S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/18/2017 - 03:23

న్యూఢిల్లీ, జూన్ 17: వచ్చేనెలలో పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రెండు క్షమాభిక్ష అభ్యర్థనలను తిరస్కరించినట్టు తెలిసింది. మే నెలాఖరున రెండు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించినట్టు ఓ ఆంగ్ల దినపత్రి వెల్లడించింది. ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్లలో అత్యాచారం, కిడ్నాప్ కేసులో మరణశిక్ష పడ్డ నేరస్తులవే.

06/18/2017 - 03:22

న్యూఢిల్లీ, జూన్ 17: రాష్టప్రతి పదవికి తాను పోటీ పడుతున్నట్లు వస్తున్న వార్తలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఖండించారు. సుష్మా స్వరాజ్ శనివారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్టప్రతి పదవికి తాను పోటీపడటం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. బిజెపి అధినాయకత్వం రాష్టప్రతి పదవికి సుష్మా స్వరాజ్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు రావటం తెలిసిందే.

06/18/2017 - 03:20

ముంబయి, జూన్ 17: దాయాదులు ఇకపై ఒకరితో ఒకరు సొంత గడ్డపై తలపడే అవకాశాలే లేవని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీ బలోపేతానికి గాను మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.

06/18/2017 - 03:17

న్యూఢిల్లీ, జూన్ 17: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అఛాబాల్‌లో మిలిటెంట్లు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. నిరాయుధులుగా ఉన్న ఆరుగురు పోలీసులను మిలిటెంట్లు కాల్చి చంపడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శనివారం ఇక్కడ స్పష్టం చేశారు.

06/18/2017 - 03:15

న్యూఢిల్లీ, జూన్ 17: కార్మికుల ఉపాధికి కనీస వయో పరిమితి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంఘం రూపొందించిన రెండు తీర్మానాలను భారతదేశం ఆమోదించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అంతర్జాతీయ కార్మిక సంఘం సదస్సుకు హాజరై వచ్చిన అనంతరం ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

06/18/2017 - 03:02

హైదరాబాద్/జీడిమెట్ల, జూన్ 17: సమగ్రతే మిలటరీ ఉద్యోగానికి పునాది అని, అదే లోపిస్తే సమాజం మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని దేశ సైన్యాధిపతి బిపిన్ రావత్ అన్నారు. ఒక వేళ రక్షణ దళాలపై సమాజానికి నిజంగానే నమ్మకం పోతే జాతీయతకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు.

06/18/2017 - 02:37

న్యూఢిల్లీ, జూన్ 17: ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోలు బంకు లైసెన్స్‌ను బిపిసిఎల్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నామని వెల్లడించింది. అయితే బిపిసిఎల్ చర్యను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఆర్‌జెడి వర్గాలు వెల్లడించాయి.

06/18/2017 - 02:24

డార్జిలింగ్, జూన్ 17: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతోంది. గూర్ఖా జనముక్తి మోర్చా గత ఆరు రోజులుగా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం హింసాకాండ పెచ్చుమీరింది. గూర్ఖా జనముక్తి మోర్చా సీనియర్ నాయకుడి ఇంటిపై శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

06/18/2017 - 02:16

వదోదర, జూన్ 17: దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం కార్యచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపుచేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్టు శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకోడానికి వీలుగా ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేయనున్నట్టు జవడేకర్ ప్రకటించారు.

06/18/2017 - 01:45

హైదరాబాద్, జూన్ 17: పాస్ పోర్టు సేవలను నేరుగా పోస్ట్ఫాసుల్లో అందించేందుకు విదేశీ మంత్రిత్వశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా మరో 149 పట్టణాల్లో పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఏడు, తెలంగాణలో ఐదు పట్టణాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. పాస్‌పోర్టుకు సంబంధించిన అన్ని సేవలను ఈ కేంద్రాల్లో అందిస్తారు.

Pages