S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/02/2018 - 01:17

కజాన్ (రష్యా), జూలై 1: ఫుట్‌బాల్ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ప్రస్తుతం జరుగుతున్న రష్యా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఏమాత్రం సత్తా చూపలేకపోయారు.

07/02/2018 - 01:17

సోచి (రష్యా), జూలై 1: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఓటమితో టోర్నమెంట్ నుంచే నిష్క్రమించిన పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో భవిష్యత్తు అంతర్జాతీయ వేదికలపై ఆడే అంశంపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

07/02/2018 - 01:16

న్యూఢిల్లీ, జూలై 1: ఈనెల 2 నుంచి మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడు టీ-20 సిరీస్‌లలో పాల్గొనే టీమిండియా జట్టులో కొద్దిమార్పులు చేశారు. గాయపడిన వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్య, మీడియం పేసర్ దీపక్ చాహర్‌ను ఎంపిక చేశారు.

07/02/2018 - 01:16

న్యూఢిల్లీ, జూలై 1: ఈ ఏడాది ఆగస్టు 18నుంచి సెప్టెంబర్ 2వరకు ఇండోనేషియాలో నిర్వహించే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే 11మంది సభ్యులు కలిగిన స్విమ్మింగ్ బృందాన్ని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటించింది. ఈ బృందంలో విర్ధవాల్ ఖడే, ఖేలో ఇండియా చాంపియన్ శ్రీహరి నటరాజ్ (వీరిద్దరూ గతంలోనే పోటీలకు అర్హత సాధించారు) ఉన్నారు.

07/02/2018 - 01:15

న్యూఢిల్లీ, జూలై 1: ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు రోషన్ బొపన్న-దివిజ్ శరణ్ జోడీగా ఆడనున్నారు.

07/02/2018 - 01:15

కౌలాలంపూర్, జూలై 1: మలేషియాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి లీ చొంగ్ ఉయ్ మలేషియా ఓపెన్ టైటిల్‌ను అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమెకు జపాన్‌కు చెందిన షట్లర్ కెంటో మొమొటాను 21-17, 23-21తో ఓడించడం ద్వారా ఈ టైటిల్‌ను 12వసారి దక్కించుకుని చరిత్రను తిరగరాసింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి లీ ప్రత్యర్థిపై గట్టి పట్టు సాధించి, ఎటాకింగ్ గేమ్‌ను ఆడడంతో ప్రత్యర్థి కోలుకోలేకపోయింది.

07/02/2018 - 01:14

బ్రెడా (నెదర్లాండ్స్), జూలై 1: హాకీ చాంపియన్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను 3-1తో ఓడించింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. 24వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు బ్లేక్ గోవెర్స్ తొలి చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. దీంతో ఒత్తిడిలో పడిన భారత్ గోల్ కోసం తీవ్రంగా శ్రమించింది.

07/02/2018 - 01:14

రొస్టోవ్ ఆన్ డన్ (రష్యా), జూలై 1: ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్ షిప్‌లో భాగంగా సోమవారం జరిగే ప్రీ కార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌పై తప్పకుండా పైచేయి సాధిస్తామని బెల్జియం గట్టి ధీమాతో ఉంది. అయితే, ఇందుకు ఆటగాళ్లంతా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగురూకతతో వ్యవహరించాలని జట్టు కెప్టెన్ డ్రీస్ మెర్టెన్స్ హెచ్చరించాడు.

07/02/2018 - 01:24

మాస్కోలో ఆదివారం జరిగిన ఫిఫా సాకర్ వరల్డ్ కప్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రీ క్వార్టర్స్‌లో బలమైన స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన రష్యా జట్టు. ఆతిథ్య దేశం కాబట్టి ఈ టోర్నీలో ఆడే అవకాశం వచ్చిందని, లేకపోతే, రష్యాకు ఆ సామర్థ్యం లేదని వచ్చిన విమర్శలకు ఈ విజయంతో సరైన సమాధానం ఇచ్చింది. ఇరు జట్లు తీవ్ర స్థాయలో పోటీపడిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

07/01/2018 - 01:55

చావో రేవో పోరులో ఫ్రాన్స్ విజయం సాధించింది. ప్రత్యర్థి దాటికి నిలువలేని అర్జెంటీనా మైదానంలో మోకరిల్లింది. మెస్సీపై పెట్టుకున్న ఆశలు మాయమవడంతో, ప్రపంచ కప్‌నుంచే అర్జెంటీనా వైదొలిగింది. ‘మాది వీరోచిత పోరాటం’ అంటూ అర్జెంటీనా కోచ్ జార్జ్ సంపోలి చేసిన హెచ్చరికలు ఫ్రాన్స్ ఆటగాళ్లను భయపెట్టలేకపోయాయి.

Pages