S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/28/2017 - 03:52

సిడ్నీ, జనవరి 27: న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పాకిస్తాన్‌తో అడెలైడ్‌లో జరిగిన చివరి, ఐదో వనే్డలో ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. అతని ఎడమకాలి మడమ బెణికిందని, దీనితో అతనికి విశ్రాంతి అవసరమైందని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

01/28/2017 - 03:51

న్యూఢిల్లీ, జనవరి 27: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడంతోపాటు, సమర్థులను గుర్తించి, వారికి తగిన అత్యుత్తమ శిక్షణ ఇప్పించడానికి ఏర్పడిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) చైర్మన్‌గా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఏస్ షూటర్ అభినవ్ బింద్రా ఎంపికయ్యాడు. ఇంతకు ముందు కూడా ‘టాప్’లో బింద్రా సభ్యుడిగా కొనసాగాడు.

01/27/2017 - 02:37

మెల్బోర్న్, జనవరి 26: ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనా మరోసారి ఆధిపత్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వీరిద్దరూ టైటిల్ కోసం యుద్ధానికి సై అనడంతో, చాలాకాలం తర్వాత అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌ని తిలకించే అవకాశం దక్కనుంది.

01/27/2017 - 02:35

కాన్పూర్, జనవరి 26: భారత్‌తో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో ఇంగ్లాండ్ బోణీ చేసింది. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌ని ఏడు వికెట్ల తేడాతో గెల్చుకొని, 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 148 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 147 పరుగులు చేసింది.

01/27/2017 - 02:33

బెంగళూరు, జనవరి 26: బెంగళూరు యూనివర్శిటీ ఇవ్వచూపిన గౌరవ డాక్టరేట్‌ను భారత మాజీ కెప్టెన్, అండర్-19 క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ తిరస్కరించాడు. ఈ విధంగా డాక్టరేట్‌ను అందుకోవడం తనకు ఇష్టం లేదని, నిజంగానే క్రీడా రంగంలో పరిశోధన చేసి, సగర్వంగా దానిని స్వీకరించడంలోనే ఆనందం ఉందని ద్రవిడ్ వ్యాఖ్యానించినట్టు బెంగళూరు యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

01/27/2017 - 02:33

విక్టోరియా, జనవరి 26: ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో అలెడ్ కారీ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈస్ట్ బలారెట్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ పాయింట్ క్లబ్ తరఫున ఆడిన కారీ ఎనిమిది ఓవర్లు వేసి, ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. అయితే, తొమ్మిదో ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది. కారీ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు కూల్చాడు.

01/27/2017 - 02:30

అడెలైడ్, జనవరి 26: ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో విజృభించడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 369 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా తర్వాత పాకిస్తాన్‌ను 312 పరుగులకు కట్టడి చేసి, చివరిదైన ఐదో వనే్డను 57 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు వార్నర్, హెడ్ గట్టి పునాది వేశారు.

01/27/2017 - 02:29

మెల్బోర్న్, జనవరి 26: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ మరో టైటిల్ అందుకునే దిశగా దూసుకెళుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అతను స్టానిస్లాస్ వావ్రిన్కాను 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు.

01/27/2017 - 02:28

కేప్‌టౌన్, జనవరి 26: దక్షిణాఫ్రికాపై శ్రీలంక ఎదురుదాడికి దిగింది. చివరిదైన మూడో వనే్డను ఐదు వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రత్యర్థిని 169 పరుగులకే కట్టడి చేసిన లంక ఆతర్వాత మరో బంతి మిగిలి ఉండగా, ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి గెలిచింది.

01/27/2017 - 02:27

లాసస్నే, జనవరి 26: సహచరుడు డోప్ పరీక్షలో పట్టుబడడం ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒలింపిక్స్‌లో అతను తొమ్మిది స్వర్ణాలు సాధించగా, జమైకా రిలే జట్టు సభ్యుడు నెస్టా కార్టర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు రుజువైంది. దీనితో రిలేలో జమైకా సాధించిన స్వర్ణ పతకాన్ని అధికారులు రద్దు చేయగా, బోల్ట్ ఒక పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

Pages