S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/16/2016 - 05:55

న్యూపోర్ట్, జూలై 15: న్యూపోర్ట్‌లో జరుగుతున్న హాల్ ఆఫ్ ఫేమ్ ఎటిపి టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో సైప్రస్ ఆటగాడు మార్కోస్ బగ్దాటిస్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన బగ్దాటిస్ గురువారం అర్థరాత్రి జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఏడో సీడ్ ఆటగాడు డుడీ సెలాపై విజయం సాధించాడు.

07/16/2016 - 05:54

న్యూఢిల్లీ, జూలై 15: బ్రెజిల్‌లోని రియోడిజనిరోలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఒలింపిక్ గేమ్స్‌లో మన దేశానికి చెందిన ముగ్గురు బాక్సర్లు శివ్ థాపా, మనోజ్ కుమార్, వికాస్ కృష్ణన్‌లు భారత జాతీయ పతాకం కింద పాల్గొనడానికి అనుమతించారు. ప్రపంచ బాక్సింగ్ సంస్థ ఏఐబిఏ భారత బృందాన్ని జాతీయ పతాకం కింద పాల్గొనడానికి అనుమతించింది.

07/16/2016 - 05:54

న్యూఢిల్లీ, జూలై 15: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత ఇప్పటివరకు ఓటమి ఎరుగని భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ శనివారం ఇక్కడ డబ్ల్యుటిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్‌ను ఢీకొంటున్నాడు.హోప్‌ను సులువుగా ఓడించగలనన్న ధీమాతో అతను ఉన్నాడు.

07/15/2016 - 17:54

దిల్లీ: భారత్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. భారత్‌ - ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మొదటి టెస్టు నవంబర్‌ 9న రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది.

07/15/2016 - 05:01

చెంగ్డూ (చైనా), జూలై 14: చైనాలోని చెంగ్డూలో జరిగిన మహిళల ఫైడ్ గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. గురువారం ఆమె రష్యాకు చెందిన ఓల్గా గిర్యాతో ఉత్కంఠ భరితంగా జరిగిన చివరి రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

,
07/15/2016 - 04:59

ముంబయి, జూలై 14: భారత మాజీ టెస్టు క్రికెటర్ ప్రవీణ్ అమ్రే, కర్నాటక మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్‌లకు ద్వంద్వ ప్రయోజనాలున్నట్లు క్రికెట్‌బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్ గుర్తించారు. అయితే భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌పై వచ్చిన ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

07/15/2016 - 04:53

బెంగళూరు, జూలై 14: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో సీజన్‌లో టేబుల్ టాపర్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు యు-ముంబా షాక్ ఇచ్చింది. గురువారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో యు-ముంబా 29-23 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో నాలుగో ఎగబాకింది. ఎంతో అనుభవజ్ఞులైన రాకేష్ కుమార్, అనూప్ కుమార్ 12 పాయింట్లు సాధించి యు-ముంబాకు ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

07/15/2016 - 04:51

న్యూఢిల్లీ, జూలై 14: టెస్టు క్రికెట్ నుంచి చాలా కాలం క్రితమే రిటైర్ అయినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు సారథిగా కొనసాగుతూ వాణిజ్య ప్రకటనల (ఎండార్స్‌మెంట్ల) రంగంలో ప్రత్యేక స్థానాన్ని కలిగివున్న మహేంద్ర సింగ్ ధోనీని అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ‘స్పార్టాన్ స్పోర్ట్స్’ సంస్థ రూ.20 కోట్లకు పైగా సగించింది.

07/15/2016 - 04:50

న్యూఢిల్లీ, జూలై 14: ఫుట్‌బాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ మరింత ఉన్నత స్థానానికి దూసుకెళ్లింది. గత నెలలో లావోస్‌పై వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు తాజాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలను ఎగబాకి 152వ ర్యాంకుకు చేరుకుంది.

07/15/2016 - 04:49

చండీగఢ్, జూలై 14: ఇక్కడ శుక్రవారంనుంచి ప్రారంభమయ్యే ఆసియా/ఓసియానా గ్రూపు-1డేవిస్ కప్ పోటీలో భాగంగా భారత్ కొరియా జట్టును ఢీకొంటోంది. అయితే పైకి ఫేవరేట్‌గా కనిపిస్తున్నప్పటికీ అతిథ్య జట్టును అనేక సమస్యలు వేధిస్తుండడం గమనార్హం.

Pages