S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/18/2016 - 05:56

బెంగళూరు, సెప్టెంబర్ 17: ఎవరైనా సరే వర్తమానికి తగ్గట్టుగా ఆలోచించాలే తప్ప గతంతో పోలుస్తూ నిర్ణయాలకు రాకూడదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కృష్ణపట్నం గోల్ఫ్ టోర్నమెంట్‌ను ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌రౌండర్ల మధ్యే పోలిక సాధ్యమవుతుందని అన్నాడు.

09/17/2016 - 16:59

కాన్పూర్: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పడు మరో రికార్డుపై గురి పెట్టాడు. విండీస్తో సిరీస్లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో మెరిసిన అశ్విన్ న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్టులో బంతితో రాణిస్తే మరో అరుదైన ఘనత అతని ఖాతాలో చేరుతుంది. శనివారం బర్త్ డే జరుపుకుంటున్న అశ్విన్. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్ల్లో193 వికెట్లు సాధించాడు.

09/17/2016 - 06:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనిచ్చింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా తొలత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 7 వికెట్లకు 324 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

09/17/2016 - 06:06

తీవ్రవాదుల్లా చూస్తారు

09/17/2016 - 06:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ అనారోగ్యం కారణంగా డేవిస్ కప్ మొదటి రోజు మ్యాచ్ నుంచి వైదొలిగాడు. అతను ఉదర సంబంధమైన సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే, రాంకుమార్ రామనాథన్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్‌లో పాల్గొనడం లేదని స్పెయిన్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతను ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

09/17/2016 - 06:03

ఢాకా, సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, అతని భార్య అమ్మే అహ్మద్ శిషిర్‌కు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. వీరిని కాక్సెస్ బజార్‌లో దించిన హెలికాప్టర్ తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. ఆ సంఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

09/17/2016 - 06:03

బ్రిస్బేన్, సెప్టెంబర్ 16: భారత్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల ‘ఎ’ సిరీస్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ ఐదు వికెట్లకు 319 పరుగులు సాధించింది. హిల్టన్ కార్ట్‌రైట్ 99 పరుగులు చేసి, కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. బెయూ వెబ్‌స్టర్ 79, నిక్ మాడిసన్ 81 పరుగులతో రాణించారు. శార్దూల్ ఠాకూర్ 71 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

09/16/2016 - 08:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: డేవిస్ కప్ ఎలైట్ వరల్డ్ గ్రూప్ టెన్నిస్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. డేవిస్ కప్ ర్యాంకింగ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే భారత్ కంటే స్పెయిన్ మెరుగైన స్థితిలో ఉంది. ఈ జాబితాలో స్పెయిన్‌ది 14వ స్థానంకాగా, భారత్ 20వ స్థానంలో నిలిచింది.

09/16/2016 - 08:27

బ్రిస్బేన్, సెప్టెంబర్ 15: నాలుగు దేశాల ‘ఎ’ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ‘ఎ’తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 169 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ‘ఎ’ కెప్టెన్ జో బర్న్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ ‘ఎ’ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది.

09/16/2016 - 08:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: న్యూజిలాండ్‌తో ఈనెల 25 నుంచి కాన్పూర్‌లో మొదలయ్యే టెస్టును చూసేందుకు రావాల్సిందిగా మాజీ కెప్టెన్లను ఆహ్వానించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయంచింది. భారత్‌కు 500వ టెస్టు కావడంతో ఆ మ్యా చ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Pages