S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/27/2016 - 08:00

బెంగళూరు, అక్టోబర్ 26: గనుల అక్రమ తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పకు పెద్ద ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌లో అవినీతికి పాల్పడినట్లు నమోదయిన కేసులో యెడ్యూరప్పను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. యెడ్యూరప్ప ఇద్దరు కుమారులు, అల్లుడు, మరో తొమ్మిది మంది నిందితులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

10/27/2016 - 07:59

లక్నో, అక్టోబర్ 26: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న సంక్షోభం బుధవారం ఆసక్తికర మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు విధేయుడుగా భావిస్తున్న మరో మంత్రిని పార్టీ నుంచి బహిష్కరించడంతో ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అఖిలేష్ రాష్ట్ర గవర్నర్ రాంనాయక్‌ను కలుసుకోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

10/27/2016 - 07:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఉమ్మడి పౌరస్మృతిని ఏకాభిప్రాయం లేకుండా దొడ్డిదారిన తీసుకురాబోమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు చీల్చడానికి బిజెపి వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.

10/27/2016 - 07:57

చెన్నై, అక్టోబర్ 26: అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైందని పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. తమ అధినేత్రి త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ప్రకటించారు. మరోపక్క జయ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ‘జయ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. దేవుని దయవల్ల ఆమె కోలుకున్నారు.

10/27/2016 - 07:54

కాబూల్, అక్టోబర్ 26: సెంట్రల్ ఆఫ్గనిస్తాన్‌లో ఐఎస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించారు. 30 పౌరులను అపహరించుకుపోయి దారుణంగా చంపేశారు. మృతుల్లో చిన్న పిల్లలూ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూపుతో సంబంధాలున్న మిలిటెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారన్నారు.

10/27/2016 - 07:53

న్యూఢిల్లీ,అక్టోబర్ 26: దేశంలోని వందలాది గిరిజన భాషలకు లిపిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఆసన్నమైందని టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు, సీనియర్ గిరిజన నాయకుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని లక్షలాది మంది గిరిజనుల విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు.

10/27/2016 - 07:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రభుత్వం చేపట్టే పథకాలను మరింత వేగంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే వార్షిక బడ్జెట్‌ను నెల రోజుల ముందే ప్రవేశ పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ప్రయోజనాలను పొందేందుకు రాష్ట్రాలు తమ ప్రణాళికలను దీనితో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. నెలవారీగా జరిగే ప్రగతి కార్యక్రమం సందర్భంగా రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో మోదీ నేరుగానే మాట్లాడారు.

10/27/2016 - 06:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నమోదైన ఫిర్యాదులపై ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నవంబరు 8లోగా తెలపాలంటూ శాసన సభ స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనేలా ఆదేశాలివ్వాలంటూ శాసన సభ్యుడు సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

10/26/2016 - 08:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గిరిజన హక్కులను కాలరాస్తే సహించేదిలేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అడవుల్లోని సహజ సంపదను ఆసరాగా చేసుకుని జీవిస్తున్న గిరిజన హక్కులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుమని స్పష్టం చేశారు. మంగళవారం నాడిక్కడ జాతీయ గిరిజన ఉత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన మోదీ గిరిజన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు.

10/26/2016 - 08:22

లక్నో, అక్టోబర్ 25: సమాజ్‌వాదీ పార్టీలో కానీ, తమ కుటుంబంలో కానీ ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా తన కుమారుడు అఖిలేష్ వర్గానికి, తమ్ముడు శివపాల్ యాదవ్ వర్గానికి మధ్య తీవ్రస్థాయిలో తలెత్తిన విభేదాలు పార్టీని నిలువునా చీల్చేస్థాయికి చేరటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ములాయం స్వయంగా రంగంలోకి దిగారు.

Pages