S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/01/2016 - 05:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ 27 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. కరుణ్ నాయక్, బిల్లింగ్స్ అర్ధ శతకాలతో రాణించడంతో డేర్‌డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. అనంతరం నైట్ రైడర్స్‌ను 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ చేసింది.

05/01/2016 - 05:43

ఉహాన్ (చైనా), ఆగస్టు 30: భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ తన కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న వాంగ్ ఇహాన్‌ను ఢీకొని, 16-21, 14-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ తరఫున బరిలోకి దిగిన మిగతా వారంతా ఇంతకు ముందే నిష్క్రమించారు.

05/01/2016 - 05:42

సెయింట్ జాన్స్, ఏప్రిల్ 30: పలు సమస్యలపై ఆటగాళ్లతో చర్చించి, వాటిని పరిష్కరిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్టులోని కొన్ని అంశాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తున్న కొంత మంది వెస్టిండీస్ క్రికెటర్లు జీతభత్యాలను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

05/01/2016 - 05:41

కోల్‌కతా, ఏప్రిల్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా సేవలు అందించిన జగ్మోహన్ దాల్మియాపై చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలపై అతని భార్య చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్ అభివృద్ధికి జీవితకాలం శ్రమించిన అతనిని విమర్శించే అధికారం ఎవరికీ లేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

04/30/2016 - 08:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతా పొగట్, ఆమె సోదరి బబితా కుమారి సహా నలుగురు రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలన్న వీరి ఆశలు ఆవిరైపోయాయి.

04/30/2016 - 08:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా సుహృద్భావ రాయబారి (గుడ్‌విల్ అంబాసిడర్)గా వ్యవహరించనున్నాడు.

04/30/2016 - 08:17

పుణె, ఏప్రిల్ 29: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ లయన్స్ జట్టు మరో విజయంతో సత్తా చాటుకుంది. పుణెలోని ఎంసిఎ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఆతిథ్య రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టును ఓడించి ఆరవ విజయాన్ని నమోదు చేసుకుంది.

04/30/2016 - 08:15

షాంఘై, ఏప్రిల్ 29: ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్ మొదటి స్టేజ్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో దీపికా కుమారి, బొంబైలా దేవి, లక్ష్మీరాణి మాజీలతో కూడిన భారత జట్టు 5-3 తేడాతో టాప్‌సీడ్ జర్మనీ జట్టుపై విజయం సాధించింది.

04/30/2016 - 08:13

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 29: ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో స్థిరంగా ముందుకు సాగుతున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనాలోని ఉహాన్‌లో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ షిగ్జియాన్ వాంగ్‌పై వరుస గేముల తేడాతో విజయం సాధించింది.

04/29/2016 - 07:37

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆల్‌రౌండర్ సయ్యద్ షాబుద్దీన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అతను 80 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2,567 పరుగులు సాధించాడు. 248 వికెట్లు పడగొట్టాడు. 2013 తర్వాత అతనికి దేశవాళీ పోటీల్లో ఆడే అవకాశం రాలేదు.

Pages