S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/28/2016 - 04:50

న్యూయార్క్, ఆగస్టు 27: భారత టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మెయన్ డ్రా కు అర్హత సంపాదించాడు. చివరి క్వాలిఫయర్‌లో అతను సెర్బియాకు చెందిన పెజా క్రిస్టిన్‌ను 6-3, 6-0 తేడాతో సునాయాసంగా ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 56 నిమిషాల్లో ముగియడం గమనార్హం. కాగా, భారత్ నుంచి పురుషుల సింగిల్స్ మెయన్ డ్రాకు సాకేత్ ఒక్కడే అర్హత సంపాదించాడు.

08/28/2016 - 04:49

మెక్‌కే (ఆస్ట్రేలియా), ఆగస్టు 27: నాలుగు జట్లు పోటీపడుతున్న క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ పర్ఫార్మెన్స్ స్క్వాడ్ (ఎన్‌పిఎస్)పై భారత్ ‘ఎ’ ఆరు వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. కేదార్ జాదవ్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ శతకాలతో రాణించి, భారత్ ‘ఎ’ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎన్‌పిఎస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసింది.

08/28/2016 - 04:49

నైరోబీ, ఆగస్టు 27: కెన్యా ఒలింపిక్ కమిటీ (ఎన్‌ఒసికె) ప్రధాన కార్యదర్శి ఫ్రాన్సిస్ పాల్‌ను పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని కెన్యా క్రీడా శాఖ మంత్రి హసన్ వారియో ప్రకటించాడు. ఎన్‌ఒసికె నుంచి అతనిని తప్పిస్తున్నట్టు తెలిపాడు.

,
08/28/2016 - 04:47

న్యూయార్క్, ఆగస్టు 26: ప్రపంచ నంబర్ వన్ సెరెనా ఈఏడాది వరుసగా రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలో విఫలమైన తర్వాత, మూడోదైన వింబుల్డన్‌లో టైటిల్ సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావడమేగాక, కెరీర్‌లో అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకున్న క్రీడాకారిణుల జాబితాలో రెండో స్థానాన్ని స్ట్ఫె గ్రాఫ్‌తో కలిసి పంచుకుంటున్నది.

08/27/2016 - 05:50

ఫోర్ట్ లాడర్‌డేల్ (అమెరికా), ఆగస్టు 26: మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో సందడి పెరిగింది. బాస్కెట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న అమెరికాలో రగ్బీ, సాకర్, టెన్నిస్, స్విమ్మింగ్ తర్వాతి స్థానాలను ఆక్రమిస్తాయి. క్రికెట్‌ను ఎన్నో దశాబ్దాలుగా అమెరికా దూరంగా ఉంచింది.

08/27/2016 - 05:47

రియో ఒలింపిక్స్ వల్ల బ్రెజిల్ ఖజానా ఖాళీ అయింది. పన్ను చెల్లింపుదారులపై పెనుభారం పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ తేరుకోవడానికి కనీసం దశాబ్దకాలం పడుతుందని అంచనా. ఇప్పటికే ఆదాయం, ఖర్చులను పరిశీలిస్తున్న బ్రెజిల్ సర్కారు ఒలింపిక్స్ వల్ల భారీగా నష్టపోయామన్న నిర్ధారణకు వచ్చేసింది.

08/27/2016 - 05:45

హైదరాబాద్, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత తెలుగు అమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధు బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయిందని సమాచారం. ఒలింపిక్స్‌కు ముందు 20 లక్షలుగా ఉన్న బ్రాండ్ వాల్యూ ఇప్పుడు సుమారు రెండు కోట్లకు చేరిందని నిపుణులు అంటున్నారు.

08/27/2016 - 05:45

ఒలింపిక్స్ నిర్వాహణ వల్ల వందల సంఖ్యలో నష్టాలుంటే, పదుల సంఖ్యలో లాభాలు లేకపోలేదు. గుడ్డిలో మెల్ల అన్న చందంగా ప్రభుత్వ రవాణా మెరుగుపడింది. బ్రెజిల్‌లో, ముఖ్యంగా రియో వంటి నగరాల్లో రవాణా సౌకర్యాలు సక్రమంగా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఒలింపిక్స్ కోసం చాలా ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేశారు. పాత రోడ్లకు మరమ్మతులు చేశారు. కొత్తకొత్త మార్గాల్లో రైల్వే ట్రాక్స్ కూడా వచ్చాయి.

08/27/2016 - 05:44

గ్రేటర్ నోయిడా, ఆగస్టు 26: ఇండియా గ్రీన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ని ఇండియా రెడ్ జట్టు 217 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. కుల్దీప్ యాదవ్ 88 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, గ్రీన్ జట్టును దారుణంగా దెబ్బతీశాడు. అతని విజృంభణను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన గ్రీన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 277 పరుగులకే ఆలౌటైంది. 497 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో గ్రీన్ దారుణంగా విఫలమైంది.

08/27/2016 - 05:44

న్యూయార్క్, ఆగస్టు 26: భారత టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మెయిన్ డ్రాకు చేరువయ్యాడు. మిచెల్ క్రూగర్‌ను 7-6, 6-4 తేడాతో ఓడించిన అతను ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు చేరాడు. అందులోనూ గెలిస్తే, మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తాడు.
డేవిస్ పోటీలకు అదే జట్టు

Pages