S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/07/2016 - 07:12

న్యూఢిల్లీ, నవంబర్ 6: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించడం మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థాగత ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయాలని పార్టీ అదినేత్రి భావిస్తూ ఉండడమే దీనికి కారణం. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్ దాకా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

11/07/2016 - 07:03

న్యూఢిల్లీ, నవంబర్ 6: వ్యవసాయం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంపై రూపొందించే చట్టాలు భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయాభివృద్ధిని దెబ్బ తీయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు పంట దిగుబడిని పెంచే సాంకేతిక పరిజ్ఞానాలు నిలకడయిన అభివృద్ధిని కుంటుపడనీయకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు.

11/07/2016 - 07:03

న్యూఢిల్లీ, నవంబర్ 6: బంగ్లాదేశ్‌లో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన తాజాగా దాడులు జరిగిన దృష్ట్యా ఆ దేశంలో హిందువుల భద్రత పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనను ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు తెలియజేయాలని ఢాకాలోని భారత హైకమిషనర్‌ను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశించారు.

11/07/2016 - 01:13

జమ్ము, నవంబర్ 6: భారత సైన్యం విజయవంతంగా జరిపిన లక్షిత దాడులతో బరితెగించిన పాకిస్తాన్ సీమాంతర కాల్పులను విచ్చలవిడిగా కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు విఫల యత్నాలు చేస్తూనే ఉంది. వీటికి భారత సైన్యం గట్టిగా జవాబిస్తోంది. దీంతో పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

11/06/2016 - 02:40

న్యూఢిల్లీ, నవంబర్ 5: పెట్రోలు, డీజిలు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 89 పైసలు పెరగ్గా, డీజిలు ధర లీటరుకు 86 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తాయని దేశంలో అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ప్రకటించింది. వ్యాట్, స్థానిక పన్నులను కలుపుకొంటే ఈ పెరుగుదల మరికాస్త ఎక్కువే ఉంటుంది.

11/06/2016 - 02:08

సూరత్, నవంబర్ 5: గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధోలాకియా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఖరీదయిన బహుమతులు ఇవ్వడం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఆయన దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన 1200 కార్లు, 400 ప్లాట్లు తన ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా ఇచ్చారు.

11/06/2016 - 02:07

అహమ్మదాబాద్, నవంబర్ 5: గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్తేరా పటియా గ్రామం దగ్గర ఒక ట్రక్ తీర్థయాత్రికులతో వెళ్తున్న మినీ బస్సును ఢీకొనడంతో మొత్తం 17మంది దుర్మరణం పాలయ్యారు. 14మంది అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

11/06/2016 - 01:35

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఎన్‌డిటివి ఇండియా న్యూస్ చానల్‌పై కేంద్రం ఒక రోజు నిషేధం విధించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం శనివారం మరింత తీవ్రమైంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిషేధం విధించినట్లు కేంద్రం అంటుండగా, ఈ చర్య రెండో ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.

11/06/2016 - 01:07

లక్నో, నవంబర్ 5: సమాజ్‌వాది పార్టీ రజతోత్సవ వేడుకల సాక్షిగా ఆ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

11/06/2016 - 01:05

శ్రీనగర్, నవంబర్ 5: జమ్మూకాశ్మీర్‌లో ఓ టీనేజర్ మృతి ఘర్షణకు దారితీసింది. శ్రీనగర్ పట్టణంలోని ఈద్గా ప్రాంతంలో నిరసనకారులు, భద్రతాదళాల మధ్య శనివారం నాటి ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. గత నెల 25న అదృశ్యమైన 16 ఏళ్ల ఖైసర్ సోఫి అపస్మారక స్థితిలో పడి ఉండగా షాలిమార్ ప్రాంతంలో కనుగొన్నారు. ఆరు రోజుల క్రితం ఇది జరిగింది, సోఫిని ఆసుపత్రికి తరలించగా శనివారం ఉదయం మృతిచెందాడు.

Pages