S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/03/2016 - 04:30

కోయంబత్తూరు, ఫిబ్రవరి 2: దళితుల హక్కులను పూర్తి స్థాయిలో పరిరక్షిస్తామని, వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడ్డారు.

02/02/2016 - 06:10

పాట్నా, ఫిబ్రవరి 1: ప్రవాసం నిమిత్తం సీతాదేవిని శ్రీరామచంద్రుడు అడవికి పంపడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై బిహార్‌లోని ఒక న్యాయస్థానం సోమవారం విచారణ ప్రారంభించింది. రామాయణంలో చెబుతున్నట్లుగా సీతాదేవిని రాముడు అడవులకు పంపినందుకు ఎవరిని శిక్షించాలి? అని కోర్టు ఈ సందర్భంగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. ‘ఎప్పుడో పురాతన కాలంలో జరిగినట్లు చెబుతున్న ఈ సంఘటనపై ఎందుకు కేసు దాఖలు చేశారు?

02/02/2016 - 05:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక సహకారం, పర్యావరణ పరిరక్షణ అంశంపై ఆంధ్రప్రదేశ్, కెనడాలోని ఒంటారియో రాష్ట్రాల మధ్య ఎంఓ యు కుదిరింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్‌రావు, ఒంటారియో అంతర్జాతీయ వాణి జ్యం, పౌరసత్వ శాఖ మంత్రి మిఖాయిల్ ఛాన్ సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

02/02/2016 - 05:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అంధ్రప్రదేశ్ కాల్‌మనీ రాకెట్ కేసులో నాల్గవ నిందితుడు, ట్రాన్స్‌కో ఉద్యోగి ఎం.సత్యానందంకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని సత్యానందంకు నోటీసులు జారీచేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

02/02/2016 - 03:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాజకీయాల్లోకి వస్తే చాలు కోట్లకు పడగలెత్తుతున్న నేతల్ని చాలా మందిని చూస్తున్నాం! ఆస్తుల చిట్టా విప్పితే చాలు ఏళ్లు గడవక ముందే అమాంతం వందల రెట్లు పెరిగిపోయిన నేతల చిట్టాలకు కొదవ లేదు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ విషయంలో భిన్నం. హోదాయే తప్ప తనకు ఆస్తులూ ఎక్కువ లేవన్న విషయాన్ని ఆయన వెల్లడించిన తాజా లెక్కలే చెబుతున్నాయి. మోదీ వద్ద అందుబాటులో ఉన్న నగదు కేవలం 4700 రూపాయలే.

02/02/2016 - 02:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం కాపుల సమస్యలను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమైనందుకే వారు ఉద్యమించవలసి వస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు.

02/02/2016 - 02:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు సత్యశోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనకు ఈ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

02/02/2016 - 02:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: జాతీయ ఆహార భద్రత, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చట్టాలను అమలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గుజరాత్ వంటి రాష్ట్రం పార్లమెంటు ఆమోదించిన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. ‘పార్లమెంటు ఏం చేస్తోంది? గుజరాత్ భారత్‌లో అంతర్భాగం కాదా?

02/02/2016 - 02:55

ముంబయి, ఫిబ్రవరి 1: రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి హేమమాలినికి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం భూమిని కేటాయించడంపై వివాదం క్రమేణా పెరుగుతోంది. అయితే ఈ భూమిని తానేమీ లాక్కోలేదని, దీని కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

02/02/2016 - 02:54

జమ్మూ/శ్రీనగర్, ఫిబ్రవరి 1: జమ్మూ-కాశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), బిజెపిల వైఖరి ఏమిటో వివరించాలని, దీనిపై సంప్రదింపులు జరిపేందుకు మంగళవారం తనతో భేటీకి రావాలని రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా ఇరు పార్టీల అధినేతలను కోరారు.

Pages