S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/11/2017 - 02:50

హైదరాబాద్, ఫిబ్రవరి 10: జీతాలు ఇవ్వకున్నా, తక్కువ ఇచ్చినా యాజమాన్యాలను జైలుకు పంపించేందుకు వీలు కల్పిస్తూ దేశ వ్యాప్తంగా కొత్త కార్మిక చట్టం అమలులోకి తెచ్చినట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు ఉద్యోగ, వేతన, సామాజిక భద్రత కల్పించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయని ఆయన చెప్పారు.

02/11/2017 - 02:44

ఇండోర్, ఫిబ్రవరి 10: ఈ ఏడాదిలో తొలి పాక్షిక చంద్ర గ్రహణం శనివారం కనిపించబోతోంది. తెల్లవారుజామున 4 గంటల రెండు నిమిషాల రెండు సెకన్లకు మొదలయ్యే ఈ గ్రహణం 8.25 నిమిషాల ఐదు సెకన్ల వరకు కొనసాగుతుంది. ఇది భారత్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ఇక్కడి జివాజి పరిశోధక కేంద్రం సూపరింటెండెంట్ రాజేంద్రప్రకాష్ గుప్త్ తెలిపారు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడి కాంతి క్రమంగా సన్నగిల్లుతుందని వెల్లడించారు.

02/11/2017 - 02:30

హరిద్వార్, ఫిబ్రవరి 10: దేవభూమి అయిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కళంకం తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌కు సంబంధించి వాజపేయి స్వప్నాన్ని వాస్తవ రూపంలోకి తీసుకు రావడానికి భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగించాలని ఆయన కోరారు.

02/11/2017 - 02:28

చెన్నై, ఫిబ్రవరి 10: అన్నాడిఎంకె పార్టీ ఎమ్మెల్యేలను శశికళ వర్గం ఒక రిసార్ట్‌లో అక్రమంగా నిర్బంధించారం టూ తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం చేసిన ఆరోపణలను ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు శుక్రవారం ఖండించారు.

02/11/2017 - 02:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: శశికళ నిందితురాలుగా ఉన్న జయ అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చే వరకు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకుండా ఆపాలని, ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కోరుతూ దాఖలయిన ఒక ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

02/11/2017 - 02:24

చెన్నై, ఫిబ్రవరి 10: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పుకార్లకు, ఊహాగానాలకు కొదవ లేకుండా పోయింది. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమా, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళనా అనే విషయంలో రాష్ట్ర ప్రజలు ఎటూ తేల్చుకోలేక పోతూ ఉంటే మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కథనాలు ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

02/11/2017 - 02:20

లక్నో, ఫిబ్రవరి 10: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘రెయిన్‌కోట్’ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడం సరికాదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిజానికి అది మన్మోహన్ సింగ్‌ను పొగడుతూ చేసిన వ్యాఖ్యే తప్ప అవమానించే వ్యాఖ్య కాదని ఆయన అన్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ సైతం ప్రధానిని విమర్శించకుండా వదిలిపెట్టలేదని కూడా ఆయన అన్నారు.

02/11/2017 - 05:00

ముంబయి, ఫిబ్రవరి 10: ఈజిప్టుకు చెందిన 500 కిలోల బరువు గల ఎమన్ అహ్మద్ అనే మహిళ బరువు తగ్గించుకునే చికిత్సను పొందడానికి శనివారం ఇక్కడకు రానుంది. 36 ఏళ్ల వయసు గల ఈ మహిళ అధిక బరువు వల్ల గత 25 సంవత్సరాలుగా తన ఇంటి నుంచి బయటకు కదలలేదు.

02/11/2017 - 02:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిఎస్‌పి అధినాయకురాలు మాయావతికి తొలి అగ్నిపరీక్ష రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ రాజకీయాల దశ, దిశను మార్చే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రేపు ఉదయం జరుగుతుంది.

02/11/2017 - 02:15

ఆగ్రా, ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలకు అడ్డూఅదుపులేదని కేంద్ర మంత్రి ఉమా భారతి ధ్వజమెత్తారు. రాష్ట్రం లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఉమ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బులంద్‌షహార్ సామూహిక అత్యాచార బాధితులకు న్యాయం జరగలేదని ఆమె విమర్శించారు. రేపిస్టులపై ఎలాంటి చర్యలూ లేవని అమె అన్నారు.

Pages