S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/05/2018 - 01:47

మాంచెస్టర్, జూలై 4: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారీ సిక్సర్లు కొడతారనిగానీ, పరుగుల వర్షం కురిపిస్తారనిగానీ భయపడలేదని, అందుకే స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలిగానని భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ-20లో నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చిన కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

07/05/2018 - 01:50

మాంచెస్టర్, జూలై 4: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్‌యాదవ్ జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

07/05/2018 - 01:51

మాంచెస్టర్, జూలై 4: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు మంగళవారం రాత్రి ఆతిధ్య జట్టుతో జరిగిన తొలి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కోహ్లీ ఫాస్టెస్ట్‌గా రెండు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ కేవలం 56 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.

07/04/2018 - 13:13

మాంచెస్టర్: విరాట్ కోహ్లీ టీ20ల్లో మరో రికార్డు నమోదు చేశారు. అంతర్జాతీయ టీ20లో వేగంగా రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లాడిన కోహ్లీ 56 ఇన్నింగ్స్‌ల ద్వారా 2012 పరుగులు చేశాడు.

07/04/2018 - 00:14

సెయంట్ పీటర్స్‌బర్గ్, జూలై 3: వాళ్లిద్దరి మధ్య ఫుట్‌బాల్ పోరు కొత్తకాదు. ఇప్పటికి 29సార్లు ఢీకొన్నారు. కానీ, ప్రపంచకప్ మైదానంలో తలపడటం మాత్రం ఇదే ప్రథమం. అందుకే చావో రేవో తేల్చుకోడానికి హోరాహోరీకి దిగారు. ఆ రెండు జట్లే స్వీడన్ -స్విట్జర్లాండ్. స్విస్ ఆటగాళ్లతో ఆడిన మ్యాచ్‌ల్లో గత మూడుదఫాలుగా విజయాలను నమోదు చేసిన అనుభవం స్వీడన్‌ది.

07/04/2018 - 00:05

దుబాయ్, జూలై 3: ఇకముందు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. డబ్లిన్‌లో జరిగిన వార్షిక సమావేశ ముగింపులో ఈమేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. బాల్ ట్యాంపరింగ్‌పై అధికారులు, కమిటీలు సూచించిన వివిధ అంశాలను ఐసీసీ పాలక కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం.. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్ల ఖాతాలో 12 డీమెరిట్ పాయింట్లు జమ చేస్తారు.

07/04/2018 - 00:04

లండన్, జూలై 3: తన కెరీర్‌లో వింబుల్డన్ వంటి ప్రధాన టోర్నమెంట్లలో అత్యధికంగా పాల్గొనడం ద్వారా టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సరసన చోటు దక్కించుకున్నాడు స్పెయిన్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న 36 ఏళ్ల లోపెజ్ ప్రస్తుతం లండన్ వింబుల్డన్‌లో ఆడుతున్నాడు.

07/04/2018 - 00:03

హరారే, జూలై 3: టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇక్కడి స్పోర్ట్స్ క్లబ్‌లో మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ-20 ముక్కోణపు టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ 172 పరుగులతో సరికొత్త రికార్డును తిరగరాయగా, తన ఓపెనింగ్ పార్ట్‌నర్ డీఆర్సీ షార్ట్‌తో కలసి పింఛ్ 223 అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

07/04/2018 - 00:12

రోస్టోవ్, జూలై 3: ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్‌లో అంచనాలకు అందని ఆనందం అభిమానులకు అందుతోంది. అంచనాలకు అందని మ్యాచ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రి రోస్టోవ్ ఎరెనా స్టేడియంలో జపాన్- బెల్జియం మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అనూహ్య మలుపుతో బెల్జియం విజయం సాధిస్తే, ఒకే ఒక్క ఆసియా జట్టు జపాన్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

07/04/2018 - 00:01

న్యూఢిల్లీ, జూలై 3: ఇండోనేసియాలోని జకార్తాలో ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే వివిధ క్రీడలకు సంబంధించి 524 మంది సభ్యులతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. 36 క్రీడాంశాలకు సంబంధించి 277 మంది పురుషులు, 247 మంది మహిళలున్నారు. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో కేవలం 28 క్రీడలకు సంబంధించి 541 మందిని ఎంపిక చేశారు.

Pages