S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/14/2017 - 00:46

డిఫెండింగ్ చాంపియ్ క్లేవ్‌లాండ్ కావలియర్స్‌ను 4-1 తేడాతో ఓడించి, ఎన్‌బిఎ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకున్న
గోల్డెన్ స్టేట్ వారియర్స్ జట్టు. గత మూడేళ్లలో ఈ జట్టు విజేతగా నిలవడం ఇది రెండోసారి

06/14/2017 - 00:44

దుబాయ్, జూన్ 13: ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న కోహ్లీ తన సమీప ప్రత్యర్థి డేవిడ్ వార్నర్‌ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. ఎబి డివిలియర్స్ మూడో స్థానంలో ఉండగా, ‘టాప్-10’లో శిఖర్ ధావన్‌కు చోటు దక్కింది.

06/14/2017 - 00:24

బర్మింగ్‌హామ్, జూన్ 13: ఐపిఎల్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ప్రముఖ చిత్రకారుడు సషా జాఫ్రీ వేసిన పెయింట్‌కు అక్షరాలా 23.77 కోట్ల రూపాయల ధర పలికింది. బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన పూనమ్ గుప్తా ఈ భారీ మొత్తాన్ని చెల్లించింది.

06/14/2017 - 00:23

రొసారియో, జూన్ 13: బార్సిలోనా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ పెళ్లికి అతని స్వస్థలమైన రొసారియో ముస్తాబవుతున్నది. చిన్ననాటి స్నేహితురాలు ఆంటోనెల్లా రొకుజోతో మెస్సీ సుమారు దశాబ్దకాలంగా కాపురం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు థియాగో ఐదేళ్లవాడు. రెండో వాడు మాటియో వయసు రెండేళ్లు.

06/14/2017 - 00:22

బర్మింగ్‌హామ్, జూన్ 13: మానవ సంబంధాల్లో, ప్రత్యేకించి పరస్పర ఉత్తమ సంబంధాల్లో కొన్ని వైరుధ్యాలు తప్పవని, క్రికెట్‌కూ ఈ సూత్రం వర్తిస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య సయోధ్య లేదని, ఇద్దరూ పరస్పరం విభేదించుకుంటున్నారని వచ్చిన వార్తలపై వ్యాఖ్యానించడానికి క్లార్క్ నిరాకరించాడు.

06/13/2017 - 01:08

న్యూఢిల్లీ, జూన్ 12: వెస్టిండీస్ టూర్ ముగిసే వరకూ అనిల్ కుంబ్లేనే కోచ్‌గా కొనసాగుతాడని బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) తెలిపింది. అయితే, దీనికి కుంబ్లే అంగీకరించాల్సి ఉందని పేర్కొంది. సోమవారం సిఒఎ చీఫ్ వినోద్ రాయ్, సభ్యులు విక్రం లిమాయే, డయానా ఎడుల్జీ సమావేశమై పలు అంశాలను చర్చించారు.

06/13/2017 - 01:09

కార్డ్ఫి, జూన్ 12: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను మూడు వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లంకను 236 పరుగులకే ఆలౌట్ చేసిన పాక్ ఆతర్వాత లక్ష్యాన్ని 44.5 ఓవర్లలో, ఏడు వికెట్లు కోల్పోయ ఛేదంచింది. ఒకానొక దశలో ఓటమి ఖాయంగా కనిపించినప్పటికీ, సర్ఫ్‌రాజ్ అహ్మద్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయపథంలో నడిపించాడు.

06/13/2017 - 01:02

లండన్, జూన్ 12: జట్టు ప్రయోజనాల కోసం ఒక్కోసారి సహచరులతో పరుషంగా మాట్లాడక తప్పదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వారికి తమ బాధ్యతలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అయితే, పొరపాట్లు ఎక్కడ జరిగియానే విషయంలో స్పష్టత ఉండాలని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు.

06/13/2017 - 00:57

చిత్రం.. మాంట్రియల్‌లో జరిగిన కెనెడియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న లూయిస్ హామిల్టన్ (మెర్సిడిజ్)

06/13/2017 - 00:54

లండన్, జూన్ 12: దక్షిణాఫ్రికాను సరైన మార్గంలో నడిపే శక్తిసామర్థ్యాలున్న గొప్ప కెప్టెన్‌గా ఎబి డివిలియర్స్ తనను తాను అభివర్ణించుకున్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ నుంచి తమ జట్టు నిష్క్రమించడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కీలక మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొని పరాజయాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఇంటిదారి పట్టింది.

Pages