S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/24/2017 - 01:25

చిత్రం.. కోవింద్ దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను సరిచూస్తున్న లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా.

06/24/2017 - 01:23

న్యూఢిల్లీ, జూన్ 23: రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. రాష్టప్రతి పదవికి శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

06/24/2017 - 01:26

శ్రీనగర్, జూన్ 23: శ్రీనగర్‌లోని జామి యా మసీదు వద్ద డిఎస్పీని అల్లరి మూక కొట్టి చంపిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటయిన సంఘటన మరోటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. పోలీసుల సహనాన్ని పరీక్షించవద్దని కూడా ఆమె హెచ్చరించారు.

06/24/2017 - 01:15

చిత్రం.. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

06/24/2017 - 01:13

లక్నో, జూన్ 23: షియా వక్ఫ్‌బోర్డు సభ్యుల తొలగింపు వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు నామినేటెడ్ సభ్యులను తొలగిస్తూ యుపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కొట్టివేయడంతో పాటు వారిని తిరిగి నియమిస్తూ జస్టిస్ రాజన్‌రాయ్, జస్టిస్ ఎస్.ఎన్.అగ్నిహోత్రి ఈ ఆదేశాలు జారీచేశారు.

06/24/2017 - 01:12

న్యూఢిల్లీ, జూన్ 23: పాస్‌పోర్టుల్లో వ్యక్తిగత వివరాలు ఇకపై ఏవలం ఇంగ్లీషులో కాకుండా హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉంటాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. ఇప్పటివరకు ఈ వివరాలు కేవలం ఇంగ్లీషులోనే ఉండేవి. అంతేకాకుండా ఎనిమిదేళ్ల లోపు పిల్లలు, అరవై ఏళ్లకు పైబడిన వారి పాస్‌పోర్టు దరఖాస్తు ఫీజును పది శాతం తగ్గించినట్లు కూడా సుష్మాస్వరాజ్ చెప్పారు.

06/24/2017 - 01:09

డార్జిలింగ్, జూన్ 23: ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు కోసం ఉద్యమం ఉద్ధృతం చేస్తామని గూర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం) అధినేత బిమల్ గురుంగ్ ప్రకటించారు. హిల్ ఏరియాలో ఈనెల 17న జరిగిన పోలీసు కాల్పులపై సిబిఐ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆయన డిమాండ్ చేశారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్(జిటిఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసిన బిమల్‌‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగుతుంది’అని ప్రకటించారు.

06/23/2017 - 02:50

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమాన్ని ఎన్‌డిఏ బలప్రదర్శనగా మార్చివేశారు. జెడి(యు), అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి, బీజూ జనతాదళ్ పార్టీల మద్దతు సంపాదించటం ద్వారా ఎన్‌డిఏ బలాన్ని దాదాపు 60 శాతానికి పెంచిన నరేంద్ర మోదీ దీనిని నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

06/23/2017 - 02:44

న్యూఢిల్లీ, జూన్ 22: కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. దీనిపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) మధ్యవర్తిత్వం అక్కర్లేదని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఐరాస ఏమైనా చేయాలనుకుంటే జిహాద్ పేరుతో పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా చూస్తే చాలని పేర్కొన్నారు.

06/23/2017 - 02:39

న్యూఢిల్లీ, జూన్ 22: ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య, అర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాలతో (ఏసియన్) గత రెండేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న వాణిజ్యం ఇప్పుడు వృద్ధిబాట పట్టిందని, ఈ దిశగా 2016-17లో ఏకంగా 8శాతం వృద్ధి నమోదు చేసుకుందని ఆమె పేర్కొన్నారు.

Pages