S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళిత జాతి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే

చార్మినార్, జూన్ 9: దళిత జాతి ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరినిర్వాన్ భూమి సమ్మాన్ కార్యసమితి పేర్కొంది. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల అభినందన సభకు ముఖ్య అతిథిగా అంబేద్కర్ పరినిర్వాన్ భూమి సమితి, జాతీయ దళిత మహాసభ పంచాయతీ చైర్మన్ ఇంద్రేష గజ్‌బియే మాట్లాడుతూ దళిత జాతి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. రిజర్వేషన్లు లేని విభాగాల్లోనూ వాటిని అమలు చేయాలన్నారు. అంబేద్కర్ పంచతీర్థాలకు పనె్నండేళ్ల పోరాట కృషికి కేంద్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు మంజూరు చేయటం దళితుల విజయం అన్నారు. పంచతీర్థాలను ప్రతి దళితుడు దర్శించుకోవాలన్నారు.

కోదండరామ్ వ్యాఖ్యలపై విమర్శలు తగదు

ఉప్పల్, జూన్ 9: ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యలపై మంత్రులు విమర్శలు చేయడం తగదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అదికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా చర్చించి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవుపలికారు. గురువారం ఉప్పల్ కుమ్మరిబస్తీలో శ్రీగాయత్రి స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకోసం పోరాటం చేసిన కోదండరామ్‌ను సమస్యలపై ప్రజలు అడిగే హక్కు ఉందన్నారు. ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ ఇచ్చారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి

ఉప్పల్, జూన్ 9: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించినపుడే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని వికలాంకుల హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. గురువారం బోడుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ పోరాటం ఫలితంగానే వికలాంగులకు రూ.1500 ఫించన్ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం వికలాంగులు ఉద్యమాలు నిర్వహించినా అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్ వికలాంగుల సమస్యలపై స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయ శాఖలో విభజన జరగాలి

వికారాబాద్, జూన్ 9: తెలంగాణ న్యాయవాదులు, జడ్జిలకు అన్యాయం జరిగే విధంగా న్యాయశాఖలో నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపట్టడం సరికాదని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపూర్ణఆనంద్ అన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ విధుల బహిష్కరణ నాలుగో రోజుకు చేరిన సందర్భంగా గురువారం బార్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల ఆరోతేదీ నుండి హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయవాద సంఘాల పిలుపుమేరకు విధుల బహిష్కరణతో నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

ప్రహరీ కూల్చిన వారిపై కఠిన చర్యలు

కులకచర్ల, జూన్ 9; ప్రభుత్వ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కూల్చాల్సింది ప్రభుత్వ అధికారులని, అలాంటిది ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటువారు వచ్చి కూల్చితే అది మనకు చెంపపెట్టులాంటిదని, ఈ విషయంలో ఉదాసీనత పనికిరాదని జిల్లా సంయుక్త పాలనాధికారి ఆమ్రపాలి అన్నారు. కులకచర్ల మండలకేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయ ప్రహరీగోడ కూల్చివేత ప్రదేశాన్ని ఆమె గురువారం పరిశీలించారు.

కేంద్ర పథకాలు ప్రజలకు చేరవేయాలి

ఇబ్రహీంపట్నం, జూన్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోరెడ్డి నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీగార్డెన్స్‌లో భాజపా అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల భాస్కర్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బోనాల పండుగకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగకు జిహెచ్‌ఎంసి విస్తత్ర ఏర్పాట్లు చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగకు వౌలిక సదుపాయాల కల్పన, లైటింగ్ ఏర్పాటు, దోమల నివారణ నిమిత్తం ఫాగింగ్, వాహనాల పార్కింగ్, రాహదారుల నిర్మాణం, ఆలయాలకు కలరింగ్, శానిటేషన్ తదితర పనులను చేపట్టడానికి జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా బోనాల పండుగకు విస్త్రృత ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్, జూన్ 9: మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు చేసిన ఉచిత చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయంతో ప్రశాంతంగా ముగిసింది. నిరుటి కన్నా ఈసారి ఎక్కువ మంది ఈ ప్రసాదం తీసుకునేందుకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం రావటంతో ప్రసాదం పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు రచించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ నిరాటంకంగా ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగి గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రశాంతంగా ముగిసింది.

గిరిజన సర్పంచ్‌పై సస్పెన్షన్‌పై ఉద్యమం

ఖైరతాబాద్, జూన్ 9: అగ్రకుల నేతలు, అధికారుల కుట్రలతో సస్పెన్షన్‌కు గురైన మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సర్పంచ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాష్టవ్య్రాప్త ఉద్యమం చేస్తామని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధిత సర్పంచ్ యాదమ్మతో కలిసి సమితి జాతీయ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడారు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గిరిజన రిజర్వేషన్ హక్కుల ద్వారా గెలిచిన యాదమ్మకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం తీవ్రతరం

ఖైరతాబాద్, జూన్ 9: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో, ఢిల్లీలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఛలో ఢిల్లీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. జాతి కోసం - మేము సైతం అనే నినాదంతో జూలై 19 నుంచి ఆగస్టు 12 వరకు ఢిల్లీలో మహాప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మాదిగల పట్ల చిన్నచూపు, అణచివేతను మానుకోవాలని, వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలని కోరారు.

Pages