అదీ ఒకటి రెండు కిలోలు కాదు.. ఏకంగా 117 కిలోల మాంసం.. ఓ మాజీ సైనికాధికారి ఇంటిపై దాడి చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు నివ్వెర పోయేంత మాంసం దొరికింది. అంతే కాదు..

05/01/2017 - 01:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆసియాలో అతి వేగంగా మిలటరీ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేన తన సైన్యాన్ని ఆదేశించింది. ఒక వేళ యుద్ధం వస్తే పాకిస్తాన్‌తో కనీసంగా పది రోజులు, చైనాతో 15రోజుల పాటు తలపడేందుకు అన్నివిధాలా సన్నద్ధం కావాలని వౌఖికంగా ఉత్తర్వులు వెళ్లాయి.

05/01/2017 - 00:42

గోరఖ్‌పూర్, ఏప్రిల్ 30: గోరఖ్‌పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్యే అమన్మణి త్రిపాఠీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో వేదికను పంచుకోవడమే కాకుండా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం బిజెపి కార్యకర్తలతోపాటుగా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

05/01/2017 - 00:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: హిందీ మాట్లాడే సినీ ప్రేక్షకులకు శుభవార్త. ఇకపై ఎలాంటి భాషా భేదాలు లేకుండా ఎన్‌ఎఫ్‌డిసి నిర్మించే ఏ ప్రాంతీయ సినిమానైనా హ్యాపీగా చూసేయొచ్చు. అన్ని ప్రాంతీయ సినిమాలకు జాతీయ భాష హిందీలో సబ్‌టైటిల్స్ వేయాలంటూ అధికార భాషకు సంబంధించిన పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసుకు రాష్టప్రతి ఆమోదం తెలిపారు. జాతీయ సినిమా అభివృద్ధి సంస్థ ఈ హిందీ సబ్‌టైటిల్స్ బాధ్యతను స్వీకరిస్తుంది.

Pages