S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారేలో టీమిండియా

హరారే, జూన్ 9: జింబాబ్వేతో పరిమిత ఓవర్ల సంక్షిప్త సిరీస్‌లో పాల్గొనేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం ఇక్కడికి చేరింది. జింబాబ్వేతో టీమిండియా మూడు వనే్డలు, మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఈనెల 11, 13, 15 తేదీల్లో వనే్డ ఫార్మెట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. టి-20 విభాగంలో ఈనెల 18, 20, 22 తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయి. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అశ్విన్‌లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో టీమిండియాలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.

అలీ అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు

లూయిస్‌విల్లే, జూన్ 9: ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ అంత్యక్రియలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు టికెట్ల పంపిణీని కూడా అధికారులు పూర్తి చేశారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ ఈనెల మూడో తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు శుక్రవారం లూయిస్‌విల్లేలో జరగనున్నాయి. అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పోటెత్తే అవకాశం ఉన్నందున అధికారులు టికెట్లు ఉన్నవారినే అనుమతిస్తామని ప్రకటించారు. టికెట్ల పంపిణీని మొదలుకాక ముందే కౌంటర్ల ముందు భారీ క్యూలు కనిపించాయి.

యుఎస్ గోల్ఫ్ టోర్నీకి ఉడ్స్ డుమ్మా

ఓక్‌వౌంట్ (అమెరికా), జూన్ 9: అమెరికా గోల్ఫ్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ టైగర్ ఉడ్స్ ఈనెల 16న ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గతంలో మూడు పర్యాయాలు ఈ టైటిల్‌ను సాధించిన ఉడ్స్ ఈ టోర్నీకి డుమ్మా కొట్టడం గత ఆరేళ్ల కాలంలో ఇది మూడోసారి. శారీరకంగా తాను యుఎస్ ఓపెన్ గోల్ఫ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా లేనని ఉడ్స్ ప్రకటించాడు. నిరుడు ఆగస్టులో విన్‌ధామ్ చాంపియన్‌షిప్‌లో చివరిసారి పాల్గొన్నాడు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వెన్నునొప్పికి రెండుసార్లు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

చాంపియన్స్ ట్రోఫీ హాకీ భారత్‌కు తొలి పరీక్ష

లండన్, జూన్ 9: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో పాల్గొంటున్న సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు మొదటి మ్యాచ్‌లోనే ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జర్మనీ నుంచి పరీక్ష ఎదురుకానుంది. లీ వాలీ హాకీ సెంటర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో జర్మనీకి ఏ స్థాయిలో పోటీనిస్తుందనే అంశంపైనే భారత్ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. రియో ఒలింపిక్స్‌కు ప్రాక్టీస్ ఈవెంట్‌గా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది. 1982లో ఆమ్‌స్టెర్‌డామ్‌లో టోర్నీ జరిగినప్పుడు కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ భరత హాకీ జట్టు పోడియం ఫినిష్ చేయలేకపోయింది.

చైన్‌స్నాచర్ల అరెస్టు

గచ్చిబౌలి, జూన్ 8: ఐటి కారిడార్‌లో మంగళవారం హల్‌చల్ చేసిన ఇద్దరు చైన్‌స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డిసిపి కార్తికేయ వెల్లడించారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఉపేంద్రనాథ్ కుమారుడు నాగబాబు(22) శంషీగూడ ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నాడు. కూకట్‌పల్లి విజయనగర్ కాలనీకి చెందిన షాహున్ హుస్సేన్ ఇద్దరు ఇంటర్ ఫెయిలై జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్‌లు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. మంగళవారం రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు యత్నించారు. ఒకరి గొలుసును లాక్కోగా రెండు చోట్ల విఫలమైంది. రేఖ అనే యువతి ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు.

గాంధీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

సికింద్రాబాద్, జూన్ 9: ప్రభుత్వం వరం ఇచ్చినా అధికారులు అడ్డుతగులుతూ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని గాంధీ ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. గత నాలుగురోజులుగా వారు తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండు గంటల పాటు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రదీప్ మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో దాదాపు 93మంది వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. అయితే సమైక్య రాష్ట్రంలో జిఓ నెంబర్ 3 కింద తమకు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి జీతాలు అందేవని తెలిపారు.

అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లోకి వలసలు

మేడ్చల్, జూన్ 9: ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును చూసి తెలంగాణలోని పది జిల్లాల నుంచి అన్ని పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన టిడిపి, కాంగ్రెస్, బిజెపికి చెందిన పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తల చేరిక కార్యక్రమాన్ని పట్టణంలోని నవభారత్ ఫంక్షన్ హల్‌లో నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

తాండూరు, జూన్ 9: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ నవీన్‌కుమార్ సూచించారు. గురువారం తాండూరు డివిజన్ పట్టణ, రూరల్, బషీరాబాద్, యాలాల, పెద్దెముల్ పోలీసుస్టేషన్లు, తాండూరు ఎఎస్పీ కార్యాలయాలను సందర్శించారు. విలేఖరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను, నేరప్రవృత్తిని రూపుమాపుతామని అన్నారు. చిన్న విషయాలకు తగాదాలు, దాడులకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. కల్తీమద్యం, బెల్ట్‌షాపులను నిరోదిస్తామని చెప్పారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఆస్తిపన్ను చెల్లించని దుకాణాల సీజ్

ఉప్పల్, జూన్ 9: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ఆస్తిపన్ను బకాయిలపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. సకాలంలో చెల్లించకుండా ఎగనామం పెడుతున్న మున్సిపల్ వ్యాపార దుకాణాలను గురువారం పోలీసు బందోబస్తు మధ్య హబ్సిగూడలో అధికారులు సీజ్ చేశారు. ఒకొక్క దుకాణం లక్షల్లో బకాయిలు ఉన్నారని, సకాలంలో చెల్లించాలని నోటీసులు జారీ చేసినా స్పందించలేదని అధికారులు పేర్కొన్నారు. గతంలో టెండర్ ద్వారా దక్కించుకున్న దుకాణాలను లబ్ధిదారులు ఇతరులకు అద్దెకు ఇచ్చి అధిక మొత్తంలో వసూలు చేసుకుంటూ మున్సిపల్ ఆస్తిపన్ను చెల్లించలేదని అధికారులు తెలిపారు.

వికలాంగులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి

ఘట్‌కేసర్, జూన్ 9: అర్హులైన వికలాంగులకు నిర్మించి ఉన్న ఇళ్లను వెంటనే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచారం పంచాయతీ అన్నోజిగూడ గ్రామ సమీపంలోని కెఎల్ మహీంద్రానగర్‌లో వికలాంగుల కోసం నిర్మించిన ఇళ్లను గురువారం సందర్శించి పరిశీలించారు. అర్హులైన వికలాంగులకు ఇళ్లు కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో 1994 నుండి అనేక ఉద్యమాలు జరిపినట్లు తెలిపారు. సిపిఐ ఉద్యమాల ఫలితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నోజిగూడ గ్రామంలోని సర్వేనెంబర్ 14లో ఇళ్లు నిర్మించినట్టు పేర్కొన్నారు.

Pages