S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/23/2015 - 07:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ఉదయం బిఎస్‌ఎఫ్ విమానం కూలిపోయి 10 మంది దుర్మరణం చెందారు. సూపర్‌కింగ్ సంస్థకు చెందిన విమానం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో విమానాశ్రయ ప్రహరీగోడను బలంగా ఢీకొంది. సాంకేతిక నిపుణులతో విమానం రాంచీ వెళ్లడానికి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అధికారులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతి చెందారు.

12/23/2015 - 07:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్‌రావు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.

12/23/2015 - 07:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే విషయం పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.

12/23/2015 - 07:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్మాగారంతోపాటు దేంలోని మూతపడిన అన్ని సిమెంట్ కార్మాగారాలను తెరిపించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గేతే తెలంగాణా అటవీ, పర్యావరణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు హామీ ఇచ్చారు. జోగు రామన్న మంగళవారం అనంత గీతేను కలిసి ఆదిలాబాద్‌లోని సిసిఐ సిమెంట్ కార్మాగారాన్ని తిరిగి ప్రారంభించటం గురించి చర్చించారు.

12/23/2015 - 07:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలోని అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి మంగళవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

12/23/2015 - 06:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మంచినీటి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ సానుకూలత వ్యక్తం చేశారు.

12/23/2015 - 05:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: హవాలా ఆరోపణలను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీ బయటపడినట్లే డిడిసిఏ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా బైట పడతారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీ మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ జైట్లీని గట్టిగా వెనకేసుకు వచ్చారు.

12/23/2015 - 05:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: డిడిసిఏలో జరిగిన అవినీతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యలు చేసిన గొడవ మూలంగా రాజ్యసభ మంగళవారం ఉదయం జీరో అవర్‌లో రెండు సార్లు, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రెండు సార్లు వాయిదా పడింది.

12/23/2015 - 05:43

కలబురగి (కర్నాటక), డిసెంబర్ 22: భారతీయ ఉన్నతవిద్యా సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్‌లో వెనుకబడి పోకుండా ఉండడం కోసం అవి అంతర్జాతీయ వేదికపై తమకున్న అర్హతలను హైలైట్ చేయడానికి మరింత చురుగ్గా ప్రయత్నించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచ స్థాయి అధ్యాపక బృందం వల్ల మాత్రమే ప్రపంచ స్థాయి విద్య సాధ్యమని ఆయన స్పష్టం చేసారు.

12/23/2015 - 05:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలకోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటనకోసం బుధవారం బయలుదేరి వెళ్లనున్నారు. రష్యాతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా ప్రత్యేకించి అణు విద్యుత్, హైడ్రోకార్బన్లు, రక్షణ, వాణిజ్య రంగాలు లక్ష్యంగా ఈ సారి చర్చలు జరగనున్నాయి.

Pages