S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/22/2017 - 23:47

న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో వివిధ ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రైతు రుణమాఫీ పథకాలు బ్యాంకులపై విపరీతపై భారాన్ని మోపనున్నాయి. 1.5 నుంచి 2.3 ట్రిలియన్ల రూపాయల వరకూ అవసరం అవుతాయి. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణమాఫీ పథకాల కింద బ్యాంకుల్లో పేరుకుపోయిన రుణాలు 30 నుంచి 40 శాతం మాఫీ అవుతాయి. పంజాబ్ ప్రభుత్వం కూడా 15 శాతం బకాయిలు మాఫీ చేయనుంది.

06/22/2017 - 23:46

న్యూఢిల్లీ, జూన్ 22: మరణశిక్షలను ఎదుర్కొంటున్న దోషులు న్యాయపరంగా తమకున్న అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత కూడా తమను ఉరి తీయడాన్ని సవాలు చేస్తూ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా లేదా అనే అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.

06/22/2017 - 23:45

న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో పట్టణ ప్రాంత పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 6,500 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. లక్షా 27వేల మందికి గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన (అర్బన్) కింద ఇళ్లను నిర్మించనున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికే 20.95 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్ర హౌసింగ్, పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ వెల్లడించింది.

06/22/2017 - 23:45

కోల్‌కతా, జూన్ 22: కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి సిఎస్ కర్ణన్ ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవడానికి గురువారం మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కర్ణన్ బాగాలేరని, బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని, అందుకే ఈ రోజు మరోసారి ప్రభుత్వ అధీనంలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రికి తీసుకెళ్లామని ప్రస్తుతం కర్ణన్ ఉంటున్న ప్రెసిడెన్సీ జైలు అధికారి ఒకరు పిటిఐకి చెప్పారు.

06/22/2017 - 03:31

సూళ్లూరుపేట, జూన్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జిఎస్‌ఎల్‌వి మార్క్3 వంటి భారీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా చేపట్టి 20రోజుల గడవక ముందే మరో రికార్టు ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏకంగా 31 ఉపగ్రహాలు ఒకేసారి రోదసీలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి శుక్రవారం ఉదయం 9:29కి పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

06/22/2017 - 02:35

న్యూఢిల్లీ, జూన్ 21: బుద్ధిమాంద్యం, మానసిక రుగ్మత, మేధోపరమైన వైకల్యం, యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం సిద్ధం చేసింది. ఇలాంటి వారికి రిజర్వేషన్లు, ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల్లో చేరేందుకు వయసు పరమైన నిబంధనలనూ సడలించాలని ఈ విభాగం భావిస్తోంది.

06/22/2017 - 02:35

న్యూఢిల్లీ, జూన్ 21: బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు జెడి(యు) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతు ప్రకటించటంతో ప్రతిపక్ష మహాకూటమి కుప్పకూలింది. పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన జెడి(యు) సమావేశంలో కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి చర్చించారు.

06/22/2017 - 02:34

చెన్నై, జూన్ 21: భారత మాజీ ప్రథాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందుతుడైన రాబర్ట్ పయాస్ కారుణ్య మరణంకోసం తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గత 27 సంవత్సరాలుగా తాను జైలులోనే ఉన్నానని, తన జీవితమంతా వ్యర్థమైపోయిందని వాపోతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు జైళ్ల డిజిపికి రాబర్ట్ లేఖ రాశాడు.

06/22/2017 - 02:34

చెన్నై, జూన్ 21: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళపై ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న శశికళపై ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో చార్షిషీటు దాఖలయింది. జైలులో ఉన్న శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎ జకీర్ హుసేన్ విచారించారు. శశికళ బెంగళూరులోని పరపన్న అగ్రహారం జైలులో ఉన్నారు.

06/22/2017 - 02:33

న్యూఢిల్లీ, జూన్ 21: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) నిర్వహించే టెన్త్, 12వ తరగతి పరీక్షలు ఇకనుంచి ఫిబ్రవరిలోనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మార్చిలో ఈ పరీక్షలు నిర్వహించేవారు. దానికి బదులుగా ఫిబ్రవరిలో 10, 12వ తరగతి పరీక్షలు జరపాలని నిర్ణయించినట్టు బోర్డు బుధవారం ఇక్కడ స్పష్టం చేసింది.

Pages