S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/04/2018 - 00:00

జకార్తా, జూలై 3: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ మొదటి రౌండ్ పోటీలో భారత షట్లర్, వరల్డ్ నంబర్ 13 హెచ్‌ఎస్.ప్రణయ్ అద్భుత విజయం సాధించి రెండో రౌండ్‌కు ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 స్కోరు తేడాతో ప్రత్యర్థి చైనాకు చెందిన లిన్ డాన్‌పై విజయం సాధించాడు. 59 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ మూడు సెట్‌ల పాటు కొనసాగింది.

07/03/2018 - 02:18

సమర ఎరెనా: ఊహించిన ఫలితమే ఎదురైంది. ప్రపంచకప్ రెండో రౌండ్‌లో బ్రెజిల్ జిగేల్ మనిపించింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అనిపించుకున్న బ్రెజిల్ ముందు మెక్సికో నిలవలేకపోయింది. తుదివరకూ పోరాడిన మెక్సికో గోల్ సాధించకుండానే ఓటమిని అంగీకరించింది. 2-0తో విజయం సాధించిన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

07/03/2018 - 01:14

నిజ్ని నోవ్‌గొరోడ్ (రష్యా), జూలై 2: ఫిఫా ప్రపంచకప్ 2018లో ఆదివారంనాటి రెండు మ్యాచ్‌లూ సారూప్యత, సంచలనాలతో ముగిశాయ. పెనాల్టీ షూటౌట్ల ఫలితాలతో రెండు జట్లు క్వార్టర్స్‌కు చేరితే, రెండు జట్లు నిష్క్రమించాయి. మాజీ చాంపియన్ స్పెయిన్ ప్రీక్వార్టర్స్ నుంచి నిష్క్రమించటం సంచలనమైతే, ఆతిథ్య రష్యా క్వార్టర్స్‌కు చేరుకోవడమూ సంచలనమే. రష్యా 4-3 తేడాతో స్పెయిన్‌ను ఇంటిముఖం పట్టించటం తెలిసిందే.

07/03/2018 - 01:15

దుబాయ్, జూలై 2: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కనబర్చిన ప్రతిభ, అందిస్తోన్న సేవలకు గుర్తింపుగా ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పురస్కారం ప్రకటించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మూడుసార్లు ప్రపంచకప్ సాధించిన సారథి రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ మాజీ వికెట్ కీపర్ క్లేరీ టేలర్‌కూ చోటుదక్కింది.

07/03/2018 - 01:16

మాంచెస్టర్, జూలై 2: పొట్టి ఫార్మాట్లలో ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆతిధ్య జట్టుతో నేటి నుంచి వచ్చే నెల 11వరకు మూడు టీ-20లు, మూడు వనే్డలు, ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. నిజానికి అన్ని విభాగాల్లో రెండు జట్లు సమానంగా ఆడగల సత్తా ఉన్నవే. గత దశాబ్దకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థిరంగా ఆడుతోంది.

07/03/2018 - 01:00

లండన్, జూలై 2: లండన్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ కప్ టెన్నిస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. సెర్బియా క్రీడాకారుడు, మాజీ వరల్డ్ నెంబర్ 57 డసన్ లజోవిక్‌ను 61, 6-3, 6-4 తేడాతో 79 నిమిషాల్లో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ మొదటి రౌండ్‌లో గెలుపొందడం ఇది 20వ సారి.

07/03/2018 - 00:59

న్యూఢిల్లీ, జూలై 2: ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే ఆసియా క్రీడలకు భారత్ తరఫున ఫుట్‌బాల్ జట్టును పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. వాస్తవానికి ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఖండాంతర స్థాయిలో 1-8 మధ్య ర్యాంకింగ్స్‌లలో నిలిచిన జట్లు మాత్రమే పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయి.

07/02/2018 - 02:30

సోచి (రష్యా): రష్యా ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించాలని కలలుగన్న పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఆశలపై ఉరుగ్వే సంచలనం, పారిస్ సెయింట్-జర్మన్ స్ట్రయికర్ ఎడిన్‌సన్ కవానీ నీళ్లు జల్లాడు. తన అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను మైమరపింపజేసి ప్రత్యర్థిపై 2-1 తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. శనివారం అర్ధరాత్రి పోర్చుగల్-ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

07/02/2018 - 01:20

కైరో, జూలై 1: మహమ్మద్ సలా..ఆఫ్రికా జట్లలో ఫేవరిట్‌గా దిగిన బరిలోకి దిగిన ఈజిప్టు స్టార్ స్ట్రయికర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితేనేం..1990 తర్వాత వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఈజిప్టు ఇపుడు మళ్లీ ఇనే్నళ్ల తర్వాత తొలిసారిగా రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ పాల్గొంది.

07/02/2018 - 01:19

లండన్, జూలై 1: లండన్ వేదికగా జూలై 2 నుంచి 16వరకు నిర్వహించే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా టాప్ స్టార్లు రెడీ అవుతున్నారు. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించిన 36 ఏళ్ల అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి చాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Pages