S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/03/2017 - 02:22

న్యూఢిల్లీ,మే 2: ఉమ్మడి ఏపి ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే తుదితీర్పు వెలువడేంతవరకు స్థలాలలో నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. శాసన సభ్యులు, సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టులోని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నాజిర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

05/03/2017 - 02:21

న్యూఢిల్లీ/కోల్‌కతా, మే 2:సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు న్యాయమూర్తులకు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్నన్ మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి సరికొత్త సంచలనానికి తెరతీశారు.తాను ఆదేశించినట్టుగా వీరందరూ తన ముందు హాజరు కానందుకే ఈ వారెంట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు.

05/03/2017 - 01:44

న్యూఢిల్లీ, మే 2: ‘తెలంగాణ పోలీసులు బోగస్ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్ ద్వారా ముస్లిం యువతను మతోన్మాదులుగా మారుస్తున్నారన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెడితే సుప్రీంకోర్టులో పోరాడుతా’ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

05/03/2017 - 02:04

న్యూఢిల్లీ, మే 2: ఆధార్‌ను పాన్‌కార్డుకు అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టిగా సమర్థించుకుంది. ఈ అనుసంధానత తప్పని సరి అని, దీని వల్ల ఓ బలమైన, స్థిరమైన వ్యవస్థ ఏర్పాటుకు ఆస్కారం ఏర్పడుతుందని సుప్రీం కోర్టుకు నివేదించింది. నకిలీ పాన్ కార్డుల జాడ్యాన్ని కూడా ఆధార్‌ను అనుసంధానత వల్ల అరికట్ట వచ్చునని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ తెలిపారు.

05/03/2017 - 01:26

న్యూఢిల్లీ, మే 2: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మరి కొంతకాలం గవర్నర్‌గా సేవలందిస్తారు. తదుపరి ఏర్పాట్లు చేసేంతవరకు తెలుగు రాష్ట్రాలకు గవర్నరుగా కొనసాగాలని నరసింహన్‌ను కోరుతూ కేంద్రం వౌఖిక ఆదేశాలు జారీ చేసిం ది. ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ పదవీకాలం నేటితో ముగుస్తోంది.

05/03/2017 - 01:23

న్యూఢిల్లీ, మే 2: ఇద్దరు భారత జవాన్ల శరీరాలను ఛిద్రం చేసి, తలలు నరికేసిన కిరాతక చర్యపై భారత్ ఆరోపణలను పాకిస్తాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ‘చర్యలు తీసుకోదగిన సాక్ష్యాల’ను చూపించాలని స్పష్టం చేసింది. ‘‘పాకిస్తాన్ సైన్యం వృత్తిపరంగా నిబద్ధత కలిగిన సైన్యం. అత్యున్నత ప్రమాణాలు, నైతిక ప్రవర్తన కలిగిన సైనికులు మావాళ్లు. భారత జవాన్ల శరీరాలు ఛిద్రం చేశారంటూ భారత్ ఆరోపణలు చేయటం అసంబద్ధమైంది.

05/03/2017 - 01:10

న్యూఢిల్లీ,మే 2:ఆధార్‌ను పాన్‌కార్డుకు అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టిగా సమర్థించుకుంది. ఈ అనుసంధానత తప్పని సరి అని, దీని వల్ల ఓ బలమైన, స్థిరమైన వ్యవస్థ ఏర్పాటుకు ఆస్కారం ఏర్పడుతుందని సుప్రీం కోర్టుకు నివేదించింది. నకిలీ పాన్ కార్డుల జాడ్యాన్ని కూడా ఆధార్‌ను అనుసంధానత వల్ల అరికట్ట వచ్చునని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ తెలిపారు.

05/02/2017 - 02:43

న్యూఢిల్లీ, మే 1: నిరంతరం క్రమంగా పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు ఉభయ దేశాలను కలవరపరుస్తున్న అంశమని భారత్, టర్కీ పేర్కొన్నాయి. ఉగ్రవాదం సరయిందని, సక్రమమయిందని చెప్పగలిగే కారణం లేదా హేతువు ఏదీ లేదని పేర్కొన్నాయి. ఉగ్రవాద శక్తులకు ఆశ్రయమిచ్చే, మద్దతిచ్చేవారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గట్టిగా చెప్పాయి.

05/02/2017 - 02:41

న్యూఢిల్లీ, మే 1: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కాశ్మీర్ అశంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఎర్డోగన్ ఆదివారం సాయంత్రం భారత్‌కు చేరుకోవడానికి ముందు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి బహుళ పక్షాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతటితో ఆగకుండా ఈ అంశంపై భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ‘మరింత మంది చనిపోవడానికి మనం అవకాశం ఇవ్వొద్దు.

05/02/2017 - 02:39

న్యూఢిల్లీ, మే 1: ఉపాధి కల్పనకే ఎన్డీయే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడారు. దేశంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, వేతనాలు పెంచడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు.

Pages