S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/22/2017 - 01:48

లక్నో/న్యూఢిల్లీ, జూన్ 21: మూడవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది యోగాసనాలు వేశారు. లక్నోలోని రమాబాయి అంబేద్కర్ మైదానంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు వేలాది మంది ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు.

06/22/2017 - 01:47

అహ్మదాబాద్, జూన్ 21: ఒకే రోజు.. ఒకే మైదానం.. మూడు లక్షల మంది ఏకకాలంలో యోగాసనాలు వేసి చరిత్ర సృష్టించారు. పతంజలి పీఠం అధినేత బాబా రాందేవ్ నేతృత్వంలో మూడో అంతర్జాతీయ యోగ దినోత్సవమైన బుధవారం ఈ అద్భుతం సాధ్యమైంది. అహ్మదాబాద్‌లోని జిఎండిసి మైదానంలో ఒకేసారి మూడు లక్షల మంది బాబా రాందేవ్ నేతృత్వంలో యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డును సృష్టించారు.

06/22/2017 - 01:47

న్యూఢిల్లీ, జూన్ 21: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్టప్రతి భవన్ ఆవరణలో సామూహిక యోగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగ అనేది అత్యంత పురాతనమైన భారతీయ విధానమని, అనేక వ్యాధులనే కాకుండా ఆరోగ్యపరమైన పలు సమస్యలను ఇది నయం చేస్తుందని ఈ సందర్భంగా రాష్టప్రతి అన్నారు.

06/22/2017 - 01:46

న్యూఢిల్లీ/ కోల్‌కతా, జూన్ 21: కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. అలాగే ఆయనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేసేదీ లేదని స్పష్టం చేసింది.

06/22/2017 - 01:45

న్యూఢిల్లీ, జూన్ 21: దేశ రాజధాని నగరం ఢిల్లీలో లండన్ తరహాలో ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం ఉందన్న నిఘా హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈద్‌కు ముందే ఈ దాడులు జరిపేందుకు ఎనిమిది మంది ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు అవకాశం ఉన్నందున భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

06/21/2017 - 03:30

లక్నో, జూన్ 20: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లక్నో చేరుకోవడానికి కొద్ది గంటల ముందు పోలీసులు 22 మందిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌ని అడ్డుకోవడం, లేదా ఇతర రకాల గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాము 22 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దీపక్ కుమార్ చెప్పారు.

06/21/2017 - 03:28

న్యూఢిల్లీ, జూన్ 20: రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్‌కు ఎలక్టోరల్ కాలేజి సంఖ్యాబలం పూర్తి అనుకూలంగా ఉండడమే కాకుండా ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఆయనకన్నా ముందు రాష్టప్రతిగా ఉండిన ప్రతిభా పాటిల్‌కన్నా కూడా ఎక్కువ ఓట్లు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

06/21/2017 - 03:26

న్యూఢిల్లీ, జూన్ 20: దళితుడిని రాష్టప్రతిగా ఎంపిక చేయటం కొత్తేమీ కాదు, ఆ పని తామెప్పుడో చేశామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.

06/21/2017 - 02:18

గురుగావ్, జూన్ 20: కదులుతున్న కారులో ఓ మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ సంఘటన మంగళవారం ఉదయం గురుగావ్‌లోజరిగింది. గత నెల 29 గురుగావ్ మనిసర్ ప్రాంతంలో ఓ మహిళను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బాధితురాలి తొమ్మిది నెలల పాపను పాశవికంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే మళ్లీ మరో మహిళపై గ్యాంగ్ రేప్ సంఘన జరిగడం అక్కడి పోలీసులకు సవాలుగా మారింది.

06/21/2017 - 02:10

న్యూఢిల్లీ, జూన్ 20: వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదననూ కేంద్రం పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసిన ఒక రోజు తర్వాత జైట్లీ ఈ విషయం చెప్పడం గమనార్హం. ‘అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు. ఎఫ్‌ఆర్‌ఎంబి చట్టం, ద్రవ్య లోటు లక్ష్యాలు మాకు ఉన్నాయి.

Pages