S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/15/2017 - 00:59

న్యూఢిల్లీ, జూలై 14: ఆర్థిక విధానాలతో, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఏ నాయకుడికీ లేనంత స్థాయిలో ప్రజా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పాదుకొల్పుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ప్రజావిశ్వాసాన్ని చూరగొందని ఫోర్బ్స్ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది.

07/14/2017 - 23:26

న్యూఢిల్లీ, జూలై 14: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను త్వరితగతిన పూర్తి చేసి తీర్పును వెలువరించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

07/14/2017 - 02:19

న్యూఢిల్లీ, జూలై 13: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చైనా రాయబారి లువో జావోహుయ్‌తో జరిగిన చర్చల వివరాలను పత్రికలకు చెప్పే విషయంలో పార్టీ మీడియా విభాగం వ్యవహరించిన తీరుపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నారు. మీడియా విభాగం కోరలు కత్తిరించేందుకు గత రాత్రి సీనియర్ నాయకులతో కమ్యూనికేషన్ స్ట్రాటజీ గ్రూపును ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

07/14/2017 - 02:17

రాయపూర్, జూలై 13: దేశ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలను ఇద్దరు దళితుల మధ్య పోటీగా అభివర్ణించడాన్ని ప్రతిపక్షాల రాష్టప్రతి అభ్యర్థి మీరా కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది సమాజం నిజరూపాన్ని బయటపెట్టిందని అన్నారు. సమాజం ఇప్పటికీ ప్రతి విషయాన్ని కులం అనే చట్రంలోంచే చూస్తోందని అన్నారు.

07/14/2017 - 02:16

లక్నో, జూలై 13: బయటి ప్రదేశాల్లో పర్యటనకర వెళ్లినప్పుడు తనకోసం ఎసి, కూలర్లు, రెడ్‌కార్పెట్లు, సోఫాలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ చేయవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

07/14/2017 - 02:14

న్యూఢిల్లీ, జూలై 13: రోజురోజుకీ కలుషితమైపోతున్న గంగానదిని సంరక్షించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) గురువారంనాడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. నదిలోపల 500 మీటర్ల పరిధిలో ఎటువంటి చెత్తగాని, పారిశ్రామిక వ్యర్థాలు కాని వేయడానికి వీలులేనని, అలావేస్తే రూ.50వేల పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌జిటి ఉన్నతాధికారి జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశాలు జారీచేశారు.

07/14/2017 - 02:13

చెన్నై, జూలై 13: బిగ్‌బాస్ రియాల్టీషోకు సంబంధించి నమోదైన కేసుపై తమిళ సూపర్‌స్టార్ కమల్‌హసన్ స్పందించారు. హిందువులను అవమానించారంటూ కమల్‌హసన్‌పై హిందూ మక్కల్ కచ్చి (హెచ్‌ఎంకె) కేసు పెట్టింది. విజయ్ టివిలో జూన్ 24 నుంచి కమల్‌హసన్ బిగ్‌బాస్ ప్రసారమవుతోంది. బిగ్‌బాస్‌లో తమిళుల సంస్కృతిని కించపరిచేలా ఉందని హెచ్‌ఎంకె ఆరోపణ.

07/14/2017 - 02:11

హరిద్వార్, జూలై 13: ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ఇప్పుడు కొత్తగా కాసులు కురిపించే సెక్యూరిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రాందేవ్ ఈ నెల 10న పరాక్రమ్ సురక్షా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్తగా సెక్యూరిటీ సంస్థను ప్రారంభించినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి. రాందేవ్ సైతం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.‘ఈ రోజు పరాక్రమ్ సెక్యూరిటీని ప్రారంభించాం.

07/14/2017 - 02:08

న్యూఢిల్లీ, జూలై 13: మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ సర్కారుపై విమర్శల కత్తులు దూసేందుకు 18 ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ తదితర నిర్ణయాలను దుయ్యబట్టడంతోపాటు సర్కారు తీరునుకూడా ఎండగట్టేందుకు ఉమ్మడి వ్యూహ ప్రాతిపదికగా ముందుకు దూసుకెళ్తున్నాయి.

07/14/2017 - 02:07

బెంగళూరు, జూలై 13: అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలు జైలు అధికారుల మధ్యే చిచ్చురేపింది. దీంతో చిన్నమ్మను మరో జైలుకు తరలిచాలని కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది. జైలులో శశికళకు ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేశారన్న వార్త కలకలం రేపింది.

Pages