S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/21/2017 - 01:18

కోయంబత్తూరు, జూన్ 20: వివాదాస్పద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్‌ను పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు మంగళవారం కోయంబత్తూరులో అరెస్టు చేశారు. కర్ణన్ అర్టెయిన విషయాన్ని ఆయన వ్యక్తిగత న్యాయవాది పీటర్ రమేశ్ ధ్రువీకరించారు. కర్ణన్‌ను కోయంబత్తూరునుంచి చెన్నైకి తీసుకు వెళ్తున్నారు. అక్కడినుంచి బుధవారం ఉదయం కోల్‌కతాకు తీసుకెళ్తారు.

06/21/2017 - 01:13

కేరళలోని కోజికోడ్‌లో యోగ శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సన్నాహాల్లో తలమునకలయ్యాయ.

06/21/2017 - 00:04

న్యూఢిల్లీ, జూన్ 20: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే అంశంపై ప్రతిపక్షంలో చీలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జెడి(యు), బిఎస్‌పి మరికొన్ని పార్టీలతోపాటు ప్రతిపక్షానికి చెందిన మెజారిటీ దళిత ఎంపీలు రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

06/21/2017 - 00:03

న్యూఢిల్లీ, జూన్ 20: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపికైన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు రాష్టప్రతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి బిహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

06/20/2017 - 02:39

న్యూఢిల్లీ, జూన్ 19: రాష్టప్రతి పదవికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను యుపిఏ మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలున్నాయి. బిజెపి తమతో ప్రారంభించిన చర్చల ప్రక్రియ పూర్తి చేయకుండానే రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తమ అభ్యర్థిగా మీరాకుమార్‌ను రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

06/20/2017 - 02:36

పాట్నా, జూన్ 19: బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి తన అభ్యర్థిగా ప్రకటించటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆయన అభ్యర్థిత్వానికి మద్దతును ఇవ్వటంపై మాత్రం మాట దాటేశారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా గవర్నర్‌కు రాష్టప్రతి అయ్యే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు.

06/20/2017 - 02:35

న్యూఢిల్లీ, జూన్ 19: ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికకు పోటీలేకుండా ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వెంకయ్య నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ రాష్టప్రతి అభ్యర్థిత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌ద్వారా చర్చలు జరిపినట్టు వెల్లడించారు.

06/20/2017 - 02:33

న్యూఢిల్లీ, జూన్ 19: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అమలుచేస్తోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు విముక్త భారత్‌కోసం చేయాల్సిందంతా చేస్తున్నాయని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలో ఇక రైతులనే లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టున్నారని సింధియా ఎద్దేవా చేశారు.

06/20/2017 - 02:32

గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా వేలాది మంది విద్యార్థులు ‘అతిపొడవైన యోగా చైన్’ను నెలకొల్పారు.
సోమవారంనాడు కర్నాటకలోని మైసూరు మహారాజా ప్యాలెస్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు

06/20/2017 - 02:28

విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్

Pages