S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/06/2016 - 01:03

చెన్నై, నవంబర్ 5: ఎన్‌డిటివి చానల్‌పై ఎన్‌డిఎ ప్రభుత్వం ఒకరోజు నిషేధం విధించడం అత్యవసర పరిస్థితిని తలపిస్తోందంటూ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు శనివారం తీవ్రంగా ఖండించారు. దేశ భద్రత కోసమే ప్రభుత్వం ఆ చానల్‌పై ఈ చర్య చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

11/06/2016 - 01:02

మండి, నవంబర్ 5: హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఒక ప్రైవేటు బస్సు బియాస్ నదిలో పడి 18 మంది మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. మనాలి నుంచి కుల్లుకు వెళ్తున్న ఈ ప్రైవేటు బస్సు మండి జిల్లాలోని వింద్రావని ప్రాంతంలో ప్రమాదానికి గురయింది.

11/06/2016 - 01:00

సహరాన్‌పూర్, నవంబర్ 5: సమాజ్‌వాది పార్టీలో అంతఃకలహాలు పెచ్చరిల్లాయని, ఒకరినొకరు తిట్టుకోవడంలో వాళ్లు బిజీ అయపోయారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఇక బిఎస్‌పి అధినేత్రి మాయావతికి వీరిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శనివారం సహరాన్‌పూర్‌లో పరివర్తన్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.

11/06/2016 - 00:58

శ్రీనగర్, నవంబర్ 5: దక్షిణ కాశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో శనివారంనాటి ఎన్‌కౌంటర్‌లో ఓ మిలిటెంట్ మరణించాడు. ఒక సైనికుడు గాయపడ్డాడు. ఇక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని దొబ్జాన్ గ్రామంలో నలుగురు మిలిటెంట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. భద్రతాదళాలు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మిలిటెంట్లు దాగిన ఇంటిని ముట్టడించారు.

11/06/2016 - 00:57

రామేశ్వరం, నవంబర్ 5: మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం పెద్ద సోదరుడు ఎపిజె మొహమ్మద్ ముత్తుమీరన్ మరైకయ్యార్ శనివారం వందవ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసిన కొందరు సైంటిస్టులు కూడా ముత్తుమీరన్‌కు శుభాకాంక్షలు అందజేశారు.

11/06/2016 - 00:55

న్యూఢిల్లీ, నవంబర్ 5: కౌంటర్ టెర్రరిజంతోపాటు పరస్పర ఆసక్తి, ఆందోళనకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి చర్చల ప్రక్రియను కొనసాగించాలని భారత, చైనా దేశాలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

11/06/2016 - 00:54

లఖింపూర్ ఖేరి (యుపి), నవంబర్ 5: కట్టుకున్న భార్యను, ముక్కుపచ్చలారని నలుగురు ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపిన ఓ వ్యక్తికి స్థానిక కోర్టు ఉరిశిక్షను విధిస్తూ శనివారం తీర్పు ఇచ్చింది. దీంతోపాటు 20వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జిల్లా సెషన్స్ జడ్జి రాజ్‌బీర్ సింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

11/06/2016 - 00:53

న్యూఢిల్లీ, నవంబర్ 5: వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్ నడుపుతున్న ఐఆర్‌ఎఫ్ ఎడ్యుకేషనల్ ట్రస్టును ముందస్తు అనుమతితోనే విదేశీ విరాళాలను స్వీకరించాలనే స్వచ్ఛంద సంస్థల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ సంస్థ విదేశాలలోని వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించడానికి వీలులేదు.

11/06/2016 - 00:53

ముంబయి, నవంబర్ 5: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో నిర్వహించినట్టుగానే చైనాపై కూడా లక్షిత దాడులను నిర్వహిస్తారా? అని శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘్భరత భూభాగంలోకి చైనా చొచ్చుకు రావడాన్ని తీవ్రంగా పరిగణించవలసిన సమయం ఆసన్నమయింది. చైనాకు కూడా గట్టి బుద్ధి చెప్పవలసి ఉంది’ అని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది.

11/05/2016 - 08:15

న్యూఢిల్లీ, నవంబర్ 4: పదవీ విరమణ చేసిన రక్షణశాఖ ఉద్యోగులకు ఓఆర్‌ఓపి పథకం అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఏవో సాకులు చెబుతూ దాటవేత ధోరణి అవలంబిస్తోందని శుక్రవారం ఆయన ఆరోపించారు.

Pages