S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/02/2016 - 12:03

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వరసగా రెండోరోజు మంగళవారం కూడా లోక్‌సభలో టిడిపి, వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వారి నినాదాల హోరు మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడవద్దని, ప్లకార్డులు ప్రదర్శించరాదని ఆమె పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు.

08/02/2016 - 12:02

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ విద్యాశాఖా మంత్రి నరుూమ్ అఖ్తర్ అధికార నివాసంపై సోమవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు వేశారు. ఆ సమయంలో ఇంట్లో మంత్రి నరుూమ్, ఆయన కుటుంబ సభ్యులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బాంబులు పేలి ఇంటిముందు భాగం ధ్వంసమైంది. శ్రీనగర్‌లో ఆర్ అండ్ బి భవనంతో పాటు మరికొన్ని చోట్ల ఆగంతకులు బాంబులు విసిరారు. ఈ ఘటనతో మంత్రుల ఇళ్లవద్ద భద్రతను పెంచారు.

08/02/2016 - 04:47

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో కొనసాగుతూనే దశలవారీగా పోరాటాలు చేస్తామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసమయితే ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు రావడానికి సిద్ధమని వెల్లడించారు.

08/02/2016 - 03:58

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పరిశీలిస్తోంది. ఏపీకి హోదా ఇవ్వటం సాధ్యంకాదు కనుక, దానిస్థానే ప్యాకేజీ ప్రకటించటం ద్వారా అత్యధిక ఆర్థిక సాయం అందించాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.

08/02/2016 - 03:53

న్యూఢిల్లీ,జూలై 1:ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆయిదేళ్లలో రూ.22,112 కోట్లు నిధుల లభ్ధి చేకూరనుందని కేంద్రమంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు కేంద్రం చేసిన సహాయంపై రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు ఇందర్‌జిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మార్చి 31 నాటికి మొత్తం రూ.6,403 కోట్ల విడదల చేసినట్లు పేర్కొన్నారు.

08/02/2016 - 03:42

న్యూఢిల్లీ, జూలై 1: బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో ఆంధ్రను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యవేక్షణ కమిటీలో ఏపీని తొలిగించాలన్న మహారాష్ట్ర, తెలంగాణ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఖన్‌వాల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

,
08/02/2016 - 03:34

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు సోమవారం లోక్‌సభలో ధర్నా చేశారు. టిడిపికి చెందిన పనె్నండు మంది సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ గందరగోళం సృష్టించారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ వారిచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది.

08/02/2016 - 03:17

న్యూఢిల్లీ, ఆగస్టు 1: నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని పట్టుదలగా ఉన్న బిజెపి రానున్న మూడు రోజుల్లో పార్టీ ఎంపీలందరూ తప్పని సరిగా సభకు హాజరుకావాలంటూ సోమవారం విప్ జారీ చేసింది.

08/02/2016 - 02:47

చిత్రం.. అతిచిన్న వయసులోనే పర్వతారోహణ చేసిన బాలిక ఆర్యన్ బాలాజి సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న దృశ్యం

08/02/2016 - 02:45

చిత్రం.. పార్లమెంటు ఆవరణలోకి యుద్ధం ట్యాంకులు వచ్చాయేమిటని ఆశ్చర్యపోతున్నారా! రానున్న 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఆర్‌డివో సంస్థ యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ తదితర క్షిపణులను ఇక్కడ ప్రదర్శిస్తోంది.

Pages