S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/20/2017 - 01:24

దీనిపై నేను మాట్లాడను. ఎన్డీయే అభ్యర్థి గుణ దోషాలను విశే్లషించను.
-గులాంనబీ ఆజాద్

06/20/2017 - 01:22

ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. 22న చర్చించుకుంటాం.
-వామపక్షాలు

06/20/2017 - 01:21

‘రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతిగా
నిరుపమాన రీతిలో రాణించగలరు. అలాగే పేదలు, అణగారిన వర్గాలకు కోసం మరింత బలంగా కృషి
చేస్తారన్న నమ్మకం నాకు ఉంది’
-ప్రధాని నరేంద్ర మోదీ

06/20/2017 - 01:13

న్యూఢిల్లీ, జూన్ 19: బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి అధికార పక్షం బిజెపి ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

06/19/2017 - 23:51

న్యూఢిల్లీ, జూన్ 19: విద్యార్థి నాయకుడు నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసులో సిబిఐ బృందం సోమవారం మరోసారి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్లింది. 2016 అక్టోబర్ 16న హాస్టల్ గదినుంచి అదృశ్యమైన నజీబ్ జాడ ఇప్పటికీ తెలియలేదు.

06/19/2017 - 23:51

న్యూఢిల్లీ, జూన్ 19: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లను పెంచటం న్యాయపరమైన చిక్కుల మూలంగా ప్రస్తుతానికి ఆగిందని సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

06/19/2017 - 03:03

న్యూఢిల్లీ, జూన్ 18: సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అందుకు వీలుగా సామరస్యపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎమ్) ఆందోళనకారులకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వీలైన పరిస్థితులను పాదుగొల్పాలంటూ తాజాగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

06/19/2017 - 03:02

డార్జిలింగ్, జూన్ 18: డార్జిలింగ్‌లో జరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆదివారం మరింతగా తీవ్రమైంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎమ్)కు చెందిన ఓ కార్యకర్త మృతదేహాన్ని తీసుకుని వేలాదిమంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనంటూ పెద్దఎత్తున డిమాండ్ చేశారు.

06/19/2017 - 02:58

న్యూఢిల్లీ, జూన్ 18:అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలూ సంసిద్ధమవుతున్నాయి. ఈ నెల 21 అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సన్నద్ధంగా అనేక రాష్ట్రాల్లో విస్తృత స్థాయి రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.

06/19/2017 - 02:54

ఉడిపి, జూన్ 18: దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు, సిమ్బంది కొరత పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేస్తూ, ఈ అంతరాన్ని తగ్గించడానికి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Pages